SpaceX:ప్రపంచ అంతరిక్ష పరిశోధన రంగంలో సంచలనం సృష్టించాలని భావించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్ కు గట్టి దెబ్బ తగిలింది. ఈయనకు సంబంధించిన స్పేస్ ఎక్స్ కంపెనీ ప్రయోగించిన తాజా స్టార్ షిప్ ప్రయోగం విఫలమైంది. ఓకే ప్రయోగంలో రాకెట్ కు చెందిన రెండు భాగాలను గాల్లోనే పట్టుకోవాలని లక్ష్యంతో చేపట్టిన ఈ అరుదైన ప్రయోగం ఆదిలోనే విఫలమైంది.
రాకెట్ కు సంబంధించిన రెండు భాగాలను ఒకేసారి గాలిలో పట్టుకునే విధానాన్ని డబుల్ క్యాచ్ అని పిలుస్తారు. దీనిని నవంబర్ 13న స్టార్ ఫిష్ ఫ్లైట్ 15 ప్రయోగంలో భాగంగా చేపట్టారు. అయితే మొదటి దశ బూస్టర్ ను తిరిగి లాంచ్ టవర్ వద్దకు తీసుకురావడంలో సమస్య ఏర్పడింది. ఫలితంగా స్పేస్ ఎక్స్ ప్రతిష్టాత్మక ప్రణాళికలో తొలి దశ విఫలమైంది. అయితే ఈ ప్రయోగంలో పూర్తిగా వైఫల్యమే ఎదురు కాలేదు. నవంబర్ 14న స్టార్ షిప్ లోని రెండో భాగం షిప్ 42 ను కూడా స్పేస్ ఎక్స్ విజయవంతంగా లాంచ్ టవర్ వద్ద గాలిలోనే పట్టుకుంది. అంతరిక్ష చరిత్రలో ఆర్బిట్ నుంచి తిరిగి వచ్చిన స్టార్ షిప్ ను తొలిసారి ఇలా పట్టుకోవడం విశేషం.
ఎందుకు విఫలమైందంటే
బూస్టర్ తిరిగి ప్రయోగ కేంద్రానికి తిరిగి రావడానికి నిర్వహించే బూస్ట్ బ్యాక్ ముందుగానే ముగిసినట్టు ప్రాథమికంగా సంకేతాలు కనిపించాయి. తక్కువ స్థాయిలో ఇంధన నిల్వక సంబంధించిన అలారం దీనికి కారణమై ఉండవచ్చని తెలుస్తోంది.
బూస్టర్ నిర్ణయించిన మార్గంలో ప్రయాణించడం లేదని గైడెన్స్ అండ్ నావిగేషన్ కంట్రోల్ వ్యవస్థ గుర్తించిందని అమెరికా మీడియాలో వార్తలు వచ్చాయి. లాంచ్ టవర్ వద్దకు తిరిగి రావడం సురక్షితం కాదని వ్యవస్థ భావించడంతో క్యాచ్ ప్రయత్నాన్ని నిర్మించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే బూస్టర్ ను మెక్సికో గల్ఫ్ లోని సముద్ర ప్రాంతానికి తీసుకెళ్లారు. సుమారు 6.5 నిమిషాల ప్రయాణం తర్వాత బూస్టర్ సముద్రంలోకి పడిపోయింది.
ఈ ప్రయోగంలో మరో అద్భుతం జరిగింది. భూమి చుట్టూ సుమారు 22.5 గంటలు ప్రయాణించిన స్టార్ షిప్ రెండవ భాగం షిప్ 42 తిరిగి భూమికి చేరుకుంది. లాంచ్ టవర్ కు అమర్చిన రెండు భారీ యాంత్రిక చేతులు దానిని విజయవంతంగా పట్టుకున్నట్టు సమాచారం. అయితే ఇది అంతరిక్ష పరిశోధనలో ఒక చారిత్రాత్మక ఘట్టం. మొత్తంగా చూస్తే డబుల్ క్యాచ్ లక్ష్యం నెరవేరకపోయినప్పటికీ.. స్టార్ షిప్ ను ఆర్బిట్ నుంచి తిరిగి తీసుకొచ్చి పట్టుకోవడంలో స్పేస్ ఎక్స్ చరిత్ర సృష్టించింది. బూస్టర్ వైఫల్యానికి అసలు సాంకేతిక కారణం మాత్రం ఇంకా నిర్ధారణ కాలేదు. మొత్తంగా మస్క్ కంపెనీ చేపట్టిన ప్రయోగం ఒకటి సముద్రంలో కలిసింది. మరొకటి చరిత్ర సృష్టించింది.