Homeఅంతర్జాతీయంAfghanistan Airstrikes On Pakistan Military Bases: పాకిస్తాన్ పై అప్ఘనిస్తాన్ భీకర దాడి.. ఇస్లామాబాద్...

Afghanistan Airstrikes On Pakistan Military Bases: పాకిస్తాన్ పై అప్ఘనిస్తాన్ భీకర దాడి.. ఇస్లామాబాద్ షేక్.. షాక్ లో పాక్

Afghanistan Airstrikes On Pakistan Military Bases: పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ (టీటీపీ) శిబిరాలపై వైమానిక దాడులు చేపట్టడంతో ఆఫ్గానిస్తాన్‌–పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతంలో భయంకర ఘర్షణ మొదలైంది. పాకిస్తాన్‌ దాడిలో సామాన్యులు మరణించారు. దీంతో తాలిబాన్‌ ప్రభుత్వం, ఆర్మీ ప్రతిదాడులు మొదలు పెట్టింది. పాక్‌ మిలటరీ పోస్టులను స్వాధీనం చేసుకుంది. Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్ ఆఫ్గాన్‌ డ్రోన్‌ దాడులు.. తాజా ట్విస్ట్‌తో ఆఫ్గాన్‌ […]

Afghanistan Airstrikes On Pakistan Military Bases: పాకిస్తాన్‌ తెహ్రీక్‌–ఎ–తాలిబాన్‌ (టీటీపీ) శిబిరాలపై వైమానిక దాడులు చేపట్టడంతో ఆఫ్గానిస్తాన్‌–పాకిస్తాన్‌ సరిహద్దు ప్రాంతంలో భయంకర ఘర్షణ మొదలైంది. పాకిస్తాన్‌ దాడిలో సామాన్యులు మరణించారు. దీంతో తాలిబాన్‌ ప్రభుత్వం, ఆర్మీ ప్రతిదాడులు మొదలు పెట్టింది. పాక్‌ మిలటరీ పోస్టులను స్వాధీనం చేసుకుంది.

Also Read: అల్లు అరవింద్ ని ఆ రోల్ కోసం బ్రతిమిలాడాను… కానీ ఇవ్వలేదు – హీరో రాజశేఖర్

ఆఫ్గాన్‌ డ్రోన్‌ దాడులు..
తాజా ట్విస్ట్‌తో ఆఫ్గాన్‌ వైపు నుంచి పాకిస్తాన్‌పై డ్రోన్‌ దాడులు జరిగాయి. ఇస్లామాబాద్‌ సమీపంలోని ఫైజాబాద్‌ మిలటరీ ఏరియా, నౌషేరా కంటోన్మెంట్, జమురత్‌ కాలనీ, అబుతాబాద్‌ సైనిక స్థావరాలు, థోర్కం ప్రాంతం లక్ష్యాలు. తాలిబాన్‌ వార్తా సంస్థ టోలో మీడియా వీడియోలు విడుదల చేసి ధ్రువీకరించింది. ఇస్లామాబాద్‌ దగ్గర వరకు చేరిన డ్రోన్‌లు పాక్‌ రక్షణ వ్యవస్థలకు షాక్‌ ఇచ్చాయి. పాక్‌ ఎఫ్‌–16లలో ఒకటి కూలిపోయినట్లు సమాచారం.

తమదే పైచేయి అంటున్న పాక్‌..
పాక్‌ సైన్యం ఆఫ్గాన్‌లో 22 స్థావరాలపై దాడి చేసి 18 మంది బందీలు, 115 ట్యాంకులు స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. కానీ ఆఫ్గాన్‌ డ్రోన్‌ సామర్థ్యం ఈ క్లెయిమ్స్‌ను ప్రశ్నార్థకం చేస్తోంది. ఎప్పుడు శిక్షణ పొందాఉ.. టెక్నాలజీ ఎక్కడి నుంచి వచ్చింది అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పాక్‌ ఆఫ్గాన్‌ సైనిక శక్తిని తక్కువ అంచనా వేసింది. డ్రోన్‌ దాడులు టీటీపీ సహాయంతో జరిగి ఉంటే, ముంపు దాడులు పెరుగుతాయి. తాలిబాన్‌ ఆత్మాహుతి దళాలు పాక్‌లోకి చొరబడి మిలటరీని టార్గెట్‌ చేసే ప్రమాదం ఉంది. దీంతో సరిహద్దు రక్షణ బలహీనపడుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper