TANA immigration 360 seminar : అమెరికాలో ప్రస్తుతం ఇమ్మిగ్రేషన్ కఠిన నిబంధనలు అమలుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో నివసిస్తున్న తెలుగు వారికి ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన అంశాలపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) గొప్ప ముందడుగు వేసింది.. ‘ఇమ్మిగ్రేషన్ 360°’ (Immigration 360°) పేరుతో తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) ఆధ్వర్యంలో ‘జూమ్ ’ మాధ్యమం ద్వారా ఒక ప్రత్యేక అవగాహన సదస్సును నిర్వహించారు.. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో తరచూ మారే నిబంధనలు.. వీసా ప్రక్రియలలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ఈ సదస్సు అమెరికాలోని తెలుగువారికి ఎంతగానో ఉపయోగపడింది. తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) పర్యవేక్షణలో తెలుగువారు తమతమ సమస్యలను చెప్పుకొని వాటికి పరిష్కారాలను తెలుసుకున్నారు.

కీలక అంశాలపై అవగాహన కల్పించిన ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి గారు
ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఇమ్మిగ్రేషన్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ న్యాయవాది ముఖ్య వక్తగా ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి హాజరై తెలుగు వారికి అవగాహన కల్పించారు.. యుఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలు, ఉద్యోగ ఆధారిత వీసాలు (H-1B, Green Card), కుటుంబ ఆధారిత ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్, లీగల్ స్టేటస్‌కు సంబంధించిన సమస్యలు, ఇటీవలి కాలంలో వచ్చిన కీలక మార్పులు.. తాజా పరిణామాలపై ఆయన సవివరంగా వివరించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ విధానాలు, వీసా నిబంధనలు, ఉద్యోగ అనుమతులు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. అమెరికా ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించిన సంక్లిష్టమైన నిబంధనలు, వీసా ప్రక్రియలు, సాధారణంగా ఎదురయ్యే న్యాయపరమైన అంశాలపై కమ్యూనిటీ సభ్యులకు ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి స్పష్టత ఇచ్చారు.. పలు కీలక అంశాలను వివరించారు.

సదస్సులో H-1B, F-1 వంటి వీసా విభాగాలు, తాజా వీసా మార్పులు, ఉద్యోగ అనుమతులు (Employment Authorization), రిమోట్ వర్క్‌కు సంబంధించిన మార్గదర్శకాలు వంటి అంశాలపై ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి అవగాహన కల్పించారు. వాటికి పరిష్కారాలు కల్పించారు.. అలాగే యూనివర్సిటీలు, అంతర్జాతీయ విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు, ప్రయాణ సమయంలో అవసరమైన పత్రాలు, ప్రయాణ పరిమితులపై కూడా వివరాలు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వారికి తమ వ్యక్తిగత ఇమ్మిగ్రేషన్ సందేహాలను నేరుగా అడిగి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. దీంతో వీసా, ఉద్యోగం, విద్య, ప్రయాణం వంటి అంశాలపై కమ్యూనిటీ సభ్యుల ప్రశ్నలకు ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి నుంచి సమాధానాలు పొందారు.
అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు తరచూ మారుతున్న నేపథ్యంలో.. తాజా పరిణామాలపై అవగాహన పెంచుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని పాల్గొన్న సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి : డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల)
డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) గారు మాట్లాడుతూ.. ‘‘ఇమ్మిగ్రేషన్ అనేది ఇప్పుడు ఎంతో మంది భారతీయుల కలలు, ఆశయాలు, వారి భవిష్యత్తును నిర్దేశించే ప్రక్రియగా మారింది. ప్రస్తుతం రోజురోజుకు మారుతున్న ఇమ్మిగ్రేషన్ నిబంధనలతో ఎంతో మంది ప్రొఫెషనల్ ఉద్యోగులు, విద్యార్థులు కన్ఫ్యూజన్ లో పడుతున్నారు. అందుకోసమే తానా తరుఫున ఇమ్మిగ్రేషన్ సమస్యలపై అవగాహన కల్పించి.. అనుభవజ్ఞులైన అటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి గారితో ఉద్యోగులు విద్యార్థుల సమస్యలపై పరిష్కారానికి చొరవ చూపాలనే ఈ సెమినార్ ను ఏర్పాటు చేశాం. లీగల్ గా ఇబ్బందులు ఎదురైన వారి సమస్యలకు పరిష్కారం చూపడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.’’ అని అన్నారు..

