Homeఅంతర్జాతీయంUS Iran War: ఇరాన్ తో యుద్ధం.. అమెరికాకు తడిసి మోపెడవుతోంది

US Iran War: ఇరాన్ తో యుద్ధం.. అమెరికాకు తడిసి మోపెడవుతోంది

US Iran War: వ్యవస్థ నిర్మాణానికి ఎంతైతే ఖర్చవుతుందో.. విధ్వంసానికి కూడా అంతకుమించి ఖర్చవుతుంది. ఇప్పుడు ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో కూడా అదే స్థాయిలో ఖర్చవుతుంది. ఇజ్రాయిల్ ఎంత ఖర్చు పెడుతుందో తెలియదు కానీ.. అమెరికా మాత్రం బీభత్సంగా డబ్బులను ఖర్చు చేస్తోంది.

Also Read: మిడిల్ ఈస్ట్ లో యుద్ధం… మన బ్రహ్మోస్ గురించి చర్చ.. ఎందుకంటే

ఇరాన్ తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలను.. డ్రోన్ లను.. మిసైల్స్ ఉపయోగిస్తోంది. వీటికోసం భారీగా ఖర్చు చేస్తోంది. ఇరాన్ దేశంపై చేసిన దాడుల్లో తొలి 24 గంటల్లోనే అమెరికా దాదాపు 6900 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఈ యుద్ధం గనక నెలరోజుల పాటు సాగితే మొత్తం ఖర్చు 18 .87 లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అమెరికా యుఎస్ఎస్ జరాల్డ్ ఆర్ ఫోర్ద్ అనే యుద్ధ విమానానికి నిర్వహణ ఖర్చు దాదాపు రోజుకు 58 కోట్లు అవుతోందని తెలుస్తోంది. చమురు ధరలు పెరగడం వల్ల… అంతర్జాతీయ వాణిజ్యంలో మార్పులు రావడం వల్ల అమెరికాకు ఇంకా 115 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలుస్తోంది. అమెరికా ఇప్పటికే ఆర్థికంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఇటీవల కాలంలో మూడుసార్లు ఆర్థికంగా అత్యయిక పరిస్థితి ఎదుర్కొంది. ఇప్పుడు ఇది సరిపోదన్నట్టు అమెరికా ఇరాన్ దేశంతో జరుగుతున్న యుద్ధంలో పాల్గొంటున్న నేపథ్యంలో మరింత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది.

అమెరికాలో నిరుద్యోగం పెరిగిపోతోంది. అమెరికా కంపెనీలు సొంత దేశంలో కాకుండా.. ఇతర దేశాలలో పెట్టుబడులు పెడుతున్నాయి. దీనికి తోడు ట్రంప్ విధానాల పట్ల స్వదేశంలో తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇంత జరుగుతున్నప్పటికీ ట్రంప్ ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇరాన్ దేశంతో జరుగుతున్న యుద్ధంలో సై అంటూ ముందుకు వెళ్తున్నాడు. ఈ యుద్ధం వల్ల అమెరికాకు జరిగే లాభం కంటే ఆర్థికంగా జరిగే నష్టం ఎక్కువ అని విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ ఈ యుద్ధం నుంచి మధ్యలో గనక అమెరికా వస్తే పరిస్థితి వేరే విధంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. ఇప్పటికే ఇరాన్ దేశానికి చైనా పరోక్షంగా సహకారం అందిస్తోంది. ఫలితంగా అమెరికా కూడా యుద్ధంలో ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ కూడా చాకచక్యంగా దాడులు చేస్తోంది. ఇది అమెరికాకు తీవ్రమైన నష్టం కలగజేస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper