బీహార్ రాష్ట్రంలో బంకిపూర్ ఒక మామూలు నియోజకవర్గమే కావచ్చు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గమే దేశవ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది. మారుమూల నియోజకవర్గ దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బంకీపూర్ నియోజకవర్గంలో గడిచిన 30 సంవత్సరాలుగా బిజెపికి ఇక్కడ ఓటమి లేదు. పైగా బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన రాజ్యసభకు వెళ్లిపోవడంతో ఈ నియోజకవర్గంలో ఖాళీ ఏర్పడింది. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక తప్పలేదు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. అతివిశ్వాసం బిజెపి కొంపముంచింది.
బీహార్ రాష్ట్రంలో అక్కడి బిజెపి మంత్రులను.. ఎమ్మెల్యేలను.. భోజ్పురి నటీనటులను బిజెపి ప్రచారంలోకి దించింది. భారీగా డబ్బు ఖర్చు పెట్టింది. ఓటర్లకు భారీగా తాయిలాలు ఇచ్చింది. అయితే ఇవి అంతగా వర్కౌట్ కాలేదు. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడే ఢిల్లీలో నీట్ ఉద్యమం చోటుచేసుకుంది. ముఖ్యంగా యువత బిజెపి అంటే మండిపడుతున్నారు. ఇదే సమయంలో బిజెపి చేసిన అభివృద్ధి పనులలో నాణ్యత నేతి బీర అని తేలిపోయింది. బిజెపి హయాంలో కట్టిన వంతెనలు వరుసగా కూలిపోవడం మొదలైంది. ఇది బీహార్ ఓటర్లలో మార్పుకు కారణమైంది.
ఇదే సమయంలో ప్రశాంత్ కిషోర్ అక్కడి యువతరాన్ని మార్చేసే విధంగా ప్రసంగాలు చేశారు. ఆయన గెలుపుకు ఆర్జెడి పోటీ కూడా ఒక కారణమైంది. బిజెపి తరఫున పోటీ చేసిన సిన్హా క్షేత్రస్థాయిలో పెద్దగా పర్యటించలేదు. ఎలాగైనా గెలుస్తానని కేవలం పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు.
ఈ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా ముందుగా అభిషేక్ కుమార్ ను ప్రకటించారు. దాణా కుంభకోణం కేసులో అభిషేక్ బంధువుకు శిక్ష పడింది. దీంతో అభిషేక్ పోటి నుంచి తప్పుకోవలసి వచ్చింది. ఇక్కడ అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన మనోజ్ కి తివారిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఇది అగ్రవర్ణాలలో ఆగ్రహం కలిగించింది. పాట్నాలో యువత మీద పోలీసులు లాఠీ ఛార్జ్ చేయడం.. వంటి సంఘటనలు ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేశాయి. అవినీతి పెరిగిపోవడం.. జవాబుదారితనం లేకపోవడం.. ఇంకా అనేక రకాల సమస్యలు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికర పరిణామం లాగా మారిపోయాయి. అందువల్లే బంకిపూర్ నియోజకవర్గంలో ఊహించని విధంగా ఆ పార్టీ భారీ అంతరంతో ఉపఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది.