Homeఅంతర్జాతీయంHormuz Strait Tension: భారత నౌకలను టార్గెట్‌ చేసిన ట్రంప్‌.. హార్ముజ్‌లో ఉద్రిక్తత!

Hormuz Strait Tension: భారత నౌకలను టార్గెట్‌ చేసిన ట్రంప్‌.. హార్ముజ్‌లో ఉద్రిక్తత!

Hormuz Strait Tension: పశ్చిమాసియాలో 40 రోజుల జరిగిన యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అమెరికా, ఇరాన్‌ మధ్య రెండు వారాల సీజ్‌ఫైర్‌ ఒప్పందం కుదిరింది. అయినా ఇరాన్‌కు మద్దతుగా నిలిచిన లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. మరోవైపు సీజ్‌ఫైర్‌ను శాశ్వత శాంతి దిశగా తీసుకెళ్లేందుకు పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో చర్చలు జరిపారు. కానీ ఇరు దేశాలు పట్టువిడుపు లేకుండా వ్యవహరించడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ […]

Hormuz Strait Tension: పశ్చిమాసియాలో 40 రోజుల జరిగిన యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అమెరికా, ఇరాన్‌ మధ్య రెండు వారాల సీజ్‌ఫైర్‌ ఒప్పందం కుదిరింది. అయినా ఇరాన్‌కు మద్దతుగా నిలిచిన లెబనాన్‌లోని హెజ్‌బొల్లాపై ఇజ్రాయెల్‌ దాడులు చేస్తోంది. మరోవైపు సీజ్‌ఫైర్‌ను శాశ్వత శాంతి దిశగా తీసుకెళ్లేందుకు పాకిస్తాన్‌ మధ్యవర్తిత్వంతో ఇరు దేశాల ప్రతినిధులు ఇస్లామాబాద్‌లో చర్చలు జరిపారు. కానీ ఇరు దేశాలు పట్టువిడుపు లేకుండా వ్యవహరించడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హర్మూజ్‌ జలసంధిపై కఠిన నిర్ణయం తీసుకున్నారు. అమెరికా నావికాదళం ఆ ప్రాంతంలో పూర్తి అడ్డుకట్ట మొదలుపెట్టనుంది. ఏ దేశం సంచార వాహనాలు ప్రవేశించకుండా చూడాలని ప్రకటించారు.

భారత నౌకలకు ఇరాన్‌ అనుమతి..
యుద్ధం మొదలైన తర్వాత ఇరాన్‌ హర్మూజ్‌ను మూసివేసింది. దీంతో వందలాది నౌకలు అక్కడే చిక్కుకుపోయాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొంది. అయితే భారత్‌ ఇరాన్‌తో జరిపిన దౌత్యంతో భారత్‌తోపాటు చైనా, రష్యా, ఇరాక్, పాకిస్తాన్‌ నౌకలకు ఇరాన్‌ ప్రత్యేక అనుమతి ఇచ్చింది. చర్చలు విఫలమైన నేపథ్యంలో ట్రంప్‌ ఇప్పుడు ఈ దేశాల నౌకలను టార్గెట్‌ చేస్తారన్న చర్చ జరుగుతోంది.

ప్రపంచ యుద్ధ భయం..
అమెరికా రష్యా, చైనా, భారత నౌకలను దాడి చేస్తే అంతర్జాతీయ సంక్షోభం తలెత్తుతుంది. రష్యా–చైనా సైనిక స్పందన ఇస్తే, మధ్యప్రాచ్య ఆయిల్‌ మార్గాలు మూతపడతాయి. భారత వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బ తగులుతుంది. మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశాలు పెరుగుతాయి. ఇరాన్‌ హార్ముజ్‌ మార్గంలో మైన్స్‌ అమర్చి, తమకు మాత్రమే తెలిసిన మార్గాలను సూచించింది. అధికారం లేకుండా అమెరికా నావికాదళం ప్రవేశిస్తే, తీవ్ర నష్టాలు సంభవిస్తాయి. ఇది ట్రంప్‌ వ్యూహానికి పెద్ద సవాల్‌గా మారింది.

భారత్‌లో వాణిజ్య ఆందోళనలు..
భారత్‌ ఇరాన్‌ నుంచి క్రూడ్‌ ఆయిల్‌ దిగుమతి చేసుకుంటోంది. హార్ముజ్‌ మూసివేతతో ఆయిల్‌ ధరలు పెరిగాయి. ఇది భారత్‌తోపాటు అనేక దేశాలపై ప్రభావం చూపుతోంది. ఆర్థిక ఒత్తిడి తీసుకువస్తుంది. భారత నౌకలు ఇరాన్‌ అనుమతితో ప్రయాణిస్తే అమెరికాలో టెన్షన్‌ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై భారత్‌ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. లేదంటే భారత వాణిజ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.

ట్రంప్‌ నిర్ణయం గ్లోబల్‌ ఆయిల్‌ వాణిజ్యాన్ని కుదిపేస్తుంది. యూరప్, ఆసియా దేశాలు ఆర్థికంగా దెబ్బతింటాయి. రష్యా–చైనా అలయన్స్‌ బలపడుతుంది. భవిష్యత్తులో యుద్ధాలకు అవకాశాలు పెరుగుతాయి. ఈ అనిశ్చితి ప్రపంచ రాజకీయాలకు కొత్త దిశను ఇస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper