Homeఆంధ్రప్రదేశ్‌Machilipatnam Municipal Election Results:బందరులో ఇలా జరిగిందేంటి.. పాపం పేర్ని నాని..

Machilipatnam Municipal Election Results:బందరులో ఇలా జరిగిందేంటి.. పాపం పేర్ని నాని..

Machilipatnam Municipal Election Results:బందరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసిపి రెక్కలు విరిగిపోయాయి. లెక్కింపు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎన్ డి ఏ కూటమి అభ్యర్థులు తిరుగులేని హవా కొనసాగించారు. కౌంటింగ్ కేంద్రాన్ని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. లెక్కింపు మొదలైన వాటి నుంచి కూటమి అభ్యర్థులు తమ స్థాయిని మరింత క్లారిటీగా చూపించారు. నగరంలో మొత్తం 60 డివిజన్లు ఉంటే.. 58 కూటమి అభ్యర్థులు తిరుగులేని స్థాయిలో సొంతం చేసుకున్నారు. ఇక్కడ వైసిపి కేవలం రెండు […]

Machilipatnam Municipal Election Results:బందరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో వైసిపి రెక్కలు విరిగిపోయాయి. లెక్కింపు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎన్ డి ఏ కూటమి అభ్యర్థులు తిరుగులేని హవా కొనసాగించారు. కౌంటింగ్ కేంద్రాన్ని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. లెక్కింపు మొదలైన వాటి నుంచి కూటమి అభ్యర్థులు తమ స్థాయిని మరింత క్లారిటీగా చూపించారు. నగరంలో మొత్తం 60 డివిజన్లు ఉంటే.. 58 కూటమి అభ్యర్థులు తిరుగులేని స్థాయిలో సొంతం చేసుకున్నారు. ఇక్కడ వైసిపి కేవలం రెండు డివిజన్లకు మాత్రమే పరిమితమైంది. 10 రౌండ్లు ముగిసిన సమయానికి అధికారికంగా వచ్చిన ఫలితాల ప్రకారం 17 స్థానాలను కూటమి తన ఖాతాలో వేసుకుంది. వైసిపి ఒక్క స్థానంలో మాత్రమే గెలిచింది.

బందరు మేయర్ అభ్యర్థిగా ఉన్న షేక్ అబ్దుల్ అబీదా తొలి రౌండు నుంచే భారీ మెజారిటీ దిశగా దూసుకుపోయారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కూడా కూటమి హవా కొనసాగించింది. 334 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఆబీదా కు 254 ఓట్లు వచ్చాయి. వైసీపీ మేయర్ అభ్యర్థి లంక జ్యోతి కి కేవలం 68 ఓట్లు మాత్రమే వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టిడిపి 186 కోట్ల భారీ తేడాను చూపించింది. ఇక సాధారణ ఓట్ల లెక్కింపు విషయంలో కూడా స్పష్టమైన లీడ్ చూపించారు కూటమి అభ్యర్థులు.

కార్పొరేటర్ల స్థానంలో కూడా టిడిపి.. జనసేన అభ్యర్థులు అప్పర్ హ్యాండ్ కొనసాగించారు. 60 డివిజన్లో ఎక్కువ వార్డులను గెలుచుకొని.. కూటమి అభ్యర్థులు తిరుగులేని విజయం దిశగా దూసుకుపోతున్నారు. కౌంటింగ్ కేంద్రం బయట కూటమి అభ్యర్థులు సంబరాలు గట్టిగానే చేసుకుంటున్నారు. బందరులో తాగునీరు.. రోడ్ల నిర్మాణం.. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కూటమి అభ్యర్థులు హామీ ఇచ్చారు. పైగా పోర్టు నిర్మాణ పనులకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో బందరు ఓటర్లు కూటమి అభ్యర్థులకు జై కొట్టారు.

స్థానిక ఎన్నికల ప్రచార సమయంలో బందరు నగరపాలక సంస్థను దక్కించుకుంటామని నాని సవాల్ విసిరారు. ఆయన కుమారుడు కూడా గట్టిగానే మాటలు మాట్లాడారు. కానీ ఫలితాలు మరో విధంగా వచ్చాయి. మేయర్ పదవి.. డివిజన్లలో వైసిపి ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. దీంతో పార్టీ శిబిరంలో పూర్తిగా నిరాశ అలమకుంది. పూర్తిస్థాయిలో ఫలితాలు రావడానికి ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ఇప్పుడు ట్రెండ్స్ చూసుకుంటే మచిలీపట్నం మేయర్ పీఠం టిడిపి కూటమి అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా భారీ మెజారిటీతో దక్కించుకోవడం ఖాయం గా కనిపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper