Homeఅంతర్జాతీయంUS Security Concerns: నిన్న అధ్యక్షుడు ట్రంప్ మీద.. నేడు వైట్ హౌస్ దగ్గర.. అమెరికాలో...

US Security Concerns: నిన్న అధ్యక్షుడు ట్రంప్ మీద.. నేడు వైట్ హౌస్ దగ్గర.. అమెరికాలో భద్రత లేదా

US Security Concerns: చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే తెలిసిపోతుంది. ప్రత్యర్థి దేశాలు దాడులు చేయడం కాదు.. దాడులు చేసేందుకు రూపకల్పన చేస్తున్న సరే తెలిసిపోతుంది. ఒక రకంగా అమెరికా చుట్టూ భద్రత అనేది దుర్భేద్యం లాగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరిగినా సరే అక్కడి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి. అయితే అమెరికా మీద ఇప్పటివరకు ఇటువంటి అభిప్రాయాలు మాత్రమే ఉండేవి. పైగా రక్షణ వ్యవస్థగా ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ మాదిరిగా డోమ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు […]

US Security Concerns: చీమ చిటుక్కుమన్నా సరే వెంటనే తెలిసిపోతుంది. ప్రత్యర్థి దేశాలు దాడులు చేయడం కాదు.. దాడులు చేసేందుకు రూపకల్పన చేస్తున్న సరే తెలిసిపోతుంది. ఒక రకంగా అమెరికా చుట్టూ భద్రత అనేది దుర్భేద్యం లాగా ఉంటుంది. ఎప్పుడు ఏం జరిగినా సరే అక్కడి వ్యవస్థలు సమర్థవంతంగా పనిచేస్తాయి.

అయితే అమెరికా మీద ఇప్పటివరకు ఇటువంటి అభిప్రాయాలు మాత్రమే ఉండేవి. పైగా రక్షణ వ్యవస్థగా ఇటీవల కాలంలో ఇజ్రాయిల్ మాదిరిగా డోమ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకునేందుకు అమెరికా ప్రణాళికలు రూపొందించింది. పెంటగాన్ ప్రాంతంలో ఉన్న అమెరికా రక్షణ వ్యవస్థకు భారీగా నిధులు ఇవ్వడం మొదలుపెట్టింది. ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా రక్షణ కోసం దండిగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు.

ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ అమెరికాలో భద్రత గురించి సరికొత్త ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. అమెరికాలో అధ్యక్షుడు నివాసం ఉండే వైట్ హౌస్ ప్రాంతంలో కాల్పులు జరిగాయి. శనివారం ఒక వ్యక్తి వైట్ హౌస్ చెక్ పాయింట్ వద్ద సెక్యూరిటీ అధికారులపై కాల్పులకు దిగాడు. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఆఫీస్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ విషయాలను వెల్లడించింది. శనివారం సాయంత్రం 6 గంటల సమయంలో ఒక వ్యక్తి 17వ స్ట్రీట్ పెన్సిల్వేనియా ఎవెన్యూ దగ్గరలో వైట్ హౌస్ చెక్పోస్ట్ వద్దకు వచ్చాడు. తన వద్ద ఉన్న తుపాకీని బయటకు తీశాడు. సెక్యూరిటీ అధికారులను లక్ష్యంగా చేసుకుని పైరింగ్ మొదలు పెట్టాడు. దీంతో వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. తిరిగి కాల్పులు మొదలుపెట్టారు. దీంతో ఆ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్ హౌస్ లో ఉండడం విశేషం.

ఇటీవల ట్రంప్ మీద కూడా కాల్పులు జరిగాయి. ఆయన ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఓ వ్యక్తి అందులోకి వచ్చాడు. కాల్పులు జరిపాడు. అయితే ఆ ఘటనలో ట్రంప్ ను ఆయన అంతరంగీక సిబ్బంది కాపాడారు.. వెంటనే సురక్షితమైన ప్రాంతానికి తీసుకెళ్లారు.. ఈ ఘటనలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. ఈ ఘటనకు మర్చిపోకముందే వైట్ హౌస్ సమీపంలో కాల్పులు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఏకంగా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకొని ఇలా చేయడం పట్ల అమెరికాలో భద్రత పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper