Homeఅంతర్జాతీయంReliance investment in US: అమెరికాలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి.. దాని వెనుక రహస్యం ఇదే!

Reliance investment in US: అమెరికాలో రిలయన్స్‌ భారీ పెట్టుబడి.. దాని వెనుక రహస్యం ఇదే!

Reliance investment in US: ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత దేశం రష్యా నుంచి చమురు దిగుమతి ఆపేయాలని కోరాడు. అయితే భారత్‌ తమ దేశ అవసరాల కోసం ఆయిల్‌ దిగుమతి కొనసాగించింది. దీంతో భారత్‌పై 50 శాతం అదనపు సుంకాలు విధించాడు. ఇటీవలే సుంకాలు ఎత్తేశాడు. తాజాగా అదే ట్రంప్‌ ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఇండియా రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలుకు అంగీకరిస్తున్నాం.. అనుమతి ఇస్తున్నాం అని […]

Reliance investment in US: ఉక్రెయిన్‌ – రష్యా యుద్ధం ఆపడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ భారత దేశం రష్యా నుంచి చమురు దిగుమతి ఆపేయాలని కోరాడు. అయితే భారత్‌ తమ దేశ అవసరాల కోసం ఆయిల్‌ దిగుమతి కొనసాగించింది. దీంతో భారత్‌పై 50 శాతం అదనపు సుంకాలు విధించాడు. ఇటీవలే సుంకాలు ఎత్తేశాడు. తాజాగా అదే ట్రంప్‌ ఇరాన్‌తో యుద్ధం మొదలైన తర్వాత ఇండియా రష్యా నుంచి ఆయిల్‌ కొనుగోలుకు అంగీకరిస్తున్నాం.. అనుమతి ఇస్తున్నాం అని ప్రకటించాడు. దీనిపై విమర్శలు వచ్చాయి. మనకు అనుమతి ఇవ్వడానికి అమెరికా ఎవరూ అన్న ప్రశ్న తలెత్తింది. అసలు భారత్‌ను నిర్దేశించడానికి అమెరికా ఎవరు అని విపక్షాలు ప్రశ్నించాయి. మోదీ ట్రంప్‌కు దాసోహం అయ్యాడని కూడా విమర్శించాయి. కానీ తాజాగా అమెరికా భారత్‌ ఆయిల్‌ను రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం కారణంగానే ఇంధన సరఫరాలో గందర గోళం లేదని అమెరికా అంబాసిడర్‌ తెలిపాడు. ఇంతలో మార్పు ఎందుకు వచ్చింది.

అమెరికా స్వరంలో మార్పు..
అమెరికా అంబాసిడర్‌ ప్రకటనకు ముందు ట్రంప్‌ తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో చేసిన పోస్టు కీలకంగా మారింది. ఈ సుదీర్ఘ పోస్టులో భారత్‌కు చెందిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టెక్సాస్‌లో 300 బిలియన్‌ డాలర్ల (సుమారు 25 లక్షల కోట్ల రూపాయలు) పెట్టుబడితో ’అమెరికా ఫస్ట్‌ రిఫైనింగ్‌’ పేరుతో కొత్త రిఫైనరీ స్థాపిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో అమెరికాలో వేల మందికి ఉద్యోగాలు వస్తాయని తెలిపాడు. థాంక్యు అంటూ రిలయన్స్‌కు చెప్పాడు. గుజరాత్‌ జామ్‌నగర్‌లోని ప్రపంచంలోని అతిపెద్ద రిఫైనరీ తర్వాత, 50 ఏళ్ల తర్వాత అమెరికాలో మరొకటి నిర్మిస్తున్నారు. ఫలితంగా, ట్రంప్‌ రష్యా చమురు విషయంలో రాజీ అయ్యాడు.

ఇంత పెట్టుబడి ఎలా..
50 ఏళ్ల తర్వాత అమెరికాలో కొత్త రిఫైనరీని నెలకొల్పబోతున్నారు. అమెరికా ఫస్ట్‌ రిఫైనింగ్‌ అనే పేరుతో ఈ కంపెనీని స్థాపిస్తున్నారు. రిలయన్స్‌ పెట్టుబడి పెడుతోంది. ఇంత భారీ పెట్టుబడి రిలయన్స్‌ ఎలా తెస్తుంది అంటే.. క్రూడ్‌ ఆయిల్‌ను ఎగుమతి చేయడం ద్వారా సమకూర్చుకుంటారు. రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆయిల్‌లో మెజారిటీ రిలయన్స్‌ చేసుకుంటోంది. దానిని రిఫైన్‌ చేసి యూరప్‌ దేశాలకు విక్రయిస్తోంది. దీంతో ఏడాదిలోనే 7 వేల కోట్ల రూపాయల లాభాలు గడించింది. అయితే ట్రంప్‌ ఆంక్షలతో రిలయన్స్‌ ఆయిల్‌ దిగుమతి నిలిపివేసింది. దీంతో ట్రంప్‌ను మచ్చిక చేసుకోవడానికి ఇప్పుడు రిలయన్స్‌ అమెరికాలో భారీగా పెట్టుబడి పెడుతోంది.

రష్యా ఆయిల్‌ కోసం..
ఇక రిలయన్స్‌ ఇంత భారీ పెట్టుబడి పెట్టడానికి కారణం రష్యా ఆయిలే. ఇటీవల రష్యా ఆయిల్‌ దిగుతమతి ఆపాలని అమెరికా భారత్‌ను ఆదేశించింది. 50 శాతం అదనపు టారిఫ్‌లు విధించింది. అయితే ఈ ప్రభావం రిలయన్స్‌పై భారీగా పడింది. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న ఆయిల్‌లో మెజారిటీ వాటా రిలయన్స్‌దే. ఆయిల్‌ రిఫైనరీ ద్వారా భారీగా లాభాలు గడించింది. ఆంక్షలతో ఇబ్బంది పడుతోంది. దీంతో అమెరికాలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఆంక్షలు లేకుండా రష్యా ఆయిల్‌ దిగుమతి చేసుకోవచ్చని రిలయన్స భావించింది.

రిలయన్స్‌ రష్యా నుంచి చమురు దిగుమతి చేసి, రిఫైన్‌ చేసి యూరప్‌కు ఎగుమతి చేయడం ద్వారా గణనీయ లాభాలు సంపాదిస్తోంది. ఇప్పుడు అమెరికాలో పెట్టుబడి పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఈ మార్పు ఆర్థిక ప్రయోజనాలు రాజకీయ నిర్ణయాలపై ముందుంచిన ఉదాహరణ.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper