Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu Pawan Kalyan Alliance: జనసేనతో పొత్తు.. పవన్ తో బంధం.. చంద్రబాబు క్లారిటీ

Chandrababu Naidu Pawan Kalyan Alliance: జనసేనతో పొత్తు.. పవన్ తో బంధం.. చంద్రబాబు క్లారిటీ

Chandrababu Naidu Pawan Kalyan Alliance: ఇప్పటి రాజకీయంలో నాయకులకు కొదువ లేదు. ఉండాల్సింది పార్టీ ముద్ర. రాజకీయ పార్టీ అండదండలు లేనిది ఎవరు నాయకుడిగా మనలేరు. గతంలో ప్రతి ఎన్నికల్లోను ఇండిపెండెంట్ ల హవా ఉండేది కానీ. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితికి తావు లేదు. కచ్చితంగా నాయకులకు ఏదో ఒక పార్టీ అండ ఉండాల్సిందే. ఆ పార్టీ టిక్కెట్ పై పోటీ చేయాల్సిందే. అది తప్పని చర్య కూడా. అందుకే రాజకీయ పార్టీలు అన్నాక […]

Chandrababu Naidu Pawan Kalyan Alliance: ఇప్పటి రాజకీయంలో నాయకులకు కొదువ లేదు. ఉండాల్సింది పార్టీ ముద్ర. రాజకీయ పార్టీ అండదండలు లేనిది ఎవరు నాయకుడిగా మనలేరు. గతంలో ప్రతి ఎన్నికల్లోను ఇండిపెండెంట్ ల హవా ఉండేది కానీ. ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితికి తావు లేదు. కచ్చితంగా నాయకులకు ఏదో ఒక పార్టీ అండ ఉండాల్సిందే. ఆ పార్టీ టిక్కెట్ పై పోటీ చేయాల్సిందే. అది తప్పని చర్య కూడా. అందుకే రాజకీయ పార్టీలు అన్నాక నేతలు చాలా జాగ్రత్తగా ఉంటారు. అధినేతల విషయంలో గౌరవభావంతో మెలుగుతుంటారు. కానీ ఏపీలో కూటమి విషయంలో వారి వైఖరి మారుతోంది. జనసేనతో కలిసి వెళ్లడం తెలుగుదేశం పార్టీ సీనియర్లకు ఇష్టం లేదు. టిడిపితో వెళ్లడం జనసేన నేతలకు నచ్చడం లేదు. ఎప్పటికప్పుడు ఏదో రకమైన ఇబ్బందులు తెచ్చి పెడుతూనే ఉన్నారు. కానీ అధినేతలు మాత్రం సర్దుకుపోవాలని సూచిస్తున్నారు. అయితే ఇప్పటివరకు బాహటంగా దీనిని చెప్పుకొచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన సైనికులకు. ఇప్పుడు చంద్రబాబు సైతం సర్దుకు పోవాల్సిందేనని తేల్చి చెప్పారు టిడిపి శ్రేణులకు.

* పవన్ నోట పదే పదే…
మరో 15 సంవత్సరాల పాటు కూటమి కొనసాగుతుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతూ వచ్చారు. సొంత పార్టీ శ్రేణులకు సర్దుబాటు చేసుకోవాలని సూచిస్తూ వచ్చారు. ఇప్పుడే కాదు పవన్ కళ్యాణ్ మొన్నటి ఎన్నికలకు ముందు కూడా ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. ఎట్టి పరిస్థితుల్లో టిడిపి తో సర్దుబాటు ధోరణితో ముందుకు వెళితేనే జనసేనకు భవిష్యత్తు ఉంటుందని ఒక విధంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే మాట చెప్పారు. జనసేనకు శతశాతం విజయం దక్కింది. అయినా సరే పవన్ వైఖరిలో మార్పు రాలేదు. ఇప్పటికీ జన సైనికులకు సర్దుబాటు చేసుకోవాల్సిందేనని తేల్చి చెప్పారు. ఎన్నికలకు ముందు తర్వాత పొత్తు ఇష్టం లేని నేతలు బయటకు వెళ్ళిపోవచ్చు అని కూడా చెప్పారు పవన్.

* చంద్రబాబు సైతం స్పష్టత..
అయితే నిన్ననే జరిగిన టిడిపి కార్యవర్గ ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పార్టీ శ్రేణులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు చంద్రబాబు. ఎవరికి ఇష్టం ఉన్నా లేకున్నా జనసేనతో కలిసి నడుస్తామని తేల్చి చెప్పారు. సర్దుకు పోవాల్సిందేనని టిడిపి సీనియర్లకు స్పష్టతనిచ్చారు. ఎవరి పేరు చెప్పకుండా ఫ్లెక్సీ ల పేరుతో.. ప్రోటోకాల్ పేరుతో ఇబ్బందులు పెడితే కుదరని పనిగా తేల్చేశారు. పవన్ కళ్యాణ్ తో లాంగ్ జర్నీ ఉంటుందని సీనియర్లకు నేరుగా చెప్పారు చంద్రబాబు. దీంతో ఇష్టం ఉన్నవారు ఉండండి.. లేనివారు వెళ్లిపోండి అన్నట్టు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ తో తన బంధం గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. తనతో పాటు పవన్ కళ్యాణ్ కు గౌరవం ఇవ్వాల్సిందేనని తేల్చేశారు. ప్రస్తుతం చంద్రబాబు కామెంట్స్ పై తెలుగుదేశం పార్టీలో బలమైన చర్చ నడుస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper