Rashmika Mandanna: సినీ స్టార్స్ కి వరుసగా గాయాలు అవ్వడం మన టాలీవుడ్ లో ఈమధ్య సర్వసాధారణం అయిపోయింది. పవన్ కళ్యాణ్ తన కుడి భుజానికి సర్జరీ చేయించుకోవడం, బాలకృష్ణ మోకాళ్ళకు గాయాలు అవ్వడంతో ఆయన కూడా సర్జరీ చేయించుకోవడం, రామ్ చరణ్ మణికట్టు సర్జరీ , ఎన్టీఆర్ భుజాల సర్జరీ, ఇలా వరుసగా ఎదో ఒక చెడు వార్త ప్రతీరోజు వింటూనే ఉన్నాం. ఇప్పుడు స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. రీసెంట్ గా జరుగుతున్న ఒక మూవీ షూటింగ్ లో డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె తుంటి (హిప్) భాగానికి బలమైన దెబ్బ తగిలిందట. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆమెని యూనిట్ సభ్యులు హాస్పిటల్ కి తరళించి ప్రాధమిక చికిత్స అందించారు. ఈ ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఒకసారి చూద్దాం.
ఆమె ప్రస్తుతం చేస్తున్న మూవీ లో , హై వోల్టేజ్ సాంగ్ ఒకటి ఉంటుందట. ఈ పాటలో డ్యాన్స్ సీక్వెన్స్ చాలా కఠినంగా ఉండడం తో , చిత్రీకరిస్తున్న సమయంలో కాలు జారిపోవడం తో రష్మిక కిందకు పడిపోయారు. దీంతో ఆమె తుంటి భాగానికి తీవ్రమైన గాయాలు అయ్యాయి. హాస్పిటల్ కి తీసుకొని పోగా, రష్మిక కి ప్రాధమిక వైద్యం అందించిన డాక్టర్లు , ఆమె తుంటి భాగం లో తీవ్రమైన గాయాలు అయ్యినట్టుగా గుర్తించారు. గాయం నుండి ఆమె పూర్తిగా కోలుకొని , మామూలు స్థితికి రావడానికి 6 వారాల సమయం పడుతుందని , అప్పటి వరకు ఆమెకు విశ్రాంతి అత్యవసరం అంటూ చెప్పుకొచ్చారు డాక్టర్లు. దీంతో ప్రస్తుతం ఆమె చేస్తున్న సినిమాల షూటింగ్స్ ఆగిపోయాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న రష్మిక అభిమానులు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే భయపడాల్సిన అవసరం ఏమి లేదని , 6 వారాల తర్వాత ఆమె ఎప్పటి లాగానే సినిమా షూటింగ్స్ లో పాల్గొనవచ్చని అంటున్నారు డాక్టర్లు.
ప్రస్తుతం రష్మిక ‘మైసా’, ‘రణబలి’ , ‘రాకా’ వంటి చిత్రాల్లో నటిస్తోంది. ‘రణబలి’ లో ఈమె భర్త విజయ్ దేవరకొండ హీరో గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే విధంగా ‘మైసా’ లేడీ ఓరియెంటెడ్ మూవీ. ఇందులో యాక్షన్ సన్నివేశాలు చాలా గట్టిగానే ఉంటుంది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘రాకా’ లో రష్మిక విలన్ క్యారెక్టర్ చేస్తోంది. ఈమెకు ఈ చిత్రం లో కూడా యాక్షన్ సన్నివేశాలు చాలా గట్టిగానే ఉంటాయట. ఇప్పుడు రష్మిక కి ఏ మూవీ షూటింగ్ లో గాయాలు అయ్యాయో తెలియడం లేదు. ‘మైసా’, ‘రాకా’ చిత్రాల్లో సాంగ్ షూటింగ్స్ కి స్కోప్ లేదు. కచ్చితంగా ‘రణబలి ‘ మూవీ షూటింగ్ లోనే ఆమెకు గాయాలు అయ్యుంటాయని అంటున్నారు విశ్లేషకులు.