AP Electricity Department: ఏపీలో( Andhra Pradesh) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది కూటమి ప్రభుత్వం. భారీగా ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. విద్యుత్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది. దశాబ్దాలుగా విద్యుత్ శాఖలో పదోన్నతులు, పదవీ విరమణ లతో చాలా పోస్టులు ఖాళీగా ఉంటున్నాయి. పదోన్నతులు పొందిన వారు సైతం తమ పాత పోస్టింగ్ తో పాటు కొత్త పోస్టింగ్ లో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ఇది వారికి భారంగా మారింది. మరోవైపు అత్యవసర విభాగంగా ఉన్న విద్యుత్ శాఖలో ఇది ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో దాదాపు 2500 కు పైగా పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు సన్నాహాలు ప్రారంభించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటిఐ చదువుకున్న వారికి ఇది శుభవార్త.
Also Read: ఏపీలో పాలన.. చంద్రబాబు, జగన్ మధ్య తేడా అదే!
ఉన్న వారిపై భారం..
2014లో టిడిపి( Telugu Desam Party) అధికారంలోకి వచ్చింది. విద్యుత్ శాఖకు సంబంధించి నియామకాలు చేపట్టింది. అయితే వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం సచివాలయ లైన్మెన్ పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. ఇతర విభాగాలకు సంబంధించి ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. పైగా పదోన్నతులు, పదవీ విరమణలతో పోస్టులు ఖాళీ అయ్యాయి. ఈ నేపథ్యంలో చాలామందికి పదోన్నతులు వచ్చినా.. పాత స్థానాల్లోనే కొనసాగాల్సి వచ్చింది. రెండు పోస్టులను చేపట్టాల్సి వస్తోంది. అత్యవసర విభాగంగా ఉన్న విద్యుత్ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ఉన్న వారిపై భారం పడుతుంది. దీనిపై యూనియన్లు, విద్యుత్ పంపిణీ సంస్థలు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేయడంతో ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఖాళీల పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నేరుగా సీఎం చంద్రబాబు సమీక్షించి ఆదేశాలు ఇవ్వడంతో పోస్టుల భర్తీకి సిద్ధపడుతున్నారు అధికారులు.
సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..
ప్రస్తుతం 2511 పోస్టులను భర్తీ చేయడానికి సీఎం చంద్రబాబు( CM Chandrababu) ఆమోదం తెలిపారు. వీటిలో 1711 జూనియర్ లైన్మెన్ పోస్టులు, 800 ఏఈఈ పోస్టులు ఉన్నాయి. చివరిసారిగా 2018లో అప్పటి టిడిపి ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేసింది. మళ్లీ ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడం విశేషం. బీటెక్, డిప్లమో, ఐటిఐ చేసిన నిరుద్యోగ యువతకు ఇది సువర్ణ అవకాశం.
Also Read: మహిళలతో కలిసి బస్సులో బాబు, పవన్.. ఈ అరుదైన వీడియో చూడాల్సిందే
75% భర్తీ..
ప్రస్తుతం ఏపీఎస్పీడీసీఎల్ లో( apspdcl ) 2850 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏపీ సీపీడీసీఎల్ లో 1708 పోస్టులు, ఏపీ ఈపీడీసీఎల్ లో 2584 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 9849 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు 75% పోస్టులను భర్తీ చేయనున్నారు. టెక్నికల్ తో పాటు నాన్ టెక్నికల్ క్యాడర్లలో ఈ నియామకాలు చేపట్టనున్నారు. త్వరలోనే ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రకటన రానుంది. అయితే ఇక్కడి నుంచి ఏటా విద్యుత్ శాఖలో పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం.