Homeఅంతర్జాతీయంUS War Plans Leak Middle East Conflict: అమెరికా యుద్ధ ప్లాన్‌లు లీక్‌.. అప్రమత్తం...

US War Plans Leak Middle East Conflict: అమెరికా యుద్ధ ప్లాన్‌లు లీక్‌.. అప్రమత్తం అవుతున్న ఇరాన్‌!

US War Plans Leak Middle East Conflict: ఇజ్రాయెల్‌–అమెరికా కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం 17వ రోజు హోరాహోరీగా సాగుతోంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను మొదటి రోజే చంపేశారు. అయినా ఇరాన్‌ అమెరికాకు తలవంచడం లేదు. అమెరికా అనుకూల దేశాలపైన గల్ఫ్‌దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. అమెరికా బేస్‌లు, అమెరికా రాయబార కార్యాలయాపై దాడులు చేస్తోది. మరోవైపు ఇజ్రాయెల్‌పైనా వైమానిక దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా తదితర దేశాలన్నీ కలిసి […]

US War Plans Leak Middle East Conflict: ఇజ్రాయెల్‌–అమెరికా కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం 17వ రోజు హోరాహోరీగా సాగుతోంది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ను మొదటి రోజే చంపేశారు. అయినా ఇరాన్‌ అమెరికాకు తలవంచడం లేదు. అమెరికా అనుకూల దేశాలపైన గల్ఫ్‌దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. అమెరికా బేస్‌లు, అమెరికా రాయబార కార్యాలయాపై దాడులు చేస్తోది. మరోవైపు ఇజ్రాయెల్‌పైనా వైమానిక దాడులు చేస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా తదితర దేశాలన్నీ కలిసి ఇరాన్‌ను టార్గెట్‌ చేశాయి. అయినా ఇరాన్‌ ఇంతకాలం ప్రతిఘటిస్తూనే ఉంది.
ఈ క్రమంలో అమెరికా జాతీయ భౌగోళిక–భద్రతా సంస్థకు చెందిన పత్రాలు ‘మిడిల్‌ ఈస్ట్‌ స్పెక్టేటర్‌’ టెలిగ్రామ్‌ ఛానల్‌లో కనిపించాయి. ఇందులో ఇజ్రాయెల్‌ వాయుసేనా సన్నద్ధతలు, దీర్ఘదూర క్షిపణులు (రాక్స్, హారిజన్‌) వాడకాలు, దాడి రిహార్సల్‌ వివరాలు ఉన్నాయి. పెంటగాన్‌ భద్రతా విఫలం దీనికి కారణంగా చెబుతున్నారు.

ఇజ్రాయెల్‌ వ్యూహాల గందరగోళం..
ఈ సమాచారం ఇరాన్‌ చేతిలో పడటంతో ఇజ్రాయెల్‌ సుదూర దాడి ప్రణాళికలు ప్రభావితమయ్యాయి. శత్రువు ముందుగానే తమ చర్యలు ఊహించి ప్రతిఘటనలు సిద్ధం చేసుకోవచ్చు. అమెరికా ఉపగ్రహాల ద్వారా మిత్రరాజ్య చర్యలను పరిగణించడం తెలిసిపోవటంతో ఇజ్రాయెల్‌లో అనుమానాలు పెరిగాయి. ఫలితంగా ప్రణాళికలను తక్షణం సవరించుకోవలసి వచ్చింది.

లీక్‌ మూలాలపై దర్యాప్తు
ఎఫ్‌బీఐ పరిశోధన ప్రకారం, ఇంటెలిజెన్స్‌ అధికారి నుంచి లీక్‌ జరిగినట్లు అనుమానం. టాప్‌ సీక్రెట్‌ డాక్యుమెంట్లు ’ఫైవ్‌ ఐస్‌’ మిత్రులకు మాత్రమే పరిమితం కావాలి, కానీ సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం ఆశ్చర్యం కలిగించింది. ఇది హ్యాకింగ్‌గా లేక ఉద్దేశపూర్వక బయటపెట్టారా అన్న చర్చ జరుగుతోంది.

ఈ సంఘటన ఆధునిక యుద్ధాలు భౌతిక రంగంతోపాటు సైబర్‌ రంగంలోనూ జరుగుతాయని నిరూపించింది. అమెరికా–ఇజ్రాయెల్‌ మధ్య నమ్మకం దెబ్బతినడం, ఇరాన్‌ ప్రతిఘటనలు మరింత బలపడటానికి దారితీసే అవకాశం. భద్రతా విధానాల్లో టెక్నాలజీ లోపాలను సరిదిద్దాల్సిన అవసరం ఉదాహరించబడింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక స్థిరత్వాన్ని బెదిరిస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper