Allu Arjun Raaka Mannerism Controversy: సోషల్ మీడియా లో ఈమధ్య కాలంలో హీరోలకు సంబంధించిన పీఆర్ పనులు తారా స్థాయికి చేరుకున్నాయి. తుమ్మినా , దగ్గినా కూడా మా హీరోకి సంబంధించిన మ్యానరిజాన్ని పలానా స్టార్ క్రికెటర్ అనుసరించాడు, ఇది మా హీరో రేంజ్ అంటూ డప్పు కొట్టుకోవడం అభిమానులకు కూడా చూసేందుకు చాలా ఇబ్బందిగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి అయితే పీఆర్ రుద్దుడు మామూలు రేంజ్ లో ఉండదు అని అంటున్నారు విశ్లేషకులు. అందుకు ఉదాహరణగా నిన్న జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా లో పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారిపోయింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) పుట్టినరోజు సందర్భంగా ప్రస్తుతం డైరెక్టర్ అట్లీ తో ఆయన చేస్తున్న ‘రాకా'(Raaka Movie) చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేశారు.
ఈ పోస్టర్ విడుదలకు ముందు రోజు ఒక ప్రీ లుక్ ని వదిలారు. అందులో అల్లు అర్జున్ తన చేతిని పైకి చూపుతూ , మూడు వేళ్లను చూపిస్తూ, ఒక మ్యానరిజం చేస్తాడు. ఇది అభిమానులకు కూడా పెద్దగా రిజిస్టర్ అవ్వలేదు , అలాంటిది ప్రముఖ క్రికెటర్ హార్థిక్ పాండ్యా(Harthik Pandhya) ఈ మ్యానరిజాన్ని ఇమిటేట్ చేసినట్టు అల్లు అర్జున్ పీఆర్ టీం రుద్దడాన్ని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మామూలు రేంజ్ లో ట్రోల్ చేయడం లేదు. నిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మరియు ముంబై ఇండియన్స్ టీమ్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో , హార్థిక్ పాండ్య ఒక వికెట్ తీసినప్పుడు అభిమానులకు అభివాదం చేస్తూ , తన చేతిని పైకి చూపిస్తాడు. అంతే , ఇక దానిని అల్లు అర్జున్ పీఆర్ టీం ‘రాకా’ ప్రీ లుక్ పోస్టర్ లోని మ్యానరిజాన్ని హార్థిక్ పాండ్యా అనుసరించాడు అంటూ ప్రచారం చేసింది.
ఇలా అల్లు అర్జున్ పీఆర్ టీం రుద్దితే , అభిమానులు మాత్రం ఎందుకు సైలెంట్ గా ఉంటారు , వాళ్ళు కూడా హార్థిక్ పాండ్యా ‘రాకా’ మ్యానరిజాన్ని అనుసరించాడు , అల్లు అర్జున్ క్రేజ్ అలాంటిది అంటూ ఒక రేంజ్ లో ట్వీట్స్ వేయడం మొదలు పెట్టారు. దీనిపై సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్ అభిమానులు ఒక రేంజ్ లో ట్రోల్స్ చేస్తున్నారు. స్టార్ హీరోల పాత సినిమాలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ ని వేసి , హార్థిక్ పాండ్యా మా హీరో మ్యానరిజాన్ని కాపీ కొట్టాడు అంటూ ఫన్నీ సెటైర్స్ తో నిండిన ట్వీట్స్ వేస్తున్నారు. ట్విట్టర్ లో ఎక్కడ చూసిన ఇప్పుడు ఈ ఫన్నీ ట్రోల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి.