Homeఅంతర్జాతీయంKohinoor diamond controversy: మళ్లీ కోహినూర్‌ పంచాయితీ .. న్యూయార్క్‌ మేయర్‌ సంచలన ప్రకటన!

Kohinoor diamond controversy: మళ్లీ కోహినూర్‌ పంచాయితీ .. న్యూయార్క్‌ మేయర్‌ సంచలన ప్రకటన!

Kohinoor diamond controversy: కోహినూర్‌ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వజ్రంగా గుర్తింపు పొందింది. భారత దేశంలో లభించిన ఈ వజ్రం ఇప్పుడు భారత్‌లో లేదు. బ్రిటిప్‌ కాలంలో ఈ వజ్రాన్ని తీసుకెళ్లారు. ప్రస్తుతం లండన్‌ మ్యూజియంలో ఉంది. దీనిని భారత్‌కు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఫలించలేదు. తాజాగా న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మామ్దానీ కింగ్‌ చార్లెస్‌ – 3 కు కోహినూర్‌ వజ్రం తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేయనుంది. 9/11 స్మారక చిహ్నం వద్ద […]

Kohinoor diamond controversy: కోహినూర్‌ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వజ్రంగా గుర్తింపు పొందింది. భారత దేశంలో లభించిన ఈ వజ్రం ఇప్పుడు భారత్‌లో లేదు. బ్రిటిప్‌ కాలంలో ఈ వజ్రాన్ని తీసుకెళ్లారు. ప్రస్తుతం లండన్‌ మ్యూజియంలో ఉంది. దీనిని భారత్‌కు తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. కానీ ఫలించలేదు. తాజాగా న్యూయార్క్‌ మేయర్‌ జోహ్రాన్‌ మామ్దానీ కింగ్‌ చార్లెస్‌ – 3 కు కోహినూర్‌ వజ్రం తిరిగి ఇవ్వాలని విజ్ఞప్తి చేయనుంది. 9/11 స్మారక చిహ్నం వద్ద రాజు భేటీ ముందు చేసిన ఈ ప్రకటన ప్రపంచవ్యాప్త చర్చను రేకెత్తించింది.

మామ్దానీ ప్రకటన
భారతీయ మూలాలున్న మేయర్‌ మామ్దానీ, రాజు–రాణి కెమిల్లాతో భేటీలో ఏకాంత సమావేశంలో కోహినూర్‌ విషయం లేవనెత్తుతానని ప్రకటించారు. అధికారిక అజెండాలో లేనప్పటికీ గౌరవపూర్వకంగా విజ్ఞప్తి చేస్తానని చెప్పారు. రాజు భేటీ తక్కువ సమయం జరిగినా, చర్చ జరిగిందా అనేది ఇంకా తెలియరాలేదు.

వజ్రం చరిత్ర
105.6 క్యారట్ల 800 సంవత్సరాల చరిత్ర కలిగిన కోహినూర్‌ కాకతీయుల కాలంలో కొల్లూరు గనుల్లో దొరికింది. మొఘలులు, పర్షియన్లు, ఆఫ్ఘన్లు, సిక్కుల చేతులు మారి 1849లో లాహోర్‌ ఒప్పందంతో బ్రిటీష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ వశంలోకి వచ్చింది. ప్రస్తుతం లండన్‌ టవర్‌లో బ్రిటిష్‌ క్రౌన్‌ జ్యువెల్స్‌లో ప్రదర్శనలో ఉంది.

భారత్‌ డిమాండ్‌
స్వాతంత్య్రం తర్వాత 1947లోనే భారత్‌ ‘జాతీయ సంపద’గా ప్రకటించి తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. 2000లో మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం, 2016లో సుప్రీం కోర్టు విచారణ జరిగినా ఫలితం లేదు. యాంటిక్విటీస్‌ యాక్ట్‌ 1972 ప్రకారం అక్రమ ఎగుమతి వస్తువులు మాత్రమే తిరిగి పొందొచ్చని సుప్రీం కోర్టు తేల్చింది.

బ్రిటన్‌ వాదన
లాహోర్‌ ఒప్పందం చట్టబద్ధమని, క్రౌన్‌ ప్రాపర్టీగా ఉందని యూకే తిరస్కరిస్తోంది. 2025లో బ్రిటిష్‌ మంత్రి ‘వారసత్వ సహకారం‘ మాత్రమే సాధ్యమని చెప్పారు. రాజ కుటుంబ వారసత్వంగా ఉండటం వల్ల తిరిగి ఇవ్వడం కష్టమని విశ్లేషకులు అంచనా.

పాకిస్తాన్, ఒడిశా జగన్నాథ సేన కూడా కోహినూర్‌ కోసం డిమాండ్‌ చేశాయి. భారత్, ఇరాన్, మూడు దేశాలు కోహినూర్‌పై తమకు హక్కు ఉందంటున్నాయి. తాజాగా మామ్దానీ ప్రకటన భారత–బ్రిటన్‌ సంబంధాల్లో కొత్త చర్చకు దారితీసింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper