Jeffrey Epstein: అమెరికా అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ కొనసాగుతున్నప్పుడు.. మోనికా లెవన్స్ అనే మహిళతో సాగించిన వ్యవహారం తెరపైకి వచ్చింది. అది అమెరికానే కాదు, యావత్ ప్రపంచాన్నీ కలవరపాటుకు గురిచేసింది. ఇప్పుడు అమెరికాను ఓ వ్యవహారం ఒక కుదుపు కుదుపుతోంది. ఇందులో మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ నుంచి మొదలు పెడితే హాలీవుడ్ దర్శకుడు వూడి అలెన్ వరకు అందరి చీకటి బాగోతాలు ఉన్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా జెఫ్రీ ఎప్ స్టీన్ ఉదంతం ప్రకంపనుల సృష్టిస్తోంది. ఈ వ్యవహారంలో ఇంకా కొన్ని ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. అవి కాస్త సంచలనానికి కారణమవుతున్నాయి. జెఫ్రి ఎప్ స్టీన్ అనే వ్యక్తి ఒక లైంగిక నేరగాడు. ఇతడికి సంబంధించిన నీలి బాగోతాలను అమెరికా హౌస్ డెమొక్రాట్ల కమిటీ వెలుగులోకి తెచ్చింది.. ఆ కమిటీ వెలుగులోకి తెచ్చిన ఫోటోలు, సందేశాలు సెలబ్రిటీల అసలు ముసుగులను బయటకు తీస్తున్నాయి. కుబేరుల నీలి బాగోతాలను బయటపెడుతున్నాయి.
జెఫ్రి కి చెందిన ప్రైవేట్ ఎస్టేట్లో సుమారు 68 ఫోటోలు దొరికాయి. ఇవన్నీ కూడా పూర్తి ప్రైవేటు ఫోటోలు. అమెరికా ప్రతినిధుల సభలోని డెమోక్రాట్ ల కమిటీ ఈ ఫోటోలను బయటపెట్టింది.. ఈ ఫోటోలలో కేవలం నేరగాళ్లు మాత్రమే కాకుండా, అమెరికా సొసైటీలో ఎంతో పేరు ఉన్న వారు ఉండడం విశేషం. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, ప్రముఖ భాషావేత్త నోవమ్, హాలీవుడ్ దర్శకుడు అలెన్ వంటి వారు ఉన్నారు. మొదట్లో ఈ ఫోటోలను ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించారని అందరూ అనుకున్నారు.. ఆ తర్వాత అవన్నీ నిజమని తెలియడంతో అమెరికా ప్రజలు ముక్కును వేలేసుకుంటున్నారు. ఫోటోలు మాత్రమే కాకుండా కొన్ని చాటింగ్ స్క్రీన్ షాట్లు కూడా బయటకు వచ్చాయి.
“నేను మీకు సౌఖ్యం అందించడానికి ఇప్పుడు అమ్మాయిలని పంపుతున్నాను” అని అర్థం వచ్చే లా ఉన్న సందేశాలు కూడా అందులో ఉన్నాయి. జెఫ్రీ నడిపిన నీలి బాగోతం ఏ స్థాయిలో ఉందో ఈ ఫోటోలు, సందేశాలు బయటపడుతున్నాయి.. అన్నట్టుగా రష్యా, లితువేనియా, ఉక్రెయిన్ దేశాల చెందిన మహిళల పాస్ పోర్ట్ కాపీలు కూడా లభించాయి. అయితే గోప్యతా కారణాల దృష్ట్యా వారి వివరాలను అధికారులు బయట పెట్టలేదు. ప్రముఖుల కోసం ఆ అమ్మాయిలను వినియోగించారని.. వారందరినీ తూర్పు యూరప్ దేశాల నుంచి తీసుకొచ్చారని అమెరికా మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఈ వ్యవహారంలో అధికారుల వద్ద ఏకంగా 95 వేల ఫోటోల వరకు ఉన్నాయని.. అవన్నీ ఆ ఎస్టేట్లో ఉన్న వివిధ పరికరాల ద్వారా సేకరించిన వాని తెలుస్తోంది. మరోవైపు జఫ్రీ చాలామంది బాలికలను దారుణంగా హింసించాడని 2019లో కేసు నమోదు అయింది.. అతడు అరెస్ట్ కూడా అయ్యాడు. దీంతో జైలు గదిలో అతడు అత్యంత అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు.. అతడు మరణించినప్పటికీ.. ఎస్టేట్ వ్యవహారంలో పాలు పంచుకున్న వారందరి వివరాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి.