Homeఅంతర్జాతీయంIran Warship IRIS Dena 75 Attack Near Sri Lanka: విశాఖలో అలరించారు.. స్వదేశానికి...

Iran Warship IRIS Dena 75 Attack Near Sri Lanka: విశాఖలో అలరించారు.. స్వదేశానికి వెళ్తుండగా ప్రాణాలు పోగొట్టుకున్నారు

Iran Warship IRIS Dena 75 Attack Near Sri Lanka: ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరు ఊహించగలరు? ఓ సినీ కవి రాశారు ఈ గీతం. అయితే ఇది నిజ జీవితానికి కూడా దగ్గరగా ఉంటుంది. గత నెల అంటే ఓ పక్షం రోజుల కిందట విశాఖలో నావీ విన్యాసాల్లో పాల్గొన్న ఇరాన్ కు చెందిన ఓ యుద్ధ విమానం స్వదేశానికి వెళుతుండగా భారీ ప్రమాదం జరిగింది. అయితే దానిని ప్రమాదం కంటే యుద్ధం […]

Iran Warship IRIS Dena 75 Attack Near Sri Lanka: ఏ నిమిషానికి ఏమి జరుగునో.. ఎవరు ఊహించగలరు? ఓ సినీ కవి రాశారు ఈ గీతం. అయితే ఇది నిజ జీవితానికి కూడా దగ్గరగా ఉంటుంది. గత నెల అంటే ఓ పక్షం రోజుల కిందట విశాఖలో నావీ విన్యాసాల్లో పాల్గొన్న ఇరాన్ కు చెందిన ఓ యుద్ధ విమానం స్వదేశానికి వెళుతుండగా భారీ ప్రమాదం జరిగింది. అయితే దానిని ప్రమాదం కంటే యుద్ధం అని సంబోధించాలి. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 87 మంది మృత్యువాత చెందడం విషాదకరం. అది కూడా మన విశాఖ నుంచి వెళ్తున్న నౌక కావడం ఆందోళన కలిగించే విషయం.

Also Read: భారత్ వరకూ వచ్చిన యుద్ధం.. అమెరికా తెగించేసింది..

* గత నెలలో ఫ్లీట్ రివ్యూ లో
గత నెలలో విశాఖలో( Vishakha ) ఫ్లీట్ రివ్యూ జరిగిన సంగతి తెలిసిందే. సాగర్ తీరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రపంచ దేశాలకు చెందిన యుద్ధనౌకలు పాల్గొన్నాయి. వాటిలో ఇరాన్ కు చెందిన ఐరిస్ దేనా- 75 కూడా ఉంది. విశాఖ బీచ్ రోడ్ లో జరిగిన ఈ పరేడ్ లో ఇరాన్ బృందానికి నేవీ కమాండర్ షేకతి నాయకత్వం వహించారు. అయితే ఇరాన్ యుద్ధ నౌకతో వచ్చిన వారిలో కేవలం 37 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడగలిగారు. గత నెల 18న ముగిసిన ఈ వేడుకల నుంచి తిరుగు ప్రయాణం అయింది ఇరాన్ యుద్ధ నౌక. స్వదేశానికి తిరిగి వెళుతుండగా బుధవారం శ్రీలంక సమీపంలో అమెరికన్ సబ్ మెరైన్ దానిపై దాడి చేసి ముంచేసింది. ఈ దాడిలో 87 మంది చనిపోయారు. మరో 68 మంది గల్లంతయ్యారు.. ఈ యుద్ధ నౌక మునిగిపోతుండగా గమనించిన శ్రీలంక కోస్ట్ గార్డ్ అక్కడకు చేరుకొని ఓ 32 మందిని కాపాడింది. చనిపోయిన 87 మంది మృతదేహాలను కూడా బయటకు తీశారు. మిగిలిన వారి ఆచూకీ లేకుండా పోయింది. అయితే ఆ యుద్ధ నౌకపై అమెరికా సబ్ మెరైన్ దాడి చేసినట్లు అమెరికా ప్రభుత్వం ధ్రువీకరించింది.

* విన్యాసాలతో ఆకట్టుకున్న వైనం..
రెండు వారాల కిందట విశాఖలో తమ విన్యాసాలతో, బ్యాండ్ తో అందరినీ అలరించింది ఇరాన్ కు( Iran) చెందిన ఐరిస్ దేనా- 75 నేవీ బృందం. అయితే ఈ విధంగా యుద్ధ వీరులు దుర్మరణం చెందడం విషాదకరం. అమెరికాకు ఇది గొప్ప విజయం కావచ్చు కానీ.. యుద్ధ విన్యాసాల నుంచి వెళుతున్న వారిపై దాడి మాత్రం అమానుషంగా ఎక్కువ మంది అభివర్ణిస్తున్నారు. అయితే ఇరాన్ కు చెందిన యుద్ధనౌక విన్యాసాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper