Good news for AP : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం( Andhra Pradesh government) ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. బదిలీల గడువు పెంచింది. జూన్ 9 వరకు పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఏపీవ్యాప్తంగా బదిలీల ప్రక్రియ ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని శాఖల్లో ప్రక్రియ పూర్తి కాకపోవడంతో సీఎం చంద్రబాబు ఉద్యోగుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్నారు. ఇప్పటికే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో.. బదిలీ గడువును మరో వారం రోజులు పాటు పొడిగించారు. దీనిపై ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం మార్గదర్శకాలను సవరిస్తూ ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి చేసింది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం మినహాయింపులు ఇచ్చింది. అయితే చాలా శాఖల్లో ఇంకా బదిలీల ప్రక్రియలో జాప్యం జరుగుతూనే ఉంది. అనేక సాంకేతిక సమస్యలు రావడమే ఈ జాప్యానికి కారణంగా తెలుస్తోంది. అయితే తాజాగా బదిలీల గడువు పొడిగింపు పై హర్షం వ్యక్తమవుతోంది.
* మార్గదర్శకాలు జారీ..
ఉద్యోగుల బదిలీలకు( employees transfers ) సంబంధించి మే 15న ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ మే 16 నుంచి జూన్ రెండు వరకు బదిలీలకు అనుమతి ఇచ్చింది. బదిలీల్లో అర్హతలపై ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం ఇచ్చింది. ఇప్పుడు మరో ఏడు రోజులపాటు బదిలీల గడువు పెంచుతూ అవకాశం కల్పించింది ఏపీ ప్రభుత్వం. అయితే బదిలీలకు సంబంధించి కొన్ని నిబంధనలు కూడా విధించారు. ఒకే చోట ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలని ఆదేశించారు. పదోన్నతి పొంది ఒకే ప్రాంతంలో ఐదేళ్లు పూర్తి చేసిన వారిని కూడా బదిలీ చేస్తారు. ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉద్యోగుల వ్యక్తిగత విన్నపాల మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. మరోవైపు పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారికి సైతం బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ముఖ్యంగా అంధులైన ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. మానసిక రుగ్మతలు ఉన్న పిల్లల తల్లిదండ్రులకు కూడా ప్రాధాన్యం ఇస్తారు.
Also Read : ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ.. కూటమి సర్కార్ సంచలన నిర్ణయం!
* వీరి విషయంలో మినహాయింపు..
మరోవైపు గిరిజన ప్రాంతాల్లో( tribes areas ) రెండేళ్ల కంటే ఎక్కువ కాలం పని చేసిన ఉద్యోగులకు బదిలీల్లో ప్రయారిటీ ఉంటుంది. ఆరోగ్య కారణాలు చూపే ఉద్యోగుల విజ్ఞప్తిని సైతం పరిగణలోకి తీసుకుంటారు. వితంతు ఉద్యోగుల వినతి మేరకు కూడా బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుంది. భార్యాభర్తలు ఉద్యోగులు అయితే.. ఒకే చోట లేదా దగ్గర ప్రాంతాల్లో బదిలీ చేసేందుకు ప్రాధాన్యం కల్పించడం అన్నారు. ఈ నిర్ణయం పై ప్రభుత్వ ఉద్యోగుల నుంచి సానుకూలత వ్యక్తం అవుతోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.