Homeఅంతర్జాతీయంPakistan conspiracy against America: అమెరికాను దొంగదెబ్బ తీసిన పాకిస్తాన్.. వెలుగులోకి పెద్ద కుట్ర

Pakistan conspiracy against America: అమెరికాను దొంగదెబ్బ తీసిన పాకిస్తాన్.. వెలుగులోకి పెద్ద కుట్ర

Pakistan conspiracy against America: మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని ప్రపంచ జనం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సైతం యుద్ధం నష్టంతో తీవ్రతను తగ్గించాలని ఆలోచిస్తోంది. కానీ ఇదే సమయంలో పాకిస్తాన్ దేశం మరోసారి అమెరికాకు ఆగ్రహం తెప్పించే పనిచేసింది. ఇరాన్ కు చెందిన కొన్ని సైనిక విమానాలు పాకిస్తాన్ భూభాగంలో రహస్యంగా నిలిపివేశారనే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇరాన్ దేశంపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన సైనిక […]

Pakistan conspiracy against America: మధ్య ఆసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని ప్రపంచ జనం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా సైతం యుద్ధం నష్టంతో తీవ్రతను తగ్గించాలని ఆలోచిస్తోంది. కానీ ఇదే సమయంలో పాకిస్తాన్ దేశం మరోసారి అమెరికాకు ఆగ్రహం తెప్పించే పనిచేసింది. ఇరాన్ కు చెందిన కొన్ని సైనిక విమానాలు పాకిస్తాన్ భూభాగంలో రహస్యంగా నిలిపివేశారనే సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఇరాన్ దేశంపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఆ దేశానికి చెందిన సైనిక విమానాలను పాకిస్తాన్ తమ ఎయిర్ ఫీల్డ్ లో ఉంచేందుకు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై అమెరికా మీడియా కోడై కూస్తోంది. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితె..

అమెరికా మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. పాకిస్తాన్ లోని రావల్పిండి ప్రాంతంలో ఇరాన్ దేశానికి చెందిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో లాక్ హీడ్ సి -130, హెర్క్యులస్ రవాణా విమానం, ఆర్ సీ -130 తో పాటు మరికొన్ని విమానాలు ఇక్కడ నిలిపివేసినట్లు తెలుస్తోంది. ఇరాన్ పై ఓ వైపు ఇజ్రాయిల్, మరోవైపు అమెరికా విరుచుకుపడుతుండడంతో ఇరాన్ తన విమానాలకు సురక్షిత ప్రాంతం పాకిస్తాన్ గా భావిస్తోంది. యుద్ధ విమానాలు మాత్రమే కాకుండా ప్యాసింజర్ విమానాలను కూడా ఇక్కడ రహస్యంగా ఉంచినట్లు తెలుస్తోంది.

అయితే ఈ వార్తలపై పాకిస్తాన్ దేశం మండిపడుతోంది. ఈ దేశానికి చెందిన ఓ అధికారి ఇవి తప్పుడు వార్తలు అని అన్నారు. రావల్పిండి లోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా ఉంటారని అన్నారు. అయితే ఇరాన్ ఘర్షణకు ముందే ఇక్కడ ఒక ఇరాన్ పౌర విమానం నిలిచిందని పేర్కొన్నారు. ఆ తరువాత గగనతలం మూసివేయడంతో ఆ విమానం అప్పటి నుంచి ఇక్కడే ఉండిపోయిందని తెలిపారు.

మరోవైపు ఇరాన్ కు చెందిన పౌర విమానం అప్ఘనిస్తాన్ రాజధాని కాబుల్ లో ఉందని పాకిస్తాన్ అధికారి తెలపగా.. అప్ఘనిస్తాన్ దేశానికి చెందిన తాలిబాన్ ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ఖండించారు. విమానాలను తమ వద్ద నిలిపివేయాల్సిన అవసరం లేదన్నారు. ఇరాన్, అమెరికా మధ్య ఓ వైపు పాకిస్తాన్ రాయభారిగా వ్యవహరిస్తూ.. తమ దేశంపై తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోందని తాలిబాన్ ప్రతినిధి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఏదీ ఏమైనా ఇరాన్ కు సంబంధించిన విమానాలు ఇక్కడ ఉండడంపై ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి చర్చ మొదలైంది. అందులోనూ తమ శత్రు దేశానికి సంబంధించిన విమానాలు పాకిస్తాన్ లో ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఓవైపు అమెరికాతో స్నేహం హస్తం ఇస్తూనే.. మరోవైపు దొంగ దెబ్బ తీస్తోందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper