Homeఅంతర్జాతీయంTrump warning to Netanyahu: పిచ్చి వేశాలు వేస్తే ఒంటరి అవుతావు.. నెతన్యాహుకు ట్రంప్‌ వార్నింగ్‌!

Trump warning to Netanyahu: పిచ్చి వేశాలు వేస్తే ఒంటరి అవుతావు.. నెతన్యాహుకు ట్రంప్‌ వార్నింగ్‌!

Trump warning to Netanyahu: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు మధ్య విభేదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్‌ మాటను ఇజ్రాయెల్‌ పట్టించుకోవడం లేదు. ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందానికి విఘాతం కలుగుతోంది. ఇరాన్‌పై దాడి చేయొద్దని ఇప్పటికే ట్రంప్‌ ఇజ్రాయెల్‌కు సూచించారు. ఈమేరకు ఫోన్‌లో మాట్లాడారు. అయినా నెతన్యాహు పట్టించుకోలేదు. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నారు. దీంతో తాజాగా ట్రంప్‌ తీవ్రంగా […]

Trump warning to Netanyahu: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు మధ్య విభేదాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై దాడుల విషయంలో ట్రంప్‌ మాటను ఇజ్రాయెల్‌ పట్టించుకోవడం లేదు. ఇరాన్‌తోపాటు లెబనాన్‌పై దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో అమెరికా–ఇరాన్‌ మధ్య శాంతి ఒప్పందానికి విఘాతం కలుగుతోంది. ఇరాన్‌పై దాడి చేయొద్దని ఇప్పటికే ట్రంప్‌ ఇజ్రాయెల్‌కు సూచించారు. ఈమేరకు ఫోన్‌లో మాట్లాడారు. అయినా నెతన్యాహు పట్టించుకోలేదు. ఇరాన్‌పై దాడులు కొనసాగిస్తున్నారు. దీంతో తాజాగా ట్రంప్‌ తీవ్రంగా స్పందించారు.

ఇంటర్వ్యూలో వార్నింగ్‌..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహును ‘బి కేర్‌ఫుల్‌‘ అని హెచ్చరించారు. ఇరాన్‌పై మరొక ప్రత్యక్ష దాడికి దిగితే ఇజ్రాయెల్‌ ఒంటరి అవుతుందని వార్నింగ్‌ ఇచ్చారు. ట్రంప్‌ హెచ్చరిక వెనుక మూడు రాజకీయ సందేశాలు ఉన్నాయి. అమెరికా పాక్షికంగా ఇజ్రాయెల్‌కు ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వదనే సంకేతం, ప్రాంతీయ స్థిరత్వాన్ని పరిరక్షించాలనే కోరిక, అలాగే దౌత్యపరమైన ఒత్తిడితో ఇజ్రాయెల్‌ చర్యలను నిరోధించాలనే ఉద్దేశ్యం.

సీజ్‌ఫైర్‌ ఉల్లంఘనలు..
అమెరికా, ఇజ్రాయెల్‌ మధ్య ఏప్రిల్‌లో తాత్కాలిక సీజ్‌ఫైర్‌ కుదిరింది. కానీ, ఇటీవల అమెరికా ఇరాన్‌పై దాడులు చేసింది. దీంతో ఇరాన్‌ అమెరికా అనుకూల గల్ఫ్‌ దేశాలతోపాటు ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేసింది. దీనిని సవాల్‌గా తీసుకున్న ఇజ్రాయెల్‌ ఇరాన్‌పై భీకర దాడుల ప్రారంభించింది. తాజాగా ట్రంప్‌ సూచన తరువాత ఇజ్రాయెల్‌ తక్షణంగా దాడులను నిలిపివేసినట్లు సమాచారం. అమెరికా, ఇజ్రాయెల్‌ రెండూ సీజ్‌ఫైర్‌ను ఉల్లంఘించాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ప్రాంతీయ ప్రభావాలు
మధ్య ప్రాచ్యంలో ప్రతీ యుద్ధ సంకేతం ఇంధన మార్కెట్లపై, శాంతి ప్రక్రియలపై తక్షణ ప్రభావం చూపుతుంది. సౌదీ అరేబియా, ఐరాన్‌కు శత్రుత్వం కలిగిన సభ్యదేశాలు, అలాగే రష్యా–చైనా వంటి ప్రధాన శక్తులు తమ స్థానాన్ని పునర్నిర్వచించుకోవచ్చు. చిన్న శక్తి గుంపులు, ప్రాదేశిక మిలిషియా సంస్థలు కూడా తమ చర్యల మాధ్యమంగా పరిసర వాతావరణాన్ని ఉద్రిక్తంగా మార్చవచ్చు.

దౌత్య వ్యూహాలు..
ట్రంప్‌ హెచ్చరికతో అమెరికా ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా నిలిపవేసే అవకాశం ఉంది. సైనిక సహకారం అందించకపోవచ్చు. ఇజ్రాయెల్‌ లోకల్‌ పాలనా, నెతన్యాహు తన నిర్ణయాలను స్థానిక రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని తీసుకోవచ్చని విశ్లేషకుల అభిప్రాయం. అంతర్జాతీయ మధ్యస్థత్వం, మూడవ పక్షాల పర్యవేక్షణ కీలకం అవుతుందని దౌత్య నిపుణులు సూచిస్తున్నారు.

ట్రంప్‌ హెచ్చరిక నెతన్యాహు, ఇజ్రాయెల్‌ నిర్ణయాల్లో తాత్కాలిక ఒత్తిడిని సృష్టించింది. అయితే సీజోన్‌ఫైర్‌ ప్రకటనలపై నమ్మకంపై పశ్చాత్తాపాలేవు. మైదానంలో నియమాలు మారడానికి, ప్రాంతీయ అల్లర్లు తగ్గడానికి అంతర్జాతీయ డిప్లొమసీ, పాక్షిక పర్యవేక్షణ, సుస్థిర విధానాల అమలే కీలకం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper