Homeఅంతర్జాతీయంHormuz Strait Oil Blockade: హర్మూజ్ జలసంధి కాదు.. మృత్యు మార్గంగా మార్చిన ఇరాన్

Hormuz Strait Oil Blockade: హర్మూజ్ జలసంధి కాదు.. మృత్యు మార్గంగా మార్చిన ఇరాన్

Hormuz Strait Oil Blockade: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం ముదురుతోంది. 13వ రోజు కూడా భీకరంగా యుద్ధం కనొసాగుతోంది. మరోవైపు గల్ఫ్‌ దేశాల నుంచి ఆయిల్‌ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే మూడు దేశాలు ఉత్పత్తి నిలిపివేశాయి. ఆర్మూజ్‌ జల సంధిపై ఇరాన్‌ పట్టు కొనసాగుతోంది. దీంతో అక్కడి నుంచి నౌకలు కదలడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్‌ సంక్షోభం కమ్ముకుంటోంది. అయినా ఇరాన్‌ జలసంధి నుంచి నౌకల రవాణాకు అనుమతి ఇవ్వడం లేదు. కాదని దాటే […]

Hormuz Strait Oil Blockade: ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ యుద్ధం ముదురుతోంది. 13వ రోజు కూడా భీకరంగా యుద్ధం కనొసాగుతోంది. మరోవైపు గల్ఫ్‌ దేశాల నుంచి ఆయిల్‌ సరఫరా నిలిచిపోయింది. ఇప్పటికే మూడు దేశాలు ఉత్పత్తి నిలిపివేశాయి. ఆర్మూజ్‌ జల సంధిపై ఇరాన్‌ పట్టు కొనసాగుతోంది. దీంతో అక్కడి నుంచి నౌకలు కదలడం లేదు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్‌ సంక్షోభం కమ్ముకుంటోంది. అయినా ఇరాన్‌ జలసంధి నుంచి నౌకల రవాణాకు అనుమతి ఇవ్వడం లేదు. కాదని దాటే ప్రయత్నం చేసే నౌకలను కూల్చివేస్తోంది. ఇజ్రాయిల్‌–అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్‌ చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్య ప్రపంచ ఇంధన సరఫరాను దెబ్బతీస్తోంది.

Also Read: ఒకటే దేశం.. ఒకటే ఓటీటీ రూల్.. ఓటీటీ రిలీజ్ లపై కీలక నిర్ణయం…

కీలక జలసంధి..
పర్షియన్‌ గల్ఫ్‌ను అరేబియా సముద్రంతో చేర్చే 167 కి.మీ. పొడవు, 21–52 కి.మీ. వెడల్పు ఈ అర్మూజ్‌ మార్గం ప్రపంచ చమురు రవాణాలో 20% (రోజుకు 20 మిలియన్‌ బ్యారెళ్లు), ఎల్‌ఎన్‌జీలో 25% నిర్వహిస్తుంది. ఇరాన్‌ ఉత్తర తీరం, ఒమాన్‌–యూఏఈ దక్షిణ భాగాల మధ్య షిప్పింగ్‌ లేన్లు 3 కి.మీ. వెడల్పు మాత్రమే ఉండటంతో మూసివేయడం సులభం. సౌదీ, యూఏఈ, కువైట్, ఇరాక్‌ ఎగుమతులు దీనిపై ఆధారపడతాయి.

ఇరాన్‌ సైనిక వ్యూహాలు
తాజా యుద్ధం కారణంగా పార్లమెంట్‌ ఆమోదం, సుప్రీం నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ అనుమతితో ఇరాన్‌ ఈ జల సంధిని తాత్కాలిక మూసివేసింది. రివల్యూషనరీ గార్డ్స్‌ (ఐఆర్‌జీసీ)ద్వీపాల్లో క్షిపణులు, డ్రోన్లతో సిద్ధంగా ఉన్నాయి. సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణం తర్వాత అబుదాబి, దుబాయ్, రియాద్‌పై డ్రోన్‌–మిస్సైల్‌ దాడులు చేసి, దాటే శత్రు వాహనాలను పేల్చేస్తామని హెచ్చరించారు. ఇది సైనిక డ్రిల్‌లా మొదలై రాజకీయ ఒత్తిడిగా మారింది.

వాటర్‌ బాంబులు ఏర్పాటు..
తాజాగా ఇరాన్‌ ఆర్మూజ్‌ జల సందిలో వాటర్‌ మైన్స్‌ ఏర్పాటు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒక్క షిప్‌ దాటినా ఈ మైన్స్‌ పేలుతాయి. దీంతో షిప్పులు ధ్వంసమవుతాయి. తాజాగా బ్యాంకాక్‌ నౌక జలసంధి దాటుతుండగా, ఐఆర్‌జీసీ దాడి చేసింది. దీంతో ప్రపంచం అలర్ట్‌ అయింది. మరోవైపు ఈ జలసంధిపై పట్టు సాధించేందుకు అమెరికా విఫలయ యత్నం చేస్తోంది.

భారత్‌పై ప్రభావం..
జలసంధి మూసివేతతో చమురు ధరలు పెరుగుతున్నాయి. భారత్‌లో ఇప