Homeఅంతర్జాతీయంPakistan Afghanistan Conflict 2026: పాకిస్తాన్‌ బుద్ధి కుక్కతోక చందమే.. తాజాగా ఆఫ్గాన్‌ యూనివర్సిటీపై దాడి!

Pakistan Afghanistan Conflict 2026: పాకిస్తాన్‌ బుద్ధి కుక్కతోక చందమే.. తాజాగా ఆఫ్గాన్‌ యూనివర్సిటీపై దాడి!

Pakistan Afghanistan Conflict 2026: పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఏ దేశమూ నమ్మదు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో.. తర్వాత నిర్ణయం ఎలా మార్చుకుంటుందో తెలియదు. మరోవైపు ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న దేశం. అందుకే తాజాగా ఇరాన్‌–అమెరికా శాంతి చర్చల సందర్భంలోనూ ఇరాన్‌ పాకిస్తాన్‌ను పూర్తిస్థాయిలో నమ్మడం లేదు. అందుకే చర్చలు అసంపూర్తి మిగులుతున్నాయి. ఇక పాకిస్తాన్‌–ఆఫ్గానిస్తాన్‌ మధ్య చైనా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా పాకిస్తాన్‌ తన బుద్ధి కుక్కతోక చందమే అని మరోసారి నిరూపించుకుంది. […]

Pakistan Afghanistan Conflict 2026: పాకిస్తాన్‌ను ప్రపంచంలో ఏ దేశమూ నమ్మదు. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందో.. తర్వాత నిర్ణయం ఎలా మార్చుకుంటుందో తెలియదు. మరోవైపు ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న దేశం. అందుకే తాజాగా ఇరాన్‌–అమెరికా శాంతి చర్చల సందర్భంలోనూ ఇరాన్‌ పాకిస్తాన్‌ను పూర్తిస్థాయిలో నమ్మడం లేదు. అందుకే చర్చలు అసంపూర్తి మిగులుతున్నాయి. ఇక పాకిస్తాన్‌–ఆఫ్గానిస్తాన్‌ మధ్య చైనా శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించడం ద్వారా పాకిస్తాన్‌ తన బుద్ధి కుక్కతోక చందమే అని మరోసారి నిరూపించుకుంది. తాజాగా ఆఫ్గానిస్తాన్‌లోని యూనివర్సిటీపై దాడి చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెంచింది. ఈ దాడిలో ఏడుగురు మరణించారు. 85 మంది గాయపడ్డారు.

రెండు దేశాల వాదనలు..
చైనాలో శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత ఈ దాడి జరగడం ఆఫ్గానిస్తాన్‌కు కోపం తెప్పించింది. ‘దాడులు ఆపమని పాకిస్తాన్‌ ఒప్పుకున్న తర్వాతే మేము ఒప్పందానికి అంగీకరించాము‘ అని పేర్కొంది. అయినా పాకిస్తాన్‌ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని ఆరోపించింది. మరోవైపు పాకిస్తాన్‌ మాత్రం ఈ దాడి తమది కాదని ప్రకటించింది. నిర్దోషులను చూపించుకుంటోంది.

ఉగ్రవాద ఆరోపణలతో కవ్వింపు..
ఆఫ్గానిస్తాన్‌లో తెహ్రీక్‌–ఎ–పాకిస్తాన్‌(టీటీపీ) ఉగ్రవాదులకు ఆఫ్గానిస్తాన్‌ ఆశ్రయం ఇస్తోందని పాకిస్తాన్‌ ఆరోపిస్తోంది. ఈ కారణంగా ఆఫ్గానిస్తాన్‌ సరిహద్దు ప్రాంతాల్లో తరచూ దాడులు చేస్తూ కవ్విస్తోంది. అయితే ఈ దాడుల్లో ఉగ్రవాదులు ఉన్నారా లేదా అని పక్కనపెట్టి, సామాన్య ప్రజలు మాత్రమే బలవికారులవుతున్నారు.

శాంతి ఒప్పందం విఫలం
చైనా మధ్యవర్తిత్వంతో కుదిరిన శాంతి ఒప్పందం మరోసారి పరిష్కారం కాకుండా పోయింది. రెండు దేశాలు పరస్పర ఆరోపణలతో సంబంధాలు మరింత చెడిపోతున్నాయి. ప్రాంతీయ భద్రతకు ఇది మరో ఆటంకిగా మారింది.

టీటీపీ ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో పాకిస్తాన్‌ ఆఫ్గాన్‌ సరిహద్దు దాడులను పెంచింది. ఈ దాడుల్లో సైనికులు కాకుండా పౌరులే బాధితులవుతున్నారు. ఈ ఉద్రిక్తతలు చైనా, భారత్‌లాంటి పొరుగు దేశాల భద్రతను కూడా ప్రభావితం చేస్తాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper