AP Lithium Ion Battery Plant Investment: ఏపీకి ( Andhra Pradesh) మరో గుడ్ న్యూస్. రాష్ట్రానికి భారీ పెట్టుబడి వచ్చింది. దాదాపు రూ.8,175 కోట్లతో లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఏపీలో తన పరిశ్రమ పెట్టేందుకు ముందుకు వచ్చింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనుంది. ఎందుకుగాను ఏపీ ప్రభుత్వం 300 ఎకరాలను కేటాయించింది. ఈ పరిశ్రమతో దాదాపు 3,000 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఒకవైపు ఐటీ కంపెనీలు, మరోవైపు పరిశ్రమలు తరలివస్తున్నాయి. ప్రధానంగా విశాఖ జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. ఈ తరుణంలోనే ఈ కొత్త బ్యాటరీ కంపెనీ అనకాపల్లి జిల్లాకు వచ్చింది.
* విద్యుత్ వినియోగంలో కీలకం
విద్యుత్ వినియోగంలో ఈ బ్యాటరీలు కీలక పాత్ర పోషిస్తాయి. విద్యుత్తును నిల్వ ఉంచేందుకు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్( energy storage systems ) ఉంటాయి. వీటికి సంబంధించిన బెస్ లో లిథియన్ ఆయాన్ బ్యాటరీలు ఉపయోగిస్తారు. ఆ బ్యాటరీల తయారీ ఫ్యాక్టరీని వారి ఎనర్జీ స్టోరేజ్ సిస్టం ప్రైవేట్ లిమిటెడ్ రాంబిల్లిలో ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.8175 కోట్ల పెట్టుబడితో.. 16 గిగావాట్ అవర్ లిథియం అయాన్ బ్యాటరీ పరిశ్రమ ఏర్పాటు కాబోతోంది. పరిశ్రమ ఏర్పాటుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 300 ఎకరాలను కేటాయిస్తోంది. 2027 జూలై నాటికి మొదటి దశ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిశ్రమ రాకతో పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలగనున్నాయి నిరుద్యోగ యువతకు.
* విదేశాల్లో భారీ ఉత్పత్తులు..
ఈ ఫ్యాక్టరీలో సెల్, ప్యాక్, స్టోరేజ్ కు అవసరమైన బ్యాటరీలు తయారు చేయనున్నారు. ఇప్పటికే ఈ పరిశ్రమ గుజరాత్ తో పాటు అమెరికాలో తమ ఉత్పత్తులను అందిస్తోంది. అమెరికాలోని టెక్సాస్ లో 14.9 గిగావాట్ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్లను కూడా నిర్వహిస్తోంది. అమెరికా, కెనడా, ఇటలీ, తుర్కియో, వియత్నంతోపాటు 30 దేశాలకు ఈ కంపెనీ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. అటువంటి పరిశ్రమ మన రాష్ట్రంలో విస్తరిస్తుండడం శుభపరిణామం. దేశంలో చాలా తక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రానికి భారీ పెట్టుబడితో ఈ పరిశ్రమ రావడం శుభ పరిణామం.