Homeఆంధ్రప్రదేశ్‌AP Election Survey: 11 సర్వేలు : ఏపీలో గెలుపు ఏ పార్టీదో చెప్పేశాయి

AP Election Survey: 11 సర్వేలు : ఏపీలో గెలుపు ఏ పార్టీదో చెప్పేశాయి

తాజాగా ఏబీపీ సీ ఓ టర్ సర్వే ఫలితాలను ప్రకటించింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ఏపీలో ఎన్డీఏ కూటమి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది.

AP Election Survey: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫీవర్ పతాక స్థాయికి చేరుకుంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో దేశవ్యాప్తంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ప్రముఖ మీడియా సంస్థలు, సర్వే ఏజెన్సీలు ప్రజానాడి పడుతున్నాయి. అందులో భాగంగా ఏపీలో మెజారిటీ లోక్సభ స్థానాలు ఏ పార్టీ దక్కించుకుంటుంది? దానినిబట్టి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది? అన్నది సర్వే సంస్థలు తేల్చి చెబుతున్నాయి. ప్రస్తుతం కూటమి వెర్సెస్ వైసీపీ అన్న పరిస్థితి ఉంది. మధ్యలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి సైతం ఉనికి చాటుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఏపీలో గట్టి ఫైట్ నెలకొంది. ఈ తరుణంలో సర్వే సంస్థలు ఇస్తున్న ఫలితాలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి.

తాజాగా ఏబీపీ సీ ఓ టర్ సర్వే ఫలితాలను ప్రకటించింది. మొత్తం 25 లోక్ సభ స్థానాలకు గాను ఏపీలో ఎన్డీఏ కూటమి 20 స్థానాలను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. వైసిపి ఐదు స్థానాలకి పరిమితం కానుందని సర్వేలో తేలింది. ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు, వైసీపీకి 40 శాతం ఓట్లు, కాంగ్రెస్కు రెండు శాతం ఓట్లు, ఇతరులకు 11 శాతం ఓట్లు వస్తాయని తేలింది. అయితే ఈ ఒక్క సర్వే కాదు.. దాదాపు 10 సర్వే సంస్థలు కూడా ఏపీలో కూటమి ప్రభుత్వమే వస్తుందని తేల్చి చెప్పాయి.

ఇండియా టుడే సర్వేలో కూటమికి 17 సీట్లు, వైసీపీకి ఎనిమిది సీట్లు వస్తాయని తేలింది. సీఎన్ఎన్ న్యూస్ సర్వేలో కూటమికి 18 సీట్లు, వైసిపికి ఏడు సీట్లు, ఇండియా టీవీ సర్వేలో కూటమికి 17, వైసీపీకి ఎనిమిది సీట్లు దక్కుతాయని తేలింది. న్యూస్ ఎక్స్ సర్వేలో కూటమికి 18, వైసిపికి ఏడు, జన్మత్ పోల్స్ సర్వేలో కూటమికి 17 , వైసీపీకి 18, స్కూల్ ఆఫ్ పాలిటెక్ సర్వేలో కూటమికి 23, వైసీపీకి రెండు, పీపుల్స్ సర్వేలో కూటమికి 23, వైసిపికి రెండు, పయనీర్ పో ల్ సర్వేలో కూటమికి 18, వైసిపికి ఏడు, ఇండియా న్యూస్ సర్వేలో కూటమికి 18, వైసిపికి ఏడు, జీ న్యూస్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి ఎనిమిది లోక్సభ స్థానాలు దాక్కపోతున్నాయని తేలింది. అంటే దాదాపు 11 సర్వేలు కూటమిదే విజయం అని తేల్చి చెప్పడం విశేషం.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper