Homeఅంతర్జాతీయంTrump Iran Hormuz Strait Tension: ట్రంప్ చెప్పినంత ఈజీగా హర్ముజ్ తెరుచుకోదు.. రిమోట్ ఇరాన్...

Trump Iran Hormuz Strait Tension: ట్రంప్ చెప్పినంత ఈజీగా హర్ముజ్ తెరుచుకోదు.. రిమోట్ ఇరాన్ చేతిలో..

Trump Iran Hormuz Strait Tension: ఇంకేముంది ట్రంప్ చెప్పాడు. ఇరాన్ కూడా ఒప్పుకుంది.. యుద్ధం ముగిసిపోయింది.. ఇంకా అంతా ప్రశాంతం.. శాంతి వెల్లివిరుస్తుంది. సామరస్యం వర్ధిల్లుతుంది.. ప్రపంచం మొత్తం బాగుపడుతుంది.. ఇలా రకరకాల విశ్లేషణలు ఉదయం నుంచి వస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా నుంచి మొదలుపెడితే స్థానిక మీడియా వరకు ఈ యుద్ధం.. రెండు వారాల కాల్పుల విరమణ వంటి విషయాల గురించి కథనాలు వస్తున్నాయి. కానీ ఇక్కడ చాలామంది మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. […]

Trump Iran Hormuz Strait Tension: ఇంకేముంది ట్రంప్ చెప్పాడు. ఇరాన్ కూడా ఒప్పుకుంది.. యుద్ధం ముగిసిపోయింది.. ఇంకా అంతా ప్రశాంతం.. శాంతి వెల్లివిరుస్తుంది. సామరస్యం వర్ధిల్లుతుంది.. ప్రపంచం మొత్తం బాగుపడుతుంది.. ఇలా రకరకాల విశ్లేషణలు ఉదయం నుంచి వస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయ మీడియా నుంచి మొదలుపెడితే స్థానిక మీడియా వరకు ఈ యుద్ధం.. రెండు వారాల కాల్పుల విరమణ వంటి విషయాల గురించి కథనాలు వస్తున్నాయి.

కానీ ఇక్కడ చాలామంది మర్చిపోయిన విషయం ఒకటి ఉంది. ఈ కాల్పుల విరమణ అనేది తాత్కాలిక మాత్రమే. రెండు వారాలపాటు మాత్రమే అందుబాటులో ఉంటుంది. పైగా అమెరికా మాట మీద నిలబడి ఉండదు. ఇటీవల ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దానికి బలమైన నిదర్శనం. కొద్దిరోజులు ఇరాన్ దేశాన్ని భూమ్మీద లేకుండా చేస్తానని అంటాడు. మరికొద్ది రోజుల్లో ఇరాన్ సంస్కృతి మొత్తం కాలగర్భంలో కలిసిపోతుందని హెచ్చరిస్తాడు. ఇరాన్ కాళ్ల బేరానికి రావాల్సిందేనని అంటాడు. హర్ముజ్ జల సంధి తెరవాలంటే ప్రపంచ దేశాలు ఏకం కావాలని పిలుపునిస్తాడు. ఇలా తలా తోక లేని మాటలు మాట్లాడటం వల్ల ట్రంప్ మీద చాలా మందికి నమ్మకం పోయింది. సొంత దేశంలో అతడి మీద ప్రజలు తిరగబడుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ యుద్ధం ఎందుకు చేస్తున్నావని ట్రంప్ ప్రశ్నిస్తోంది. దీనివల్ల సాధించిన మేలు ఏమిటో చెప్పు అంటూ నిలదీస్తోంది. ఇదంతా ట్రంప్ కు ఒక రకంగా శిరోభారంగా మారింది. చెడు స్నేహం సర్వనాశనం అనే సామెత తీరుగా ఇజ్రాయిల్ చెప్పినట్టుగా విని అమెరికా అధ్యక్షుడు మొత్తానికి తత్వాన్ని ఒంట పట్టించుకున్నాడు..

ట్రంప్ చెప్పినట్టుగా ఇప్పటికిప్పుడు అక్కడ పరిస్థితి మారదు. హర్ముజ్ జల సంధి కి సంబంధించిన రిమోట్ ఇరాన్ చేతిలో ఉంటుంది. అక్కడ సాయుధులైన ఇరాన్ సైనికులు కాపలా కాస్తుంటారు. ఇరాన్ ఓడలు గస్తీగా ఉంటాయి. అమెరికా దుర్మార్గానికి పాల్పడితే వెంటనే చర్యలు మొదలవుతాయి. ఇదే విషయాన్ని ఇరాన్ ఇప్పటికే స్పష్టంగా చెప్పింది. అమెరికా పెత్తనాన్ని సహించబోమని.. అవసరమైతే మరింత భీకరంగా దాడులు చేస్తామని ఇరాన్ చెప్పేసింది. అందువల్లే ఇప్పటికిప్పుడు అక్కడ పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని గాని.. పాకిస్తాన్ కోరుకున్నట్టుగా జరుగుతుందని అనుకోవడానికి లేదు. పాకిస్తాన్ దేశానికి ప్రత్యామ్నయం లేదు. ఈ యుద్ధం నుంచి బయటపడడానికి అమెరికాకు ఇంకో మార్గం లేదు. అందువల్లే శాంతి ఒప్పందం అని వింత నాటకం ఆడుతున్నాయి. సొంత దేశంలో శాంతిని పరిరక్షించలేని వారు.. ప్రజలకు భరోసా కల్పించలేని వారు.. ప్రపంచ సౌఖ్యాని కోరుకోవడం అంటే.. హంతకులు సంతాప సందేశం చెప్పినట్టుగానే అనుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper