Dhurandhar 2 Box Office Collection 5 Days: ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) చిత్రం రోజుకో మైల్ స్టోన్ ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు దూసుకుపోతున్న విధానం చూస్తుంటే, మరో రెండు రోజుల్లో వెయ్యి కోట్ల గ్రాస్ మార్కుని అందుకుంటుందని అనిపిస్తోంది. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ‘ధురంధర్’ చిత్రానికి 1400 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. దీనిని ‘ధురంధర్ 2’ ఈ వీకెండ్ కి దాటేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పార్ట్ 2 కచ్చితంగా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని అంతా అనుకున్నారు కానీ, ఈ రేంజ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. 5 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, కేవలం హిందీ భాషలో మాత్రమే కాదు, తెలుగు లో కూడా హిస్టారికల్ థియేట్రికల్ రన్ ని సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది.
Also Read: మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. ఇంత దారుణమా.. అసలు వాళ్ళు ఏమైపోవాలి?
ట్రేడ్ పండితులు అందిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఈ చిత్రానికి 5 రోజుల్లో ఇండియా వైడ్ గా 620 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. గ్లోబల్ వైడ్ గా చూస్తే 830 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇది వరకు ‘పుష్ప 2’ కి 5 రోజుల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఇండియన్ సినిమాగా పేరు ఉండేది. ఇప్పుడు ఆ రికార్డు ని ‘ధురంధర్ 2 ‘ చిత్రం అవలీలగా బ్రేక్ చేసింది. ఈ సినిమా ఏ రేంజ్ సునామీ సృష్టిస్తూ ముందుకు వెళ్తుంది అనేది క ఉదాహరణ చూద్దాం. సాధారణంగా నార్త్ అమెరికా లో ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినప్పటికీ సోమవారం రోజున కలెక్షన్స్ నమోదు అవ్వడం చాలా కష్టం. అలాంటిది ఈ చిత్రానికి సోమవారం రోజున ఏకంగా 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
దీనిని బట్టి ఈ చిత్రం ఏ రేంజ్ హిస్టారికల్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు ఇక తెలుగు వెర్షన్ విషయానికి వస్తే నిన్న ఈ చిత్రానికి వర్కింగ్ డే అవ్వడం తో B,C సెంటర్స్ బాగా డౌన్ అయ్యాయి. కానీ మ్యాట్నీ నుండి A సెంటర్స్ లో ఈ చిత్రం హౌస్ ఫుల్స్ నమోదు చేసుకుంది. ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఈ చిత్రానికి ఆన్లైన్ ట్రాకింగ్ సిస్టం ద్వారా 6 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఇది సాధారణమైన విషయం కాదు, ఈమధ్య కాలం లో సూపర్ హిట్ తెలుగు సినిమాలకు కూడా ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు. ఊపు చూస్తుంటే ఈ సినిమా తెలుగు వెర్షన్ నుండే 50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టేలా అనిపిస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నా
