Homeఆంధ్రప్రదేశ్‌AP Jobs 2026 : ఏపీలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 10 వేల పోస్టులకు పైగా..!

AP Jobs 2026 : ఏపీలో ఉద్యోగాల జాతర.. ఏకంగా 10 వేల పోస్టులకు పైగా..!

AP Jobs 2026 : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 జాబ్ క్యాలెండర్ కింద రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులను ఒకేసారి కాకుండా అభ్యర్థుల సౌలభ్యం, పరీక్షల నిర్వహణకు అనుగుణంగా నాలుగు విడతల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి విడతలో 1523 పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ […]

AP Jobs 2026 : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 జాబ్ క్యాలెండర్ కింద రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులను ఒకేసారి కాకుండా అభ్యర్థుల సౌలభ్యం, పరీక్షల నిర్వహణకు అనుగుణంగా నాలుగు విడతల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలి విడతలో 1523 పోస్టుల భర్తీకి సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే ఇది నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం. ఇప్పటికే మరో డీఎస్సీకి ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ప్రభుత్వ శాఖల్లో 10 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించడం మాత్రం శుభపరిణామం.

* మొత్తం నాలుగు దశల్లో..
పదివేల ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రక్రియలో భాగంగా.. రెండో దశ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ సెప్టెంబర్ 15 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం 3231 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. వీటిలో అత్యంత కీలకమైన గ్రూపు 1 కేటగిరీలో 149 పోస్టులు ఉన్నాయి. మరోవైపు పోలీస్ విభాగంలో భారీ ఉద్యోగాల భర్తీ జరగనుంది. ఇందులో 542 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులతో పాటు 152 సివిల్ ఎస్ఐ పోస్టులు ఉన్నాయి. ఇక మూడో దశ నోటిఫికేషన్ ను అక్టోబర్ 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏకంగా 2311 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా.. ఇందులో గ్రూప్ 2 కేటగిరి కింద 673 పోస్టులు ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకమైన డిప్యూటీ తహసిల్దార్ పోస్టులు 200 వరకు ఉన్నాయి. వీటితో పాటు వివిధ ఇంజనీరింగ్ సర్వీసులు, ఇతర సాంకేతిక, పరిపాలన విభాగాల్లో 1638 పోస్టులను కూడా మూడో దశలో నోటిఫై చేయనున్నారు.

* డీఎస్సీ 2026 సైతం..
మరోవైపు అక్టోబరు 15న నాలుగో దశ కింద 2995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ కానుంది. ఈసారి విద్యాశాఖలో ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఒక్క స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలోనే ఏకంగా 2,991 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇలా ఏకకాలంలో గ్రూప్స్, పోలీస్, ఇంజనీరింగ్, ఉపాధ్యాయ కొలువుల భర్తీకి స్పష్టమైన షెడ్యూల్ తో ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల్లో ఆనందం నెలకొంది. మరోవైపు డీఎస్సీ 2026 కు కూడా ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. అక్టోబర్లో డీఎస్సీ ప్రకటనకు ప్రభుత్వం సిద్ధపడుతోంది. అయితే వరుసగా ఉద్యోగాల భర్తీతో నిరుద్యోగ యువతలో కూటమి ప్రభుత్వం పట్ల సంతృప్తి నెలకొంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper