Homeఅంతర్జాతీయంWest Asia Peace Talks: పశ్చిమాసియా శాంతి చర్చల్లో ఉద్రిక్తత.. అమెరికా ఉపాధ్యక్షుడికి అవమానం!

West Asia Peace Talks: పశ్చిమాసియా శాంతి చర్చల్లో ఉద్రిక్తత.. అమెరికా ఉపాధ్యక్షుడికి అవమానం!

West Asia Peace Talks: పశ్చిమాసియాలో శాశ్వత శాంతి కోసం అమెరికా–ఇరాన్‌ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో భేటీ అయ్యారు. ఈ సమావేశం ముందు అమెరికా వైపు నుంచి ఫొటో సెషన్, కరచాలనం నిర్వహించాలని ప్రణాళిక వేశారు. అయితే ఇరాన్‌ ప్రతినిధులు దీన్ని తిరస్కరించి సమావేశ స్థలం నుంచి వెళ్లిపోయారు.

ట్రంప్‌ హెచ్చరికతో ఇరాన్‌ వాకౌట్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇజ్రాయెల్‌పై దాడులు చేయకుండా హెజొబొల్లాను ఇరాన్‌ నియంత్రించాలని, లేదంటే మళ్లీ భారీ దాడులు చేస్తామని హెచ్చరించిన విషయాన్ని టెహ్రాన్‌ తీవ్రంగా పరిగణించింది. దీంతో ఫొటో సెషన్‌కు నిరాకరించిన ఇరాన్‌ ప్రతినిధులు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ పరిణామం చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్‌ నేతలను షాక్‌కు గురిచేసింది.

జేడీ వాన్స్‌కు అవమానం..
సమావేశం ప్రారంభానికి ముందు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ ఎదురుచూస్తుండగా ఇరాన్‌ విదేశాంగ మంత్రి వాకౌట్‌ చేయడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. కొంచెం దూరంలో ఉన్న వాన్స్‌ ఈ పరిస్థితిని ఉద్రిక్తంగా గమనిస్తున్నట్లు దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. తర్వాత ఆయన పాకిస్తాన్‌ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్‌ మునీర్‌లతో ఒక్కటిగా చర్చించుకున్నారు.

ఖతార్‌ ప్రధానిని పట్టించుకోని వాన్స్‌..
మరో మధ్యవర్తి దేశం ఖతార్‌ ప్రధాని పాకిస్తాన్‌ ప్రధాని షరీఫ్‌ను పలకరించినప్పటికీ, పక్కనే ఉన్న వాన్స్‌ను పట్టించుకోలేదు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నెటిజన్లు దీన్ని దౌత్యపరమైన తిరస్కారంగా అభివర్ణిస్తున్నారు.

పరిస్థితి ఒకింత ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ ఇరాన్‌ అణు కార్యక్రమం, లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ చర్యలు వంటి ముఖ్య అంశాలపై ఇరు దేశాలు చర్చించాయి. శాంతి సాధన దిశగా కొంత ముందడుగు పడినట్లు సమావేశం ముగిసిందని సమాచారం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular