spot_img
Homeఅంతర్జాతీయంUS Military Attack: అమెరికా దుర్మార్గానికి ఏపీ వాసి బలి.. ఒరేయ్ ట్రంప్ నువ్వు మట్టి...

US Military Attack: అమెరికా దుర్మార్గానికి ఏపీ వాసి బలి.. ఒరేయ్ ట్రంప్ నువ్వు మట్టి కొట్టుకొని పోతావ్

US Military Attack: అమెరికా దుర్మార్గం గురించి ఎంత చెప్పినా తక్కువే. గిట్టని దేశాల మీద రాళ్లు వేయడంలో.. తనకు అనుకూలంగా లేకపోతే దాడులు చేయడంలో అమెరికా సిద్ధహస్తమైన దేశం.. అమెరికా ప్రపంచ పెద్దన్నగా మారడానికి.. ప్రపంచ దేశాల మీద పెత్తనం సాగించడానికి ఎన్నో రకాల దుర్మార్గాలు చేసింది. ఇంకాను చేస్తూనే ఉంది. తాజాగా అమెరికా చేసిన దాడి ఏపీ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి జీవితంలో చీకట్లు నింపింది.

ఏపీ రాష్ట్రంలోని విశాఖపట్నం నగరానికి చెందిన పట్నాల సురేష్ అనే వ్యక్తి మెరైన్ ఇంజనీర్. అతడు ఇండియన్ నేవీలో పని చేస్తూ ఉంటాడు. వృత్తిరీత్యా అతడు ఇటీవల ఒమన్ వెళ్ళాడు. తన విధులు ముగించుకొని.. తిరిగి అదే ఓడలో ఇండియాకు ప్రయాణమవ్వగా.. అమెరికా దాడి చేసింది. ఒమన్ తీరంలో సురేష్ ప్రయాణిస్తున్న ఓడ మీద అమెరికా దళాలు దాడి చేశాయి. ఈ దాడిలో సురేష్ తో సహా ముగ్గురు చనిపోయారు. సురేష్ కు భార్య, 13, 10 సంవత్సరాల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. అతడు చనిపోయిన విషయాన్ని భారత నేవీ వర్గాలు కుటుంబ సభ్యులకు తెలియజేశాయి.

భర్త చనిపోవడంతో అతని భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. ఈనెల 24న సురేష్ వివాహ వార్షికోత్సవం ఉంది. దానిని ఘనంగా జరుపుకోవాలని ఇప్పటికే సురేష్ తన భార్యతో అనేకసార్లు చెప్పాడు. ఆ ఏర్పాట్లలో భార్య నిమగ్నమై ఉంది. భర్త ఇండియాకు రాగానే.. అతనితో కలిసి ఈ వేడుకలు జరుపుకోవాలని నిర్ణయించుకుంది. కానీ అమెరికా చేసిన దాడి వల్ల సురేష్ చనిపోయాడు. తన కుటుంబాన్ని చీకట్లో వదిలేసి వెళ్లిపోయాడు..

సురేష్ మెరైన్ ఇంజనీర్. ఇతడు విశాఖపట్నం వాసి. విధి నిర్వహణలో చురుకుగా ఉంటాడు. పై అధికారులకు ఇతడి పనితీరు అంటే చాలా ఇష్టం. అయితే దుర్మార్గపు అమెరికా చేసిన దాడి వల్ల ఇతడు చనిపోయాడు. ఇటీవల కాలంలో భారత నౌకలను లక్ష్యంగా చేసుకొని అమెరికా దాడులు చేపడుతుంది. కొన్ని సందర్భాలలో ఇది ప్రాణనష్టానికి కూడా దారి తీస్తోంది. ఇరాన్ హార్మోజ్ సంధిని మూసివేయడంతో.. పరిస్థితి దారుణంగా మారిపోయింది. అమెరికా బలగాలు విపరీతంగా దాడులు చేస్తున్నాయి. దీంతో మధ్య ప్రాచ్యం లో మళ్లీ యుద్ధం మొదలైంది.

అమెరికా దళాలు చేసిన దాడులను అందరూ ఖండిస్తున్నారు. ఇలా దాడులు చేయడం వల్ల సురేష్ చనిపోయాడని.. ఈ దాడులకు రూపకర్త అయిన ట్రంప్ మట్టి కొట్టుకుని పోతాడని శాపనార్ధాలు పెడుతున్నారు. సురేష్ భార్య విలపిస్తున్న తీరు మాటలకు అందనిదిగా ఉంది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కావడం లేదు. మరి కొద్ది రోజుల్లో తమ తండ్రి వస్తాడని భావించిన ఆ పిల్లలకు.. అతడి చివరి చూపు కూడా కరువైంది. సురేష్ మరణంతో నేవీ వర్గాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
Oktelugu Epaper