Josh Inglis: డబ్బంటే ఎవరికీ చేదు. డబ్బులు సంపాదించడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని అనుసరిస్తుంటారు. కొందరేమో మోసాలు చేస్తే.. మరికొందరేమో ఉన్న అవకాశాలలో కొత్త వాటిని వెతుకుని దర్జాగా సంపాదిస్తుంటారు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ప్లేయర్ జోష్ ఇంగ్లిస్ ముందు వరుసలో ఉంటాడు. ఆస్ట్రేలియా టి20 జట్టులో దూకుడుగా ఆడే ఆటగాడిగా జోష్ ఇంగ్లిస్
పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇతని గురించి భారతీయ స్పోర్ట్స్ మీడియాలో విపరీతమైన చర్చ జరుగుతోంది.
ఇంగ్లిస్ ను 8.6 కోట్లకు లక్నో జట్టు ఇటీవలి ఐపిఎల్ లో కొనుగోలు చేసింది.. వాస్తవానికి అతడు పంజాబ్ జట్టులో కొనసాగుతున్నాడు. వచ్చే ఐపీఎల్ కు నాలుగు మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటానని చెప్పడంతో పంజాబ్ జట్టు అతడిని విడుదల చేసింది. నవంబర్ 15న రిటెన్షన్ గడువుకు దాదాపు 45 నిమిషాల ముందు అతడు ఈ విషయాన్ని పంజాబ్ జట్టు యాజమాన్యానికి చెప్పడంతో.. వారు అతడిని విడుదల చేశారు..ఇదే విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలికి చెప్పింది. వేలంలోకి వచ్చిన అతడిని లక్నో జట్టు కొనుగోలు చేసింది.. అతడిని లక్నో యాజమాన్యం 8.6 కోట్లకు కొనుగోలు చేసింది.
వచ్చే ఏడాది ఏప్రిల్ 18న ఇంగ్లిస్ వివాహం చేసుకోబోతున్నాడు. ఆ తర్వాత వెంటనే హనీమూన్ వెళ్లేందుకు అతడు ప్రణాళికల రూపొందించుకున్నాడు. ఫలితంగా మే నెల చివరిలో పది నుంచి 14 రోజులు మాత్రమే అందుబాటులో ఉంటానని పంజాబ్ జట్టు యాజమాన్యానికి అతడు చెప్పాడు. దీంతో పంజాబ్ యాజమాన్యం అతడిని విడుదల చేసింది. అయితే ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా బీసీసీఐ అధికారులను కలవాలని పంజాబ్ యాజమాన్యం భావిస్తోంది.
ఇంగ్లిస్ కోసం హైదరాబాద్, లక్నో జట్లు తీవ్రంగా పోటీపడ్డాయి. చివరికి లక్నో యాజమాన్యం అతడిని 8.6 కోట్లకు కొనుగోలు చేసింది.. గతంలో అతడిని పంజాబ్ జట్టు 2.6 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ప్రకారం ఈ సీజన్లో అతడికి దాదాపు 6 కోట్ల వరకు ఎక్కువ ముట్టింది.. లక్నో జట్టు అతడిని ఆ స్థాయిలో ధరపెట్టి కొనుగోలు చేయడంతో ఇంగ్లిస్ మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 18న వివాహం జరిగిన తర్వాత.. అతడు నేరుగా ఐపీఎల్ ఆడతాడని తెలుస్తోంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత అతడు హనీమూన్ వెళ్తాడని తెలుస్తోంది.. ” అతడికి ఊహించని విధంగా డబ్బు వచ్చింది. అలాంటప్పుడు అతడు తన ప్రణాళికలను మార్చుకోవచ్చు. వివాహం చేసుకొని, నేరుగా అతడు ఐపీఎల్లోకి ప్రవేశిస్తాడు.. ఇప్పటికే ఈ విషయాన్ని ఆస్ట్రేలియా ఆటగాడు లాంగర్ తో ఇంగ్లిస్ పంచుకున్నాడని” జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇంగ్లిస్ ఇటీవలి ఐపిఎల్ సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 11 మ్యాచ్లలో 30.8 సగటుతో 162.6 స్ట్రైక్ రేట్ తో 278 పరుగులు చేశాడు.. ముంబై జట్టుతో జరిగిన చివరి మ్యాచ్లలో అతడు తీవ్రమైన ప్రభావం చూపించాడు. చివరి లీగ్ మ్యాచ్లో 42 బంతులు ఎదుర్కొని 73 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. క్వాలిఫైయర్ 2 లో అతడు 21 బంతులు ఎదుర్కొని 38 పరుగులు చేశాడు. పంజాబ్ జట్టు ఫైనల్ చేరుకోవడానికి తన వంతు పాత్ర పోషించాడు.