Homeఅంతర్జాతీయంShehbaz Sharif Qatar Visit: ముష్టి అడుక్కునే పాకిస్తాన్ కు రఫెల్ విమానాలతో రక్షణ.. మీకో...

Shehbaz Sharif Qatar Visit: ముష్టి అడుక్కునే పాకిస్తాన్ కు రఫెల్ విమానాలతో రక్షణ.. మీకో దండం రా అయ్యా

Shehbaz Sharif Qatar Visit: పెట్రోల్ లేదు. డీజిల్ అంతకంటే లేదు. దేశంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అందువల్లే లాక్ డౌన్.. చివరికి ఇటీవల అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరిగినప్పుడు హోటల్ బిల్లు కట్టేందుకు కూడా డబ్బులు లేవు. ఇంతటి దిక్కుమాలిన దేశానికి హై ఎండ్ సెక్యూరిటీ.. పైగా రఫెల్ యుద్ధ విమానాలతో రక్షణ కల్పించారు. ఇంతకంటే దరిద్రం ఉంటుందా.. ఇంతకంటే దారుణం ఉంటుందా.. పై ఉపోద్ఘాతం మొత్తం పాకిస్తాన్ దేశానికి చెందింది. ఆ […]

Shehbaz Sharif Qatar Visit: పెట్రోల్ లేదు. డీజిల్ అంతకంటే లేదు. దేశంలో పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. అందువల్లే లాక్ డౌన్.. చివరికి ఇటీవల అమెరికా, ఇరాన్ దేశాల మధ్య చర్చలు జరిగినప్పుడు హోటల్ బిల్లు కట్టేందుకు కూడా డబ్బులు లేవు. ఇంతటి దిక్కుమాలిన దేశానికి హై ఎండ్ సెక్యూరిటీ.. పైగా రఫెల్ యుద్ధ విమానాలతో రక్షణ కల్పించారు. ఇంతకంటే దరిద్రం ఉంటుందా.. ఇంతకంటే దారుణం ఉంటుందా.. పై ఉపోద్ఘాతం మొత్తం పాకిస్తాన్ దేశానికి చెందింది. ఆ దిక్కుమాలిన దేశానికి ఖతార్ రక్షణ కల్పించింది.

అప్పులు ఎక్కువైపోవడం.. అప్పులు ఇచ్చిన దేశాలు డబ్బుల కోసం డిమాండ్ చేయడంతో.. పాకిస్తాన్ పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఇటీవల యూఏఈ తాను ఇచ్చిన అప్పు తిరిగి చెల్లించాలని పాకిస్తాన్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఏకంగా పాకిస్తాన్ చెల్లించాల్సిన డబ్బులు 2.79 లక్షల కోట్లు. అసలే పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే ఆంప శయ్య మీద ఉంది. అటువంటి పాకిస్తాన్ అప్పు చెల్లించడం అంటే మామూలు విషయం కాదు. పైగా యూఏఈ విపరీతంగా ఒత్తిడి తీసుకొస్తున్న నేపథ్యంలో.. పాకిస్తాన్ దేశానికి ఏం చేయాలో అర్థం కాలేదు. దీంతో అన్ని దేశాల కాళ్ళు మొక్కడ మొదలుపెట్టింది. పాకిస్తాన్ పరిస్థితిని అర్థం చేసుకున్న ఖతార్ డబ్బులు ఇస్తామని చెప్పింది.

ఇటీవల పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ఖతార్ లో పర్యటించారు.. అక్కడ ఆయన ప్రయాణించే విమానానికి సెక్యూరిటీగా ఖతార్ ప్రభుత్వం రఫెల్ ఫైటర్ జెట్ లు పంపించింది. దీనిపై షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమ స్థాయికి లభించిన గౌరవమని చెప్పుకున్నారు.

వాస్తవానికి రఫెల్ లాంటి అత్యంత ఆధునికమైన యుద్ధ విమానాలను ఇలాంటి పనికి అసలు వాడరు. పైగా పనికిమాలిన పాకిస్తాన్ ప్రధానమంత్రి కి ఇటువంటి యుద్ధ విమానాలను సెక్యూరిటీ కోసం ఉపయోగించడం నిజంగా అత్యంత చండాలమైన విషయం. వాస్తవానికి ఈ విమానాల గురించి ఖతార్ ప్రభుత్వానికి తెలియదా.. కావాలని ఇలా చేసిందా అనే విషయాలపై క్లారిటీ రావాల్సి ఉంది. రఫెల్ యుద్ధ విమానాలను భారతదేశంతో పాటు ఖతార్ కూడా ఉపయోగిస్తోంది. ప్రస్తుతం ఖతార్ వద్ద 36 రఫెల్ జెట్స్ ఉన్నాయి. 2015లో ఖతార్ దేశం 24 రఫెల్ జెట్స్ ఆర్డర్ చేసింది. ఆ తర్వాత మరో పనులు కొనుగోలు చేసింది. ఇవి ఎఫ్ 3 ఆర్ అడ్వాన్స్డ్ వేరియంట్ సౌలభ్యాన్ని కలిగి ఉన్నాయి. మోడ్రన్ రాడార్లు, వెపన్ వ్యవస్థ ఇందులో అత్యంత పటిష్టంగా ఉంటుంది.

ఇక ఇటీవల పాకిస్తాన్ పైలెట్లకు ఖతార్ ఎయిర్ ఫోర్స్ విభాగం వారు రఫెల్ యుద్ధ విమానాలను నడిపే విధానంపై ట్రైనింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇరుదేశాల మధ్య రక్షణ పరంగా సంప్రదింపులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. అప్పు కోసమే పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇక్కడ దాకా వచ్చారు. యూఏఈ కంటే ముందు సౌదీ అరేబియాలో కూడా ఆయన పర్యటించారు. పాకిస్తాన్ దేశానికి రెండు బిలియన్ డాలర్లు ఇవ్వడానికి సౌదీ ప్రభుత్వం ఒప్పుకుంది. అయితే ఖతార్ ప్రభుత్వం ఏ స్థాయిలో అప్పు ఇస్తుందనే విషయంపై ఇంతవరకు అధికారికంగా ప్రకటన రాలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper