Homeఅంతర్జాతీయంUS Iran War: ఇరాన్ కు దగ్గరగా అమెరికా విమానాలు: యుద్ధం తప్పదా?

US Iran War: ఇరాన్ కు దగ్గరగా అమెరికా విమానాలు: యుద్ధం తప్పదా?

US Iran War:  పశ్చిమసియాలో మొన్నటిదాకా ఇజ్రాయిల్, పాలస్తీనా దేశాల మధ్య దాడులు కొనసాగేవి. ఈ రెండు దేశాల మధ్యలోకి ఇరాక్, సిరియా కూడా వచ్చాయి. దీంతో దాడులు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడు అక్కడ పరిస్థితులు నెమ్మదిగా మారిపోతున్న వేళ.. పశ్చిమసియాలో మరోసారి యుద్ధ వాతావరణం ఏర్పడింది.

అమెరికాకు చెందిన యుద్ధ విమాన వాహన నౌక యుఎస్ఎస్ అబ్రహం లింకన్ (Abraham lincoln career) పశ్చిమాసియా కు చేరుకోవడం కలకలాన్ని కలిగిస్తోంది. దీంతో ఇరాన్ పై అమెరికా దాడులు చేసే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది.

అబ్రహం లింకన్ యుద్ధ విమాన వాహక నౌక మాత్రమే కాకుండా, యూఎస్ఎస్ ఫ్రాంక్ ఈ పీటర్సన్ జూనియర్, యూఎస్ఎస్ స్ప్రూయాన్స్ డెస్ట్రాయర్లు, యూఎస్ఎస్ మిషెల్ మార్ఫీ వంటి యుద్ధ విమాన వాహక నౌకలు ఇరాన్ సరిహద్దుల్లోకి వెళ్లినట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అమెరికాకు చెందిన సెంట్రల్ కమాండ్ ఈ యుద్ధ విమాన వాహక నౌకలు అక్కడికి వచ్చాయని తెలిపింది.

ఈ విమానాలు ఇరాన్ సరిహద్దుల్లోని అరేబియా సముద్రంలో ల్యాండ్ అవ్వలేదు. హిందూ సముద్రంలో అవి దిగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇది మాత్రమే కాకుండా యుద్ధ విమానాలను, కార్గో విమానాలను ఈ ప్రాంతానికి తీసుకొస్తున్నట్టు తెలుస్తోంది. కొంతకాలంగా ఇరాన్ దేశంలో అక్కడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఘర్షణలో జరుగుతున్న నేపథ్యంలో వేరాదిమంది ఇప్పటికే చనిపోయారు. అక్కడి ఆందోళనలకు ట్రంప్ బాసటగా నిలిచారు. ఒకవేళ అక్కడి ప్రభుత్వం ఆందోళనకారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటే మాత్రం తాము రంగంలోకి దిగుతామని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యల తర్వాత అమెరికా సైన్యం భారీగా ఇరాన్ దిశగా వెళ్లడం రకరకాల సంకేతాలు ఇస్తుంది. ట్రంప్ ఆదేశాలు ఇచ్చిన మరుక్షణంలోనే ఇరాన్ మీద అమెరికా దాడి చేసే అవకాశాలు తెలుస్తోంది. మరోవైపు అమెరికాతో ఇరాన్ చర్చలు జరిపే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. చర్చలు ముందుకు సాగితే పరిణామాలు వేగంగా మారిపోతాయని అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular