Homeఅంతర్జాతీయంTurkey Pakistan conspiracy: టర్కీ–పాకిస్తాన్‌ సాయుధ కుట్రలు.. భారత్‌కు మరో శత్రుదేశం తయారైంది!

Turkey Pakistan conspiracy: టర్కీ–పాకిస్తాన్‌ సాయుధ కుట్రలు.. భారత్‌కు మరో శత్రుదేశం తయారైంది!

Turkey Pakistan conspiracy: భారత వ్యతిరేక కుట్రలు చేసే దేశాల్లో పాకిస్తాన్, చైనా అగ్రస్తానంలో ఉంటాయి. ఇవి భారత్‌లో అల్లర్లు, దాడులు సృష్టించేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాయి. వీటికి బంగ్లాదేశ్, నేపాల్‌ మద్దతు ఇస్తున్నాయి. అయితే ఇప్పుడు భారత వ్యతిరేక జాబితాలో పాకిస్తాన్‌కు మరో దేశం తోడైంది. కొత్త మిత్రుడేమీ కాదు.. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో తన సైన్యాన్ని, ఆయుధాలు, డ్రోన్లను పాకిస్తాన్‌కు పంపి భారత్‌కు వ్యతిరేకంగా పోరాడింది.. అదే తుర్కియే అలియాస్‌ టర్కీ.

టర్కీ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు..
టర్కీ, పాకిస్తాన్‌ మధ్య సంబంధాలు పెరుగుతున్నాయి. స్నేహబంధం బలపడుతోంది. దీంతో టర్కీ పాకిస్తాన్‌ తో కలిసి భారత్‌ వ్యతిరేక కార్యకలాపాలలో కీలక పాత్ర పోషిస్తోంది. ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో డ్రోన్లు, సైనిక శక్తిని అందజేసి, గూఢచార, ఉగ్రవాద సంస్థల మద్దతునిచ్చి ఈ ఇద్దరు దేశాలు ఒకరికొకరు అండగా పనిచేస్తున్నాయి.

టర్కీలో ఇస్లామిక్‌ ప్రభుత్వం తర్వాత..
టర్కీ ఒకప్పుడు భారత్‌కు మిత్ర దేశం. కానీ అక్కడ ఇస్లామిక్‌ ప్రభుత్వం వచ్చి, టర్కీ భారత వ్యతిరేక వ్యూహాలను పెంచింది. పాకిస్తాన్, మలేషియా వంటి ఇతర ఇస్లామిక్‌ దేశాలతో కలిసి ఫనిచేయాలని భావించింది. కానీ ఎవరూ వారితో కలవలేదు.మలేషియా కూడా దూరమైంది. టర్కీ–పాకిస్తాన్‌ మాత్రం భారత వ్యతిరేక కుట్రలు పెంచుతున్నాయి.

గూఢచార సంస్థలు, ఉగ్రవాది మద్దతు
టర్కీ గూఢచార సంస్థ ఎంఐటీ, పాకిస్తాన్‌ ఐఎస్‌ఐతో కలిసి సమాచార సేకరణ, ఉగ్రవాది సమన్వయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ఏడాది టర్కీ నుంచి పారిపోయి పాకిస్తాన్‌ పట్టుకున్న ఉగ్రవాది అబూ యాసిర్‌ అల తుర్కియే ఉదాహరణ. పాకిస్తాన్‌–టర్కీ హోస్ట్‌ చేసిన ఉగ్రవాదులకు హోమ్‌ ప్రొటెక్ట్‌ అందటం భారత భద్రతకు పెద్ద సవాలు.

భౌగోళిక, మౌలిక సంబంధాలు..
యూరప్‌–ఏషియా మధ్యలో ఉన్న టర్కీ దళాలు, అజర్‌బైజాన్‌ ద్వార అకస్మాత్తుగా సెంట్రల్‌ ఆసియా ఉగ్రవాద చర్యలకు సులువుగా వెళ్తున్నాయి. ఇది భారత వ్యతిరేక దృక్పథాన్ని మరింత బలపరుస్తోంది. ఢిల్లీలో వైట్‌ కోర్ట్‌ ఉగ్రవాదులు అయిన డాక్టర్లు పై జైష్‌ ఎ మహ్మద్‌ ఉగ్రవాదులకు సంబంధించిన పేలుళ్లు, టర్కీతో సంబంధం ఉన్న ఐఎస్‌ఐ ఏజెంట్ల హస్తం, నల్ల కార్యక్రమాలు భారత భద్రతకు నేరుగా విఘాతం కలిగిస్తున్నాయి.

టర్కీ సహకారంతో ఉగ్రవాదులు మంచి పునాదులు ఏర్పరుచుకుంటూ, భారత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు విస్తరించాయి. ప్రముఖ వ్యతిరేక కార్యకర్తలు, సైనిక గూడచారులు ఈ మద్దతుతో యుద్ధ చర్యలను గణనీయంగా పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో టర్కీ పాకిస్తాన్‌ మద్దతుతో భారత భద్రతపై కొనసాగుతున్న సవాళ్లను సక్రమంగా గుర్తించి, అంతర్జాతీయ సంబంధాల్లో సూటిగానూ స్పందించడం అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular