Iran US Talks Strategy: ఇరాన్‌తో చర‍్చలు జరుపుతున్నట్లు అవి ముందుకు వెళ్తున్నట్లు ట్రంప్ ప్రకటనలు చేస్తున్నారు. ఇరాన్ మాత్రం చర్చలు లేవని ప్రకటించింది. ట్రంప్ సీరియస్ అంశంలోనూ అవతలివారితో సంబంధం లేకుండా ఆశామాషీగా ప్రకటనలు చేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు ఇరాన్ యుద్ధంలో గెలవమని తెలిసినా అమెరికాతో చర్చలకు మొగ్గు చూపడం లేదు. మెట్టు దిగడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇప్పటికే చలా వరకు ఇరాన్‌పై విజయం సాధించాయి. ఇరాన్ టాప్ లీడర్‌షిప్‌ను అమెరికా చంపేసింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ధ్వంసం చేశారు. అయితే చర్చల విషయంలో అమెరికా, ఇరాన్ ఎవరి కారణాలు వారికి ఉన్నట్లు వ్యవహరిస్తున్నాయి. అయినా ట్రంప్ మెట్టుదిగి చర్చలకు వచ్చారు. దీనికి కారణం ఉంది. అమెరికా-ఇరాన్ మధ్య చర్చల గందరగోళం మధ్యప్రాచ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.
ట్రంప్ వ్యూహాత్మక ప్రకటనలు
అమెరికాలో యుద్ధంపై వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికాలో ఆయిల్ ధరలు పెరగడంతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఆయిల్ సరఫరాను దెబ్బతీసి ప్రపంచ దేశాలపై ఇరాన్ ఒత్తిడి పెంచుతోంది. మరోవైపు గల్‌్పదేశాలు ఇరాన్ దాడులతో ఇబ్బంది పడుతున్నాయి. అమెరికాపై కోపంగా ఉన్నాయి. ఈ అనుకోని దాడులను ఎవరూ ఊహించలేదు. ఈ నేపథ్యంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు శాంతి మంత్రం జపిస్తున్నారు. ఈ విషయంలో ట్రంప్ విజయం సాధించారు. చర్చల ప్రకటనతో ఆయిల్ ధరలు తగ్గాయి. గల్‌్ఫ దేశాలపై ఇరాన్ దాడులు ఆగాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో వేడి తగి‍్గంది. స్టాక్ మార్కెట్లు కోలుకుంటున్నాయి.
ఇరాన్ కఠిన డిమాండ్లు
ఇరాన్ అమెరికా 15 అంశాల శాంతి ప్రతిపాదనను తిరస్కరించి, 5 కఠిన షరతులు అమెరికాకు విధించింది. దాడులు ఆగాలి, భవిష్యత్ రక్షణ హామీలు, అణు కార్యక్రమాలపై ఆంక్షల నివారణ, ఆర్థిక సహాయం, ఇజ్రాయెల్ దాడులు ఆగాలి. మరోవైపు ఫిబ్రవరి 28 దాడుల తర్వాత అమెరికాను నమ్మే ప్రసక్తి లేదని స్పీకర్ గాలిబాఫ్, మోహ్సెన్ రజాయి హెచ్చరించారు. హోర్ముజ్ జలసంధి ద్వారా అపాయం లేని నౌకలకు మాత్రమే అనుమతి ప్రకటన చమురు మార్కెట్లలో ఆందోళన పెంచింది.
సైనిక-ఆర్థిక ఒత్తిడి ప్రభావం
ట్రంప్ ఒకవైపు చర్చలు అంటూనే మరోవైపు 2 వేల మంది సైనికులను మధ్య ఆసియాకు, భారీ బలగాలను ఇరాన్ దిశగా తరలిస్తున్నారు. ఇది యుద్ధ సిద్ధతలు చేస్తోంది. ఇరాన్ ఆయిల్ సరఫరా ఆపి ప్రపంచంపై ఒత్తిడి పెంచుతూ, ప్రతీకార దాడులు చేస్తామని బెదిరిస్తోంది. మరోవైపు జనీవాలో 3 గంటల చర్చలు విఫలమై, అణు చర్చల్లో ప్రతిష్టంభన నెలకొంది.
పాకిస్తాన్ ఇరాన్‌తో చర్చలకు మధ్యవర్తిత్వం చేయడానికి సిద్ధంగా ఉంది. అమెరికా సూచనలు అంగీకరించినట్లు సమాచారం. ప్రపంచ దేశాలు రెండు శిబిరాలుగా విడిపోయాయి. అమెరికా-ఇజ్రాయెల్ వైపు మద్దతు, ఇరాన్ వైపు కొన్ని దేశాలు ఉన్నాయి. ఈ తరుణంలో మళ్లీ యుద్ధం మొదలు పెట్టకుండా చర్చల ద్వారా శాంతి నెలకొల్పాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. ఇరాన్ బెట్టు, అమెరికా డ్రామా కొనసాగితే తీవ్ర పరిణామాలు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.