Homeఅంతర్జాతీయంUS vs Iran War F-35 Incident: అమెరికా బ్రహ్మాస్త్రాన్ని కొట్టిన ఇరానీ రాడర్స్‌.. అగ్రరాజ్యం...

US vs Iran War F-35 Incident: అమెరికా బ్రహ్మాస్త్రాన్ని కొట్టిన ఇరానీ రాడర్స్‌.. అగ్రరాజ్యం పని అయిపోయినట్టే

US vs Iran War F-35 Incident: పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.. అనడం వింటుంటాం. పెద్దగా శక్తిలేనివారిపై బలవంతుడు దాడిచేయడాన్ని ఇలా సంబోధిస్తారు. వెనెజువెలా, ఇరాన్‌ వంటి చిన్న దేశాలపై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా దాడి అలాంటిదే. అయితే బ్రహ్మాస్త్రాన్ని పిచ్చుకలు కొట్టిన దాఖలాలు లేవు. కానీ అమెరికా–ఇరాన్‌ యుద్ధంలో నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న పరిణాహాలు అగ్రరాజ్యం దిమ్మతిరిగేలా చేశాయి. అమెరికా బ్రహ్మాస్త్రం.. అమెరికా తమ బలంగా భావించేది ఎఫ్‌–35 స్టెల్త్‌ విమానం. ఇది రాడార్లకు […]

US vs Iran War F-35 Incident: పిచ్చుకపై బ్రహ్మాస్త్రం.. అనడం వింటుంటాం. పెద్దగా శక్తిలేనివారిపై బలవంతుడు దాడిచేయడాన్ని ఇలా సంబోధిస్తారు. వెనెజువెలా, ఇరాన్‌ వంటి చిన్న దేశాలపై ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా దాడి అలాంటిదే. అయితే బ్రహ్మాస్త్రాన్ని పిచ్చుకలు కొట్టిన దాఖలాలు లేవు. కానీ అమెరికా–ఇరాన్‌ యుద్ధంలో నాలుగు రోజుల క్రితం చోటుచేసుకున్న పరిణాహాలు అగ్రరాజ్యం దిమ్మతిరిగేలా చేశాయి.

అమెరికా బ్రహ్మాస్త్రం..
అమెరికా తమ బలంగా భావించేది ఎఫ్‌–35 స్టెల్త్‌ విమానం. ఇది రాడార్లకు కూడా చిక్కదు. శత్రుదేశాల గగనతలంలో స్వేచ్ఛగా విహరిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది అమెరికా బ్రహ్మాస్త్రం. కానీ ఇరాన్‌ గగనతల రక్షణ వ్యవస్థ దీనిని పసిగట్టి కొట్టింది. రాడార్లకు చిక్కని ఎఫ్‌–35 ఇంజిన్‌ వేడి సంకేతాలను ఇన్ఫ్రారెడ్‌ సెన్సార్లు పట్టుకుని దాడి చేశాయని తెలుస్తోంది. దెబ్బతిన్న విమానం మధ్యప్రాచ్యంలోని ఎయిర్‌బేస్‌లో అత్యవసర ల్యాండింగ్‌ అయింది. పైలట్‌ సురక్షితంగా ఉన్నాడు.

స్టెల్త్‌ బలహీనతలు
స్టెల్త్‌ టెక్నాలజీ రాడార్‌ తరంగాలను మాత్రమే తప్పించుకుంటుంది, హీట్‌ సిగ్నేచర్‌లకు బదులుగా ఇన్ఫ్రారెడ్‌ ట్రాకింగ్‌ పనిచేయదు. ఇరాన్‌ వంటి దేశాలు ఇలాంటి వ్యవస్థలతో అధునాతన విమానాలను సవాలు చేయగలవు. ఇది భవిష్యత్‌ యుద్ధాల్లో బహుళ సెన్సార్‌ వ్యూహాల అవసరాన్ని సూచిస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎఫ్‌–35
లాక్‌హీడ్‌ మార్టిన్‌ తయారు చేసిన ఈ విమానం ఎఫ్‌–35ఏ, ఎఫ్‌–35బి, ఎఫ్‌–35సీ మూడు రకాలుగా ఉంది, ధర ఒక్కొక్కటి సుమారు 100 మిలియన్‌ డాలర్లు. ఇజ్రాయిల్, యూకే, జపాన్, దక్షిణ కొరియా వంటి 20 దేశాలు దీన్ని ఉపయోగిస్తున్నాయి. భారత్‌ను కూడా కొనుగోలు చేయాలని అమెరికా ఒత్తిడి చేసింది. కానీ లోపాలను ముందే పసిగట్టిన భారత్‌ వాటి కొనుగోలుకు దూరంగా ఉంది.

అమెరికా ఈ వాదనలను పూర్తిగా ధ్రువీకరించకపోయినా, దర్యాప్తు జరుగుతోంది. ఇది ఎఫ్‌–35 ఆధిపత్యానికి సవాలుగా మారవచ్చు, ఇతర దేశాల్లో కొత్త రక్షణ వ్యవస్థల అవసరాన్ని పెంచవచ్చు. సైనిక ఆయుధాల అభివృద్ధిలో బహుళ లేయర్‌ రక్షణలు కీలకమవుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper