Srinivasa Mangapuram First Day Collections: రమేష్ బాబు కొడుకు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన మొదటి చిత్రం ‘శ్రీనివాస మంగపురం’ నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. ఈ సినిమాకు ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు కానీ, జయకృష్ణ నటనకు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా మహేష్ ఫ్యాన్స్ ఈ చిత్రానికి చాలా డీసెంట్ స్థాయి ఓపెనింగ్ ని అందించారు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ‘స్పైడర్ మ్యాన్ : బ్రాండ్ న్యూ డే’ కి పోటీగా విడుదలైంది. ఆ సినిమా ప్రభావం ఓపెనింగ్స్ పై కాస్త ఎఫెక్ట్ చూపించినప్పటికీ , చివరికి డీసెంట్ స్థాయి ఓపెనింగ్ నే సొంతం చేసుకుంది. ప్రాంతాల వారీగా ఈ చిత్రానికి ఎంత గ్రాస్ వసూళ్లు వచ్చాయో ఒకేసారి వివరం గా చూద్దాం.
నైజాం ప్రాంతం నుండి ఈ చిత్రానికి 75 లక్షల రూపాయిల రేంజ్ లో గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి అట. ఇది చిన్న మొత్తం కాదు. ఇక ఆంధ్ర ప్రదేశ్ + సీడెడ్ ప్రాంతాలకు కలిపి 1 కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల నుండి 1 కోటి 75 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 90 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అయితే ఈ చిత్రానికి ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి మాత్రం ఆశించిన స్థాయిలో గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు అనే చెప్పాలి. ఈ ప్రాంతాలకు మొత్తం కలిపి 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి 2 కోట్ల 5 లక్షల రూపాయిల రేంజ్ గ్రాస్ వసూళ్లు వచ్చాయట. షేర్ వసూళ్లు కోటి రూపాయలకు పైగానే ఉంటుంది.
ఒక కొత్త హీరో సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్ దక్కడం చిన్న విషయం కాదు. అయితే ఈ చిత్రానికి విడుదలకు ముందు 10 కోట్ల రూపాయిల రేంజ్ లో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకోవాలంటే మరో 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తే , అది దాదాపుగా అసాధ్యం అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇదే ట్రెండ్ కొనసాగితే , ఫుల్ రన్ లో ఈ చిత్రానికి కేవలం 4 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వస్తుందని అంటున్నారు. చూడాలి మరి ఫుల్ రన్ లో ఏ రేంజ్ కి వెళ్తుంది అనేది.