Director Success Story : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వరుస సినిమాలను చేస్తూ స్టార్ డైరెక్టర్లుగా వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కొత్త కథలతో సినిమాలను చేస్తూ ప్రేక్షకులను మైమరపింపజేసే దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. అలాంటి వాళ్ళలో ‘సంతోష్ జాగర్లపూడి’ ఒకరు… ‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాతో తన కెరియర్ ను స్టార్ట్ చేసిన ‘సంతోష్ జాగర్లపూడి’ మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ ని సాధించాడు… ఇక ఆయన ఇండస్ట్రీ కి అడుగుపెట్టడానికి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కున్నాడు… మొదట ఎల్ఐసి సంస్థలో గవర్నమెంట్ జాబ్ చేసిన ఆయన సినిమా మీద ఉన్న పిచ్చి తో ఆ జాబ్ చేయలేక సినిమా మీద ఉన్న ఇష్టాన్ని చంపుకోలేక నరకం అనుభవించేవాడట… ఇక ఏదైతే అది అవుతోంది అని నిర్ణయించుకొని మొత్తానికైతే ఆ జాబ్ కి రిజైన్ చేసి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. కెరియర్ మొదట్లో చాలా ఇబ్బందులు పడ్డాడు…తను తిన్న, తినకపోయిన సినిమాను మాత్రం ఎప్పుడు వదిలిపెట్టలేదు. తను రాసిన కొన్ని మంచి కథలను కావాలనే కొంతమంది రిజెక్ట్ చేసి తనను ఇబ్బంది పెట్టారట…అలాగే కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్ గా కూడా వర్క్ చేసి పరిచయాలను పెంచుకున్నాడు…. తనే సొంతంగా షార్ట్ ఫిలిమ్స్ చేసి దాని ద్వారా వచ్చిన నాలెడ్జ్ తో సినిమా చేయాలని దృఢంగా నిశ్చయించుకున్నాడు. అలా మేకింగ్ మీద గ్రిప్ తెచ్చుకొని సుబ్రహ్మణ్యపురం కథను సుమంత్ కి చెప్పి ఒప్పించి మొత్తానికైతే ఆ సినిమాను చేశాడు. ఇక అప్పటివరకు ఫ్లాపుల్లో ఉన్న సుమంత్ కి సుబ్రహ్మణ్యపురం సినిమాతో ఒక మంచి సక్సెస్ అయితే అందించాడు…
కష్టపడితే ప్రతి ఒక్కరికి ప్రతిఫలం దక్కుతోంది అనడానికి తనని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక ప్రస్తుతం మహేంద్ర గిరి వారాహి అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక రవితేజ కి సైతం ఒక డిఫరెంట్ కథ ను చెప్పి ఒప్పించినట్టుగా తెలుస్తోంది… తొందర్లోనే ఈ సినిమా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది…
ఇక ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం ఎండింగ్లో రాబోతున్న మహేంద్రగిరి వారాహి సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్లకు సైతం పోటీని ఇచ్చే కెపాసిటీ తనకి ఉందనే సంకేతాన్ని తెలియజేయాలని చూస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా పట్టుదల, లక్ష్యం మీద ఫోకస్, కష్టపడే తత్వం ఉన్నవారు ఎవరైనా సరే వాళ్లు పెట్టుకున్న గోల్ ను రీచ్ అవుతారని చెప్పడానికి సంతోష్ జాగర్లపూడి ని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు…
సంతోష్ కెరియర్ స్టార్టింగ్ లో ఒక చిన్న సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు… కొన్ని అనివార్య కారణాలవల్ల ఆ సినిమా మధ్యలో ఆగిపోయింది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి వచ్చిన సంతోష్ సైతం డైరెక్టర్ గా మారాడు. అప్పుడెప్పుడో ఆగిపోయిన సినిమా రీసెంట్ గా షూట్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అయింది. ఇక ఇప్పుడు ఆ చిన్న సినిమా ప్రివ్యూ చూడడానికి చీఫ్ గెస్ట్ గా సంతోష్ జాగర్లపూడి వెళ్లడం నిజంగా చాలా గొప్ప విషయం…తను అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన సినిమాకే తను గెస్ట్ గా వెళ్ళాడు…ఇంతకు మించిన సక్సెస్ ఏముంటుంది…