Homeఅంతర్జాతీయంTrump final warning: ట్రంప్ 'అంతిమ' హెచ్చరిక.. రణమా.. శరణమా!

Trump final warning: ట్రంప్ ‘అంతిమ’ హెచ్చరిక.. రణమా.. శరణమా!

Trump final warning: ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కీలక మలుపు తీసుకున్నాయి. యుద్ధాన్ని ముగించి దీర్ఘకాలిక ఒప్పందం కోసం అమెరికా ఐదు ముఖ్యమైన అంశాలను ఇరాన్ ప్రతిపాదించింది. వాటిని ఇరాన్ తిరస్కరించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిపిన చర్చల అనంతరం ఈ పరిణామాలు జరగడం గమనార్హం. అమెరికా ప్రతిపాదనలు ఇవీ.. అమెరికా తాజా ప్రతిపాదనలు చాలా కఠినంగా ఉన్నాయి. […]

Trump final warning: ఇరాన్ అమెరికా మధ్య జరుగుతున్న శాంతి చర్చలు కీలక మలుపు తీసుకున్నాయి. యుద్ధాన్ని ముగించి దీర్ఘకాలిక ఒప్పందం కోసం అమెరికా ఐదు ముఖ్యమైన అంశాలను ఇరాన్ ప్రతిపాదించింది. వాటిని ఇరాన్ తిరస్కరించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో జరిపిన చర్చల అనంతరం ఈ పరిణామాలు జరగడం గమనార్హం.

అమెరికా ప్రతిపాదనలు ఇవీ..
అమెరికా తాజా ప్రతిపాదనలు చాలా కఠినంగా ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి యుద్ధం వల్ల జరిగిన నష్టాలకు ఎలాంటి పరిహారం చెల్లించవద్దు.సుమారు 400 కిలోల ఎన్‌రిచ్డ్ యురేనియం అమెరికాకు అప్పగించాలి. ఇరాన్‌లో ఒక్క న్యూక్లియర్ ఫెసిలిటీ మాత్రమే నడపాలి. ఫ్రీజ్ చేసిన ఇరాన్ ఆస్తుల్లో 25 శాతం కూడా విడుదల చేయకుండా నిలిపివేయాలి. లెబనాన్‌తో సహా ప్రాంతీయ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

ఈ షరతులు ఇరాన్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని తీవ్రంగా పరిమితం చేస్తాయి. ఆర్థికంగా కూడా ఒత్తిడి పెంచుతాయి. ఇరాన్ తన ప్రతిపాదనల్లో యురేనియం కొంత భాగాన్ని మూడవ దేశానికి బదిలీ చేయడం, కానీ ఫెసిలిటీలను పూర్తిగా నిర్మూలించడాన్ని నిరాకరించింది.

సమయం అయిపోతోంది..
ఇరాన్ తిరస్కరణ అనంతరం ట్రంప్ తన ట్రూత్ సోషల్ పోస్ట్‌లో బలమైన మాటలు వాడారు. “ఇరాన్‌కు సమయం మించిపోతోంది. వేగంగా స్పందించాలి. లేదంటే వారికి ఏమీ మిగలదు. సమయం ఎంతో విలువైనది” అని హెచ్చరించారు. ఇలాంటి హెచ్చరికలు గతంలో కూడా ట్రంప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపిన తర్వాత ఈ వ్యాఖ్యలు వచ్చడం, సైనిక ఒత్తిడి కొనసాగుతుందని సంకేతం ఇస్తోంది.

అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ న్యూక్లియర్ సామర్థ్యాన్ని పూర్తిగా అణచివేయాలని చూస్తున్నాయి. తన ప్రాంతీయ ప్రభావం (లెబనాన్, ఇతర ప్రాక్సీలు), న్యూక్లియర్ కార్యక్రమం రక్షణే ప్రధాన లక్ష్యం. ఫ్రీజ్ చేసిన ఆస్తులతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థను బలహీనపరుస్తున్నాయి.లెబనాన్‌లో ఇజ్రాయెల్ చర్యలు చర్చలను క్లిష్టతరం చేస్తున్నాయి. ఎన్‌రిచ్డ్ యురేనియం బదిలీ ఇరాన్‌కు భద్రతా హామీలు లేకుండా అంగీకరించడం కష్టం.

అయినప్పటికీ, రెండు వైపులా యుద్ధం కొనసాగించడం ఖర్చుతో కూడుకున్నది. ఆయిల్ ధరలు పెరగడం, హార్ముజ్ స్ట్రెయిట్ సమస్యలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్ సమగ్ర ఒప్పందం కోసం సిద్ధంగా ఉందని చెబుతోంది, కానీ అమెరికా షరతులు మారాలని డిమాండ్ చేస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper