Sumanth: సినిమా ఇండస్ట్రీలో పెద్ద బ్యాగ్రౌండ్ ఉండి కూడా సక్సెస్ లను సాధించలేని హీరోలు కొంతమంది ఉన్నారు. అందంగా ఉండి, యాక్టింగ్ చేయగలిగే కెపాసిటీ ఉండి, చూడగానే హీరో అనే లుక్స్ ను మెయింటైన్ చేయగలిగే కెపాసిటీ ఉన్న సుమంత్ లాంటి నటుడు సైతం ప్రస్తుతం స్టార్ హీరోగా ఎదగలేకపోయాడు. అక్కినేని ఫ్యామిలీ అనే ఒక బ్రాండ్ తన వెనకాల ఉన్నప్పటికి స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలను చేసిన కూడా ఆయన స్టార్ హీరోగా మారలేకపోయాడు. కారణం ఏంటంటే ఆయన వైఖరి అనే చెప్పాలి. ఆయన ఎవరితో పెద్దగా కలువకపోవడం రిజర్వుడ్ గా ఉండడం తను ఎలాంటి సినిమాలు చేస్తే ప్రేక్షకులు తనను ఆదరిస్తారు అనే ఒక సరైన గైడెన్సీ లేకపోవడంతోనే ఆయన చాలావరకు వెనుకబడిపోయాడు. ఆయన చేసిన సినిమాలు కొన్ని అడపాదడపా సక్సెస్ లను సాధించినా కూడా కంటిన్యూస్ గా సక్సెస్ లు లేకపోవడం వల్లనే ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా మారలేకపోయాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ లతో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన ఆ రేంజ్ సక్సెస్ ను మాత్రం సాధించడంలో విఫలమయ్యాడు. ఇక పర్సనల్ విషయంలో కూడా ఆయన చాలావరకు ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి.
కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకొని చాలా తక్కువ సమయంలోనే విడాకులు తీసుకున్నాడు. ప్రస్తుతం ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్న ఆయన సినిమాల మీద తన పూర్తి ఫోకస్ ని పెట్టాడు. రీసెంట్ గా ‘న్యూటన్స్ థర్డ్ లా’ అంటూ ఒక సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సినిమాతో సైతం ఆయన మరోసారి నిరాశనే మిగిల్చాడు… మిస్టరీ అంటే ఆధ్యాంతం ఆసక్తిగా తెరమీదకి తీసుకెళ్లాలి. కానీ ఆ విషయంలో దర్శకుడు కొంతవరకు తడబడ్డాడు. న్యూటన్స్ థర్డ్ లా అనే టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తూ ప్రతి యాక్షన్ కి రియాక్షన్ ఉంటుందని విషయాన్ని చెప్పడమే దర్శకుడి ఉద్దేశ్యం కానీ దానిని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడంలో మాత్రం ఆయన చాలా వరకు విఫలమయ్యాడు.
ఇక కథలో సైతం ఒక మర్డర్ మిస్టరీని సాగదీస్తూ ఉన్నారు తప్ప దానికి సంబంధించిన పర్ఫెక్ట్ ప్రజెంటేషన్ మాత్రం ఇవ్వలేకపోయారు… ఇప్పటికైనా సుమంత్ మంచి కథలను సెలెక్ట్ చేసుకొని సక్సెస్ లను సాధిస్తే బాగుంటుందని మరి కొంతమంది అభిప్రాయపడుతున్నారు…