Homeఅంతర్జాతీయంUS Israel Iran Conflict: అమెరికా యుద్ధం ఎందుకోసమో తెలియదు.. ఇంతమంది ఇరాన్ ప్రజలు బలయ్యారు

US Israel Iran Conflict: అమెరికా యుద్ధం ఎందుకోసమో తెలియదు.. ఇంతమంది ఇరాన్ ప్రజలు బలయ్యారు

US Israel Iran Conflict: యుద్ధం అంటే ఒక లక్ష్యం కోసం కొనసాగాలి. ఈ ప్రపంచంలో గతంలో జరిగిన యుద్ధాలు లక్ష్యం కోసం సాగలేదు. కేవలం గిట్టని దేశాలను తొక్కి వేయడానికి మాత్రమే యుద్ధాలు జరిగాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు.. ఆధునిక కాలంలో జరుగుతున్న యుద్ధాలు దీనిని నిరూపించాయి. అయినప్పటికీ సామ్రాజ్యవాద పోకడలు ఉన్న పరిపాలకులు దేశాల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. దానికి ప్రపంచ శాంతి అని కలరింగ్ ఇస్తున్నారు. యుద్ధం చేయలేని వాడికి […]

US Israel Iran Conflict: యుద్ధం అంటే ఒక లక్ష్యం కోసం కొనసాగాలి. ఈ ప్రపంచంలో గతంలో జరిగిన యుద్ధాలు లక్ష్యం కోసం సాగలేదు. కేవలం గిట్టని దేశాలను తొక్కి వేయడానికి మాత్రమే యుద్ధాలు జరిగాయి. మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు.. ఆధునిక కాలంలో జరుగుతున్న యుద్ధాలు దీనిని నిరూపించాయి. అయినప్పటికీ సామ్రాజ్యవాద పోకడలు ఉన్న పరిపాలకులు దేశాల మీద దాడులు చేస్తూనే ఉన్నారు. దానికి ప్రపంచ శాంతి అని కలరింగ్ ఇస్తున్నారు. యుద్ధం చేయలేని వాడికి శాంతి గురించి అడిగే సత్తా లేదని సినిమా డైలాగులు చెబుతున్నారు.

వాస్తవానికి ప్రస్తుతం జరుగుతున్న మిడిల్ ఈస్ట్ యుద్ధంలో అమెరికాకు ఎటువంటి సంబంధం లేదు. పైగా అమెరికా అట్లాంటిక్ సముద్రం అవతల ఉంది. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో అడుగు పెట్టాల్సిన అవసరం ఆ దేశానికి ఏ కోణంలో కూడా లేదు. యూదుల కోసం.. ముఖ్యంగా ఇజ్రాయిల్ ప్రాపకం కోసం అమెరికా ఇరాన్ మీద దారుణంగా దాడులు చేస్తోంది. ఇటీవల ఇస్లామాబాదులో చర్చల కోసం ఇరాన్ ప్రతినిధులు పాకిస్థాన్ వెళ్లిపోయారు. దానికంటే ముందు అమెరికా చేసిన దాడుల వల్ల తమ ప్రాంతంలో చనిపోయిన పిల్లల ఫోటోలు.. వారి స్కూల్ బ్యాగులను విమానంలో ప్రదర్శించారు. దీనిని బట్టి అమెరికా యుద్ధ పిపాస ఎలా ఉంటుందో ప్రపంచానికి మరోసారి చాటిచెప్పారు.

ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది కాబట్టి అమెరికా విషయంలో గ్లోబల్ మీడియా నెగిటివ్గా రెస్పాండ్ కాకపోవచ్చు. మిగతా దేశాలు కూడా అమెరికాకు వ్యతిరేకంగా స్వరాన్ని పెకిలించకపోవచ్చు. కానీ నోరు గొడ్లను తిన్న రాబంధు ఒక గాలివానకు చనిపోవచ్చు. ఈ రోజున ప్రపంచం మీద పెత్తనం సాగిస్తున్నామని అమెరికా గొప్పలు పోవచ్చు. కానీ ఏదో ఒక రోజు అమెరికా పెత్తనం మొత్తం కాలగర్భంలో కలిసిపోవచ్చు. చరిత్ర చెబుతున్న వాస్తవం ఇదే.

తనకోసం.. తన ప్రయోజనాల కోసం ప్రపంచం మీద అనేక రకాలైన యుద్ధాలను అమెరికా రుద్దింది. అంతటి జపాన్ మీద న్యూక్లియర్ బాంబులు వేసి ప్రపంచ వినాశనానికి అమెరికా ఆ రోజుల్లోనే దారులు తెరిచింది. కాకపోతే ప్రపంచం మొత్తం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆ తరహ యుద్ధాలు మాత్రం ఇంతవరకు రాలేదు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ప్రస్తుతం యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో.. అమెరికా జరుపుతున్న వైమానిక దాడులు ఇరాన్ ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటివరకు 40 కి పైగా రోజుల పాటు మిడిల్ ఈస్ట్ యుద్ధం జరుగుతోంది. ఈ దాడుల్లో 3375 మంది ఇరాన్ పౌరులు చనిపోయారు. వీరిలో 2875 మంది పురుషులు ఉన్నారు. 500 మంది మహిళలు ఉన్నారు. మృతుల్లో ఆఫ్ఘనిస్తాన్, లెబనాన్, ఇరాక్, చైనా, పాకిస్తాన్ పౌరులు ఉన్నారని ఇరాన్ వెల్లడించింది. అయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని.. ఇప్పటికి కూడా స్పష్టమైన సంఖ్యను చెప్పలేకపోతున్నామని ఇరాన్ ప్రకటించింది. ఇటీవల ఇరాన్ లీగల్ మెడిసిన్ ఆర్గనైజేషన్ చీఫ్ అబ్బాస్ అరానీ.. యుద్ధం వల్ల ఎదురవుతున్న పరిణామాలను వెల్లడించారు. అమెరికా చేస్తున్న దాడుల వల్ల ఎంతోమంది ఇరాన్ ప్రజలు చనిపోయారని.. దేశం మొత్తం శిధిలాల దిబ్బగా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం సీజ్ ఫైర్ అమల్లో ఉంది. అందువల్లే ఇరాన్ దేశంలో దాడులు జరగడం లేదు. వైపు లెబనాన్ మీద ఇజ్రాయిల్ దాడులు చేస్తూనే ఉంది. అక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తీవ్రంగా ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper