Homeఅంతర్జాతీయంPakistan Occupied Kashmir Protests: పాకిస్తాన్ ఆర్మీ ప్యాంట్లు విప్పుకుని తిరుగుతోంది..ఇది మామూలు దెబ్బ కాదు

Pakistan Occupied Kashmir Protests: పాకిస్తాన్ ఆర్మీ ప్యాంట్లు విప్పుకుని తిరుగుతోంది..ఇది మామూలు దెబ్బ కాదు

Pakistan Occupied Kashmir Protests: పాకిస్థాన్ ఆర్మీ ప్యాంట్లు విప్పుకుని తిరుగుతోంది. మీరు చదువుతున్నది నిజమే. పాకిస్తాన్ ఆక్రమిత జమ్ము కాశ్మీర్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మీర్ పూర్, ముజఫర్బాద్, కోట్లి, పూంచ్ ప్రాంతాలలో తిరుగుబాటు మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది. దాదాపు ఇప్పటికే 200 మందికి పైగా చనిపోయారు. అయితే ఈ వార్తలు బయటికి రాకుండా ఉండడానికి పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తుంది. […]

Pakistan Occupied Kashmir Protests: పాకిస్థాన్ ఆర్మీ ప్యాంట్లు విప్పుకుని తిరుగుతోంది. మీరు చదువుతున్నది నిజమే. పాకిస్తాన్ ఆక్రమిత జమ్ము కాశ్మీర్లో ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆక్రమించిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మీర్ పూర్, ముజఫర్బాద్, కోట్లి, పూంచ్ ప్రాంతాలలో తిరుగుబాటు మొదలైంది. పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ హింసాత్మక ఘటనలకు పాల్పడుతోంది. దాదాపు ఇప్పటికే 200 మందికి పైగా చనిపోయారు. అయితే ఈ వార్తలు బయటికి రాకుండా ఉండడానికి పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తుంది. ఇంటర్నెట్ సర్వీస్ లు ఆపేసింది. వివిధ మార్గాల ద్వారా సమాచారం రాకుండా ఉండేందుకు తొక్కేస్తోంది. రావల్ కోట్ వేదికగా జరుగుతున్న ఈ ఉద్యమంలో.. వేలాదిమంది ప్రజలు పాల్గొంటున్నారు.

పాకిస్థాన్ ఆర్మీ చేస్తున్న దాడులను తట్టుకోలేక అక్కడి ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ లో సైనికులను పట్టుకొని.. వారి మీద దాడులు చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీ తొడుకున్న ప్యాంట్లను తొలగించి ప్రదర్శన చేస్తున్నారు. జూలై 9 నుంచి ఇక్కడ భారీ ఎత్తున ప్రదర్శన చేసేందుకు పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.. అంతేకాదు, పాకిస్తాన్ ఆర్మీ తీరును నిరసిస్తూ.. ప్యాత్లూన్ పరేడ్ నిర్వహిస్తున్నారు. పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో విలువైన ఖనిజాలు.. వనరులను వెలికి తీయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. వాటిని సింధు ప్రావిన్స్.. పంజాబ్.. ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు.

జూలై 27న పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ 12 సీట్లను పాకిస్తాన్ ఆర్మీ ఎప్పటినుంచో తన చేతిలో పెట్టుకుంది. ఈ 12 స్థానాలలో పాకిస్తాన్ దేశానికి చెందిన వారిని నియమిస్తోంది పాకిస్థాన్ ఆర్మీ. దీనివల్ల అక్కడి పార్లమెంటు నామమాత్రంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమంత్రి పాకిస్తాన్ మంత్రి వచ్చినా లేచి నిలబడాల్సిన పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.

జూలై 27న జరిగే ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని.. జమ్ము కాశ్మీర్లో భారత్ నిర్వహిస్తున్నట్టుగా జరపాలని ఇక్కడి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. తమ ప్రాంతంలో విలువైన వనరులు ఉన్న నేపథ్యంలో.. అభివృద్ధికి కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అలా చేయని పక్షంలో పాకిస్తాన్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో తిరుగుబాటు చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ కూడా ఆర్మీ ని రంగంలోకి దించుతోంది.. అవసరమైతే హింసాత్మక విధానంలో ప్రజల నిరసనను తొక్కి వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. మరి దీనిపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper