Homeఅంతర్జాతీయంUS: అమెరికా తిక్కకు.. రష్యా మిలియన్ డాలర్ల లెక్క..

US: అమెరికా తిక్కకు.. రష్యా మిలియన్ డాలర్ల లెక్క..

US: సంపన్న రాజ్యాంగానే మాత్రమే కాదు.. ప్రపంచం మీద పెత్తనం చెలాయించే దేశంగా అమెరికాకు పేరు ఉంది. తన ప్రయోజనాల కోసం అమెరికా ఏదైనా చేస్తుంది. తనకు ఆటంకం కలుగుతోంది అని తెలిస్తే ఎంతటి పన్నాగానికైనా తెగిస్తుంది. ఆ మధ్య ఉక్రెయిన్ దేశంతో రష్యా యుద్ధానికి దిగింది. ఈ యుద్ధంలో అమెరికా ఉక్రెయిన్ వైపు ఉంది. తెర వెనుక ఆ దేశానికి సహకరించింది. ఈ క్రమంలో అమెరికా వేసిన తప్పటడుగు ఆ దేశానికి చుక్కలు చూపిస్తున్నది. మిలియన్ డాలర్లు అప్పనంగా ఖర్చు పెట్టేలా చేస్తోంది.

క్రిమియాతో సంబంధాలు ఉన్నాయని భావించి..

ఉక్రెయిన్ తో యుద్ధం చేస్తున్నప్పుడు రష్యా దేశానికి చెందిన సంపన్నుడు సులేమాన్ కిర్మూవ్ కు క్రిమియాతో సంబంధాలు ఉన్నాయని భావించి.. అతడికి చెందిన విలాసవంతమైన ఓడను అమెరికా టాస్క్ ఫోర్స్ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 348 అడుగుల పొడవు ఉన్న ఈ ఓడ పేరు అమాడయా. 2022లో ఈ ఓడ ఫిజీ లోని సముద్ర తీరంలో ఉండగా..ఫిజీ అధికారులతో కలిసి అమెరికాకు చెందిన. ఎఫ్ బీ ఐ(FBI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు.. బంగారం వ్యాపారం చేస్తున్న సులేమాన్ కిర్మూవ్ అమెరికన్ బ్యాంకులను మోసగించడం వల్ల తాము అతడి ఓడను సీజ్ చేశామని అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఓడ శాండియాగోలోని సముద్ర తీరంలో ఉంది. అయితే ఈ ఓడను వేలం వేసి అమెరికన్ బ్యాంకులకు డబ్బులు ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఫెడరల్ న్యాయవాదులు కోర్టును కోరారు. ఇప్పటివరకు ఈ నౌక నిర్వహణ కోసం అమెరికా 20 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసిందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సగటున నెలకు ఈ ఓడ నిర్వహణకు ఆరు లక్షల డాలర్లు అమెరికా ఖర్చు చేస్తోందని వివరించారు. బీమా ఖర్చులకి 1.4 లక్షల డాలర్లు, ఇతర ఖర్చులకు 1.78 లక్షల డాలర్లను అమెరికా వెచ్చించిందని న్యాయవాదులు తెలిపారు. అయితే కోర్టు దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.

230 మిలియన్ డాలర్లు వస్తాయనుకుంటే..

అమెరికా మార్షల్ సర్వీస్ నివేదిక ప్రకారం ఈ ఓడ విలువ 230 మిలియన్ డాలర్లుగా లెక్క కట్టింది. ఇదంతా జరుగుతుండగానే ఈ నౌక తమదని ఓ కంపెనీ ముందుకు వచ్చింది. ఈ ఓడ విక్రయించాలని అమెరికా న్యాయవాదులు కోర్టును కోరడాన్ని తప్పు పట్టింది. అమెరికన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ సంస్థ కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఆ ఓడను జప్తు చేయాలని నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకోవాలని కోరింది. ఒకవేళ అమెరికా కోరితే ఆ ఓడ నిర్వహణ కోసం ఇప్పటివరకు వెచ్చించిన నగదు మొత్తం తిరిగి చెల్లిస్తామని ప్రకటించింది. అయితే దీనిపై కోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ కేసు ఎటువంటి మలుపులు తిరుగుతుందోనని అమెరికా ఎఫ్ బీ ఐ అధికారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఈ ఓడను అమ్మడం ద్వారా భారీగా వెనుక వేసుకోవాలని భావించింది. కానీ అడుగడుగునా చిక్కు ముళ్ళు ఎదురవుతున్న నేపథ్యంలో.. అనవసరంగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Bangladesh Army : మారిన బంగ్లాదేశ్ సైన్యం.. భారత్ కు డేంజర్ బెల్స్

Bangladesh Army : భారతదేశంతో సుమారు 4,096 కిలోమీటర్ల సరిహద్దు పంచుకునే బంగ్లాదేశ్‌ పుట్టుకకు మనమే కారణం. భారత సైన్యం చొరవతోనే ఆ దేశం పుట్టింది. ఆ కృతజ్ఞతతో ఇంతకాలం మనతో సత్సంబంధాలు...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు...

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...
CM Vijay Pregnant Woman Honor

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...
Weight Loss

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...
Oktelugu Epaper