Homeఎంటర్టైన్మెంట్Muralidhar Goud: ఆ డైరెక్టర్ ఎదురుగా నిలబడితే మనకే ప్రాబ్లం అంటున్న డీజే టిల్లు ఫాదర్...

Muralidhar Goud: ఆ డైరెక్టర్ ఎదురుగా నిలబడితే మనకే ప్రాబ్లం అంటున్న డీజే టిల్లు ఫాదర్…

Muralidhar Goud: మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. వాళ్లకు ఇతర ఇండస్ట్రీ ల నుంచి కూడా గొప్ప ఆదరణ దక్కుతుంది. దేశం నలుమూలాల నుంచి వాళ్ళను కీర్తించే ప్రేక్షకులు దొరకడం నిజంగా మన హీరోలు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక హీరోలకే కాకుండా మన సినిమాల్లో చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మురళీధర్ గౌడ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన డైలాగులకు, ఆయన […]

Muralidhar Goud: మన స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. వాళ్లకు ఇతర ఇండస్ట్రీ ల నుంచి కూడా గొప్ప ఆదరణ దక్కుతుంది. దేశం నలుమూలాల నుంచి వాళ్ళను కీర్తించే ప్రేక్షకులు దొరకడం నిజంగా మన హీరోలు చేసుకున్న అదృష్టమనే చెప్పాలి. ఇక హీరోలకే కాకుండా మన సినిమాల్లో చేసే క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా చాలా మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా మురళీధర్ గౌడ్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన డైలాగులకు, ఆయన టైమింగ్ కి ఫిదా కానీ వారు ఎవరు ఉండరు. డీజే టిల్లు మూవీ తో ఆయనకి మంచి క్రేజ్ వచ్చింది.

ఇక అప్పటి నుంచి ఆయన వరుస సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. బలగం, డీజే టిల్లు స్క్వేర్, మ్యాడ్ లాంటి సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు. అలాంటి నటుడు అనిల్ రావిపూడి సినిమాల్లో సైతం కీలకపాత్రలలో కనిపిస్తుంటాడు. ముఖ్యంగా బాలయ్య బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భగవంత్ కేసరి’ సినిమాలో ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్ లో నటించాడు.

ఆ సినిమాలో నటించినందుకుగాను అతనికి మంచి గుర్తింపైతే వచ్చింది. అప్పటినుంచి అనిల్ రావిపూడి అన్ని సినిమాల్లో తను ఉంటున్నాడు. మురళీధర్ గౌడ్ అనిల్ రావిపూడి సినిమాల్లో నటించినప్పటికి ఆయనతో ఎక్కువగా మాట్లాడడంట. కేవలం తను నటించే షాట్స్ ఏమైనా ఉంటే వెళ్ళి నటించి పక్కకి వచ్చి కూర్చుంటాడట. ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి కి నేను ఎదురుగా నిలబడలేనని చెప్పాడు.

కారణమేంటని ఆ ఇంటర్వ్యూ చేసే అతను అడగగా దానికి సమాధానం చెబుతూ అనిల్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అందువల్లే అతనికి ఎదురుగా నుంచొని మాట్లాడానని చెప్పాడు. అలాగే అనిల్ మాట్లాడుతుంటే ఆయన వెనకాల ఒక అడుగు దూరంలో ఉండి నేను వింటూ ఉంటానని కూడా చెప్పాడు. నిజానికి మురళీధర్ గౌడ్ కి అనిల్ రావిపూడి అంటే చాలా రెస్పెక్ట్ ఉందని ఆయన మాటలు చూసి మనం అర్థం చేసుకోవచ్చు… ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper