Mohit Ulva: భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ అంటేనే ఉత్కంఠ. అందులోనూ ఆసియా కప్ ఫైనల్ అంటే ఆ ఉత్కంఠకు హద్దులు ఏమాత్రం ఉండవు. అలాంటి కీలక పోరులో భారత జట్టు ఓటమి అంచులో నిలబడింది. ఎన్ని వికెట్ల కోల్పోయి దాదాపు ఆశలు వదిలేసుకుంది. అప్పుడు 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన ఒక కుర్రాడు అద్భుతం చేశాడు. బౌలర్ గా జట్టులోకి వచ్చిన అతడు బ్యాట్ తో పాకిస్తాన్ ఆశలను తలకిందులు చేశాడు. చివరి బంతికి ఫోర్ కొట్టి భారత జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అతడే మోహిత్ ఉల్వ.
18 సంవత్సరాల వయసులోనే తన పేరును మారుమోగించిన ఈ యువ ఆటగాడు ఇప్పుడు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాడు. అయితే ఈ విజయ వెనుక అతని ప్రయాణం కూడా అత్యంత ఆసక్తికరంగానే ఉంది. మోహిత్ గుజరాత్ లోని జాంనగర్ ప్రాంతానికి చెందిన క్రికెటర్. చిన్నతనంలోనే టెన్నిస్ బాల్ తో క్రికెట్ ఆడేవాడు. అతడి తండ్రికి క్రికెట్ మీద ఆసక్తి ఉండడంతో కుమారుడిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాడు ఆ తర్వాత మోహిత్ జామ్నగర్ లోని క్రికెట్ బంగ్లా అకాడమీలో ట్రైనింగ్ తీసుకున్నాడు. అక్కడ మహేంద్ర సింగ్ చౌహాన్ వద్ద క్రికెట్లో నైపుణ్యాన్ని నేర్చుకున్నాడు. మహేంద్ర సింగ్ భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఎదుగుదలలో కీలకపాత్ర పోషించారు. టెన్నిస్ బాల్ తో మొదలైన ప్రయాణం.. క్రమంగా అండర్ 19 భారత జట్టు వరకు చేరింది. మోహిత్ కుడి చేతి వాటం బ్యాటర్ మాత్రమే కాదు.. కుడి చేతితో మీడియం పేస్ బౌలింగ్ కూడా చేస్తాడు.
పాకిస్తాన్ జట్టు మీద ఫైనల్ లో ఆడిన ఇన్నింగ్స్ తోనే మోహిత్ ప్రతిభ వెలుగులోకి రాలేదు. అంతకంటే ముందు అతడు ఆస్ట్రేలియా అండర్ 19 జట్టుతో జరిగిన మ్యాచ్లో తన బ్యాటింగ్ ద్వారా సత్తా చూపించాడు. ఆ మ్యాచ్లో 10వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ఏకంగా 92 పరుగులు చేశాడు. 84 బంతుల్లో 10 ఫోర్లు.. నాలుగు సిక్సర్లతో అదరగొట్టాడు. భారత్ 218 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన దశలో.. 9వ వికెట్ కు ఏకంగా 180 పరుగుల భాగస్వామ్యం కుదిరే విధంగా కీలక పాత్ర పోషించాడు. ఇక ఇదే మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టాడు.. దీంతో మోహిత్ కేవలం బౌలర్ మాత్రమే కాదని.. అవసరమైతే బ్యాట్ ద్వారా కూడా అదరగొట్టగలరని అందరికీ అర్థమైంది.
ఇక నవంబర్ 14న ఒమన్ లోని అల్ అమ్రత్ లో జరిగిన అండర్-19 ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి 337 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాన్ 107 పరుగులు చేసి అదరగొట్టాడు. 338 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా ఒక దశలో 252 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో మోహిత్ మనల్ చౌహాన్ తో కలిసి అద్భుతంగా పోరాటం చేశాడు. చౌహన్ 32 బంతుల్లో 47 పరుగులు చేశాడు. మోహిత్ 26 బంతుల్లో 49* పరుగులు చేశాడు. వీరిద్దరూ తొమ్మిదవ వికెట్ కు 57 పరుగులు జోడించారు. మనల్ అవుట్ అయిన తర్వాత కూడా మోహిత్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. సి వెంకట తో కలిసి చివరి వికెట్ కు కీలకమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. చివరి ఓవర్లో భారత జట్టు విజయానికి 8 పరుగులు అవసరమయ్యాయి. చివరి బంతికి మూడు పరుగులు కావలసిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు మోహిత్ అద్భుతమైన ఫోర్ కొట్టి.. భారత జట్టుకు విజయాన్ని అందించాడు. భారత జట్టు ఒక్క వికెట్ తేడాతో గెలిచి.. తొమ్మిదో సారీ అండర్ 19 ఆసియా కప్ సొంతం చేసుకుంది.
మోహిత్ ప్రధానంగా పాస్ట్ బౌలర్. ఇతడిలో మంచి బ్యాటింగ్ సామర్థ్యం కూడా ఉంది. ఆస్ట్రేలియా జట్టు మీద చేసిన 92 పరుగులు.. పాకిస్తాన్ జట్టు మీద చేసిన 49 పరుగులు అతడి స్థాయిని నిరూపించాయి. ఇక భారత క్రికెట్లో చిన్న వయసులోనే ప్రతిభ చూపించిన ప్లేయర్లు చాలామంది ఉన్నారు. రవీంద్ర జడేజా.. అక్షర పటేల్ వంటి వారు ఆల్రౌండర్లుగా భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు మోహిత్ కూడా అధితరహాలో ఎదిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక మారుమూల గ్రామంలో టెన్నిస్ బంతి ద్వారా మొదలైన తన క్రికెట్ ప్రయాణం.. పాకిస్తాన్ జట్టు మీద ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో చివరి బంతికి ఫోర్ కొట్టే స్థాయికి ఎగిరింది. మోహిత్ ఆటతీరులో అదే అసలైన ప్రత్యేకత.
Mohit Ulva held the nerves till last ball.
He kept trusting the 11 no batter till 2nd last ball and kept rotating the strike.Great maturity at the age of U19 https://t.co/RnpvF7FcaK
— Sunil The Cricketer (@1sInto2s) November 14, 2026