ఈ సందర్భంగా తానా తరుఫున ఈ కార్యక్రమానికి సహకరించిన తానా పెద్దలందరికీ ఉమా గారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి యాంకర్ లావణ్య గూడురు గారు సంధాన కర్తగా వ్యవహరించి ఉద్యోగులు, విద్యార్థుల సమస్యలపై అటార్నీ గారికి వివరించి సమాధానాలు రాబట్టారు.
ఈ కార్యక్రమంలోనే తానా ప్రెసిడెంట్ నరేన్ కొడాలి గారు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడి ఇంతటి అద్భుతమైన ఇమ్మిగ్రేషన్ సెమినార్ కండెక్ట్ చేసిన డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) గారికి.. అలాగే ఈ సెమినార్ లో పాల్గొంటున్న తన ఫ్రెండ్ అయిన ఆటార్నీ సంతోష్.ఆర్. సోమిరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇదొక గొప్ప కార్యక్రమం నిర్వహించారని ప్రశంసించారు.
*ముందుగానే ప్రశ్నలు పంపించేలా ‘డా.ఉమా’ గారు చొరవ
ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి సందేహాలు, ఆందోళనలు ఉన్న కమ్యూనిటీ సభ్యులు తమ ప్రశ్నలను సదస్సుకు ముందుగానే సమర్పించే వెసులుబాటును తానా ఆధ్వర్యంలో తానా ఎన్నారై స్టూడెంట్స్ కోఆర్డినేటర్ డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) ముందుచూపుతో ఏర్పాట్లు చేశారు.. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్ ప్రశ్నావళి ఫారమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతినిధులు తమ సమస్యలు లేదా సందేహాలను ఈ ఫారమ్ ద్వారా నమోదు చేయడంతో నిపుణులు వారి సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారాలను సూచించారు. ముందుగా అందిన ప్రశ్నల ఆధారంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న, ఎక్కువ మందిని ప్రభావితం చేసే అంశాలను వర్గీకరించి సదస్సులో ప్రత్యేకంగా చర్చించారు.. అంతేకాకుండా, హాజరైన వారికి న్యాయవాదితో నేరుగా మాట్లాడి తమ అనుమానాలను నివృత్తి చేసుకున్నారు. దీంతో డా. ఉమాగారి ముందు చూపు వల్ల ఎంతో మంది అమెరికాలో ఇమ్మిగ్రేషన్ సమస్యతో బాధపడుతున్న తెలుగు వారు తమ సమస్యలకు పరిష్కారాలను వెతుక్కున్నారు. దీంతో ఈ అవగాహన సదస్సు డా. ఉమాగారి చొరవతో గ్రాండ్ సక్సెస్ అయ్యింది.
అమెరికాలో ఉద్యోగ, విద్య, వ్యాపార నిమిత్తం ఉంటున్న వేలాది మంది తెలుగువారికి ఇమ్మిగ్రేషన్ నియమావళి చేరువై పెద్ద సంఖ్యలో ఈ అవగాహన సదస్సులో పాల్గొని తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. వివిధ ఇమ్మిగ్రేషన్ అప్లికేషన్లు, స్టేటస్ సంబంధిత చిక్కులు, చట్టపరమైన మార్గదర్శకాలపై సరైన సమాచారం లేక ఇబ్బంది పడిన వారికి ఈ వేదిక ఒక చక్కటి పరిష్కారంగా నిలిచింది.
కమ్యూనిటీ సభ్యులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. డా.ఉమా.ఆర్. కటికి (ఆరమండ్ల) ఆధ్వర్యంలో ఈ ‘ఇమ్మిగ్రేషన్ 360°’ సదస్సులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
* తానా ‘ఇమ్మిగ్రేషన్ 360°’ అవగాహన సదస్సు పూర్తి వీడియోను కింద లింక్ లో చూడొచ్చు.