Ambati Rambabu Sensational Comment: చేసేటప్పుడు ఒక ఫ్యాషన్ గా ఉంటుంది.. హీరోయిజం చూపించినట్టు ఉంటుంది. ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సినిమాలో ఐ జి పాత్రధారి సాయికుమార్ జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి చెప్పే డైలాగులు ఇవి. ఇప్పుడు వైసీపీ నేత అంబటి రాంబాబు విషయంలో ఇది అచ్చంగా సూట్ అవుతుంది. గత కొద్దిరోజులుగా ఆయనను కాపు టైగర్ గా, సూపర్ మాన్ గా, హీరోగా చూపిస్తున్నారు. అయితే అది అవసరం మేరకు, అవసర రాజకీయాల కోసం చేసే ప్రయత్నం. గతంలో వైసీపీలో చాలామంది ఇలానే హీరోయిజం చూపించారు. కానీ పార్టీలోనే అడ్రస్ గల్లంతయింది వారిది.
పక్కకు తప్పిపోయిన నేతలు..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీ ఆవిర్భావం నుంచి లెక్కేసుకుంటే పదుల సంఖ్యలో లీడర్లు ఇలా తెరపైకి వచ్చి అలా కనుమరుగైపోయారు. జగన్మోహన్ రెడ్డి పార్టీ ఏర్పాటు చేసినప్పుడు ఆయన పక్కనే ఉండేవారు దివంగత నేత సబ్బం హరి. కానీ అటువంటి నేతను పక్కన పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి. తనను వాడుకొని వదిలేసారు అన్న బాధ చివరి క్షణాల్లో సబ్బం హరి తలచుకుంటూ బాధపడ్డారు. విశాఖ జిల్లాకు చెందిన కొణతాల రామకృష్ణ పరిస్థితి కూడా అంతే. 2014 ఎన్నికల్లో విజయమ్మను తెచ్చి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయించారు కొణతాల. ఆ ఎన్నికల్లో విజయమ్మ ఓడిపోయేసరికి రామకృష్ణను పక్కకు తప్పించారు జగన్. సుమారు 10 ఏళ్ల పాటు రాజకీయ జీవితాన్ని కోల్పోయారు కొణతాల రామకృష్ణ. టిడిపిలో ఎంతో గౌరవంగా మెలిగే వారు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు. అనవసరంగా లేనిపోనివి చెప్పి ఆయనను పార్టీలోకి రప్పించి వదిలేసారు.
Also Read: టిడిపిలో కొత్తగా నిఘా..!
నెంబర్ 2 లు ఏరి?
ఇక పార్టీలో నెంబర్ 2ల విషయంలో చాలా రకాల అంశాలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో తెలంగాణకు చెందిన కొండా సురేఖ( Konda Surekha ) దంపతులకు ఎంతగానో ప్రాధాన్యం ఇచ్చినట్టు కనిపించే వారు జగన్. గోనె ప్రకాశరావు పరిస్థితి కూడా అంతే. అంతెందుకు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అయితే 2019 ఎన్నికల్లో మేనిఫెస్టో తయారీలో కీలక వ్యక్తి. అటువంటి వ్యక్తిని సాధారణ ఎమ్మెల్సీ కె పరిమితం చేశారు.. జగన్మోహన్ రెడ్డి తో తొలినాళ్లలో నడిచిన ఏ ఒక్క నేత కూడా ఇప్పుడు లేరు. అంతెందుకు అన్న కోసం షర్మిల ఎంతగానో శ్రమించారు. ఇక తల్లి విజయమ్మ భర్త ఉన్నప్పుడు ఎప్పుడూ రాజకీయాల జోలికి రాలేదు. ఆమె సైతం సైడు అయ్యారు. విజయసాయిరెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటులో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు ఎంత వరకైనా తగ్గేందుకు సిద్ధపడ్డారు. ఆయన పరిస్థితి ఎలా మారిందో ఇప్పుడు తెలియనిది కాదు.
ఆ ప్రకటనలతో డేంజర్..
ఇప్పుడు అంబటి రాంబాబు( ambati Rambabu) ప్రకటనలు చూస్తుంటే అలానే ఉన్నాయి. నడిరోడ్డుపై సీఎం చంద్రబాబు పై తిట్ల దండకం అందుకున్నారు. పదే పదే లోకేష్ రెడ్ బుక్ కి తన కుక్క కూడా భయపడదు అంటూ ప్రకటనలు చేస్తున్నారు. అటువంటి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి కాపు టైగర్ గా ప్రమోట్ చేశారు. చివరకు కాపు నుంచి రెడ్డిగా మారిన ముద్రగడ కూడా బయటకు వచ్చి అంబటి రాంబాబు ను రేంజ్ లో ఎత్తుతున్నారు. కానీ ఒకటి ఆలోచించుకోవాలి అంబటి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభం నుంచి ఉన్న నేతలు.. పక్కకు వెళ్లిపోయిన నేతలు గురించి ఆలోచన చేస్తే అంబటికి జ్ఞానోదయం కావడం ఖాయం. మరి అంతలా ఆలోచన చేస్తారా అంటే చూడాలి.