Homeఅంతర్జాతీయంRussia Oil Attack: రష్యాపై భీకరదాడి.. మరో ఆయిల్ సంక్షోభం తప్పదా?

Russia Oil Attack: రష్యాపై భీకరదాడి.. మరో ఆయిల్ సంక్షోభం తప్పదా?

Russia Oil Attack: ప్రస్తుతం ప్రపంచం దృష్టి మొత్తం ఇరాన్‌–అమెరికా శాంతి చర్చలపై ఉంది. ఒకవైపు డొనాల్డ్‌ ట్రంప్‌ తన సొంత సోషల్‌ మీడియాలో చేస్తున్న పోస్టులు.. ఇంకోవైపు శాంతి చర్చలపై ఇరాన్‌ స్పందనను అంతా గమనిస్తున్నారు. ఇంకోవైపు హర్మూజ్‌ ఎప్పుడు తెరుస్తారన్న ఉత్కంఠ కొనసాగుతోంది. ఇలాంటి తరుణంలో ఉక్రెయిన్‌ రష్యాను టార్గెట్‌ చేసింది. ఆయిల్‌ కేంద్రాలే లక్ష్యంగా జరిపిన దాడిలో రష్యాలోని కీలక ఆయిల్‌ కేంధ్రం పూర్తిగా ధ్వంసమైంది. 1,500 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెర్మ్‌ ప్రాంత ఇంధన కేంద్రం లక్ష్యంగా చేసుకుని దాడిచేసింది. ఈ చర్య రష్యా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నంగా మారింది.

దాడి జరిగిందిలా..
పెర్మ్‌ ప్రాంతంలోని ఆయిల్‌ పంపింగ్‌ స్టేషన్‌పై ఉక్రెయిన్‌ డ్రోన్లు విజయవంతమైన దాడి చేశాయి. భారీ అగ్నిప్రమాదానికి గురైన ఈ కేంద్రం రష్యా చమురు పంపిణీ వ్యవస్థలో కీలక భాగం. మరోవైపు ఉక్రెయిన్‌ ప్రధాని జెలెన్‌స్కీ ‘చరిత్రలో అత్యంత సుదీర్ఘ దూర దాడి‘ అని ప్రకటించి, నల్ల పొగల వీడియో విడుదల చేశారు.

ఉక్రెయిన్‌ వ్యూహం
ఇటీవల రష్యా రిఫైనరీలు, నిల్వ కేంద్రాలు, పోర్టులను లక్ష్యంగా చేసుకునే ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు పెరిగాయి. గత వారంలో ర్యాజన్, ర్యాజాన్‌ ప్రాంతాల్లోని రిఫైనరీలపై కూడా దాడులు జరిగాయి. ఈ దాడులు రష్యా ఆర్థిక ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేస్తూ, యుద్ధాన్ని లాంగ్‌ టర్మ్‌గా టాన్‌ చేయాలనే వ్యూహంగా కనిపిస్తోంది.

దాడిని ధ్రువీకరించిన రష్యా..
ఉక్రెయిన్‌ దాడిని రష్యా ధ్రువీకరించింది. ఈశాన్య ఖర్కివ్‌లో 8 మంది గాయపడ్డారని తెలిపింది. సమీపంలోని 60 ఏళ్ల వృద్ధురాలు మరణించినట్లు పేర్కొంది. ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులను తమ రక్షణ వ్యవస్థలు 95 శాతం అడ్డుకుందని పేర్కొన్నప్పటికీ, పెర్మ్‌ దాడిపై అధికారిక స్పందన లేదు. రష్యా ఆర్మీ ఈ దాడి ‘ఉగ్రవాద చర్య‘గా ప్రకటించింది.

చమురు సంక్షోభం మరింత తీత్రం..
రష్యా చమురు సరఫరాలో 15 శాతం ఉక్రెయిన్‌ దాడితో దెబ్బతినడంతో ప్రపంచ చమురు ధరలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే హర్మూజ్‌ మూసివేత, గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడుల నేపథ్యంలో చమురు ధరలు పెరిగాయి. రవాణా గణనీయంగా తగ్గింది. దీంతో యూరప్‌ దేశాలతోపాటు భారత్, చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, జపాన్‌ వంటి దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. ఒపెక్‌ + నుంచి ఇరాన్, యూఏఈ వైదొలగడం, ఇదే సమయంలో రష్యా ఆయిల్‌ కేంద్రాలపై దాడి జరగడం గ్లోబల్‌ ఎనర్జీ మార్కెట్‌పై ఒత్తిడి పెంచింది.

ఆర్థిక పరిణామాలు
2026లో రష్యా చమురు ఎగుమతులు 20 శాతం తగ్గే అవకాశం ఉంది. ఈ దాడి రష్యా ఆర్థిక వ్యవస్థకు 2–3 బిలియన్‌ డాలర్ల నష్టం కలిగించవచ్చు. యూరప్, భారత్‌కు ఇంధన ధరల పెరిగే అవకాశం ఉంది. దీంతో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది.

ఉక్రెయిన్‌ డ్రోన్‌ సాంకేతికత మరింత అభివృద్ధి చెందుతుంటే, రష్యా ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది. ఈ దాడి యుద్ధాన్ని సైనికంగా కాకుండా ఆర్థిక యుద్ధంగా మలిచేస్తుంది. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీకార చర్యలు తీవ్రంగా ఉంటాయని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper