Homeఅంతర్జాతీయంLahore: లాహోర్ నగరం మారిపోతుంది.. ఇండియా లో కలిసిపోవడం గ్యారంటీ

Lahore: లాహోర్ నగరం మారిపోతుంది.. ఇండియా లో కలిసిపోవడం గ్యారంటీ

Lahore: పాకిస్తాన్.. ఈ దేశం పేరు చెబితే ఇస్లాం మతం గుర్తుకొస్తుంది. గతంలో పాకిస్తాన్ భారత దేశంలో అంతర్భాగమే. అప్పట్లో దేశ విభజన జరగడంతో పాకిస్తాన్ ఏర్పడింది.. పాకిస్తాన్ దేశంలో ఇస్లాం మతం ఉంటుంది. ఇక్కడ మెజారిటీ ముస్లింలు మాత్రమే ఉంటారు. హిందువులు ఇక్కడ మైనారిటీలుగా ఉంటారు. పాకిస్తాన్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు హిందువులు అక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ముస్లింల చేతిలో దారుణాలకు గురవుతూనే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ […]

Lahore: పాకిస్తాన్.. ఈ దేశం పేరు చెబితే ఇస్లాం మతం గుర్తుకొస్తుంది. గతంలో పాకిస్తాన్ భారత దేశంలో అంతర్భాగమే. అప్పట్లో దేశ విభజన జరగడంతో పాకిస్తాన్ ఏర్పడింది.. పాకిస్తాన్ దేశంలో ఇస్లాం మతం ఉంటుంది. ఇక్కడ మెజారిటీ ముస్లింలు మాత్రమే ఉంటారు. హిందువులు ఇక్కడ మైనారిటీలుగా ఉంటారు. పాకిస్తాన్ ఏర్పాటు నుంచి ఇప్పటివరకు హిందువులు అక్కడ ఇబ్బంది పడుతూనే ఉన్నారు. ముస్లింల చేతిలో దారుణాలకు గురవుతూనే ఉన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆ సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

భారత్ నుంచి విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ఏమాత్రం అభివృద్ధి సాధించలేదు. పైగా ఉగ్రవాదులతో అక్కడి పరిపాలకులు అంట కాగుతూ ఉంటారు. అందువల్ల అక్కడ నిత్యం దాడులు.. బాంబు పేలుళ్లు.. కాల్పులు చోటుచేసుకుంటాయి. మారణ హోమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాకిస్తాన్ లో ఈ పరిస్థితి మారే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ప్రభుత్వాన్ని ఉగ్రవాదులే శాసిస్తూ ఉంటారు.

పాకిస్తాన్లో ప్రధాన నగరాలలో ఒకటి లాహోర్. ఈ నగరం ఇస్లామీకరణ గుర్తింపును క్రమంగా కోల్పోతుంది. ఎందుకంటే అక్కడ అనేక ప్రదేశాలకు హిందువులు, జైనులు, సిక్కులు వంటి వారి పేర్లను పునరుద్ధరిస్తున్నారు. లాహోర్ నగరంలో సైన్ బోర్డులపై పాత హిందూ, సిక్కులు, జైనుల పేర్లు మళ్లీ కనిపిస్తున్నాయి.

లాహోర్ నగరంలో ఇస్లాంపురం సైన్ బోర్డు ఇప్పుడు కృష్ణ నగర్ గా మారింది. బాబ్రీ మసీదు చౌక్ తిరిగి జైన్ మందిర్ గా రూపాంతరం చెందింది. రెహమాన్ గలి తిరిగి రామ్ గల్లి, ఫాతిమా జిన్నా రోడ్డు కాస్త క్వీన్స్ రోడ్డు గా మారిపోయింది. విభజన జరిగిన దాదాపు 80 సంవత్సరాల తర్వాత లాహోర్ నగరంలో ఉన్న ప్రాంతాలు పూర్వైభావాన్ని పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇలా మార్చడానికి బలమైన కారణం ఉంది. ” మేము తీవ్రవాద ప్రతిబింబాన్ని వదిలించుకోవాలని అనుకుంటున్నాం. సమ్మిళిత, సహనశీల, బహుళ సాంస్కృతిక దేశంగా పరిణామం చెందాలని భావిస్తున్నాం. కొత్తగా ఏర్పడిన తీరును ప్రపంచానికి చూపించి.. తద్వారా దౌత్య, ఆర్థిక సాయాన్ని పొందాలని చూస్తున్నామని” పాకిస్తాన్ పాలకులు చెబుతున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దాయాది దేశం చాలాకాలంగా టెర్రరిజానికి నిధులు సమకూరుస్తోంది అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అందువల్ల ఆ దేశానికి బిలియన్ డాలర్ల నష్టం ఎదురవుతోంది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆంక్షలు తిరిగి విధించకుండా ఉండేందుకు పాకిస్థాన్ కం క్రమంగా ఉగ్రవాదం నుంచి దూరంగా జరగాలని భావిస్తుందని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పాకిస్తాన్ దేశం తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. అంతేకాదు మనుగడ కోసం ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీ మీద ఆధారపడి ఉంది.. ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇవ్వాలంటే.. కచ్చితంగా ఆ దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగువ్వాలి. రాజకీయంగా స్థిరత్వాన్ని కొనసాగించాలి. సామాజిక వాతావరణాన్ని ప్రతిబింబించాలి. ఆ దేశంలో అసాంఘిక, ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కార్యకలాపాలు ఉండకూడదు. విదేశీ పెట్టుబడిదారులు స్వేచ్ఛగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ఐఎంఎఫ్ బెయిల్ అవుట్ ప్యాకేజీ ఇస్తుంది.

మరోవైపు పాకిస్తాన్లో ఈ పేర్లు మార్చే కార్యక్రమాన్ని 2025లో మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ మొదలుపెట్టారు. ఈ ప్రచారం పాకిస్తాన్లోని పంజాబ్ ప్రభుత్వం చేపట్టిన బృహత్తర లాహోర్ హెరిటేజ్ ఏరియా రివైల్ లో ఒక భాగం. ఈ ప్రాజెక్టు కోసం 50 బిలియన్ పాకిస్తాన్ రూపాయలను ఖర్చు పెడుతున్నారు. తద్వారా పాకిస్తాన్ దేశ సాంస్కృతిక రాజధాని లాహోర్ కు పూర్వపు వారసత్వాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని.. వారసత్వ పర్యాటకం మెరుగుపడుతుందని మరియం నవాజ్ చెబుతున్నారు. కాగా లాహోర్ నగరం ఇలా మారిపోతున్న నేపథ్యంలో త్వరలో ఇండియాలో కలిసిపోతుందని భారతీయులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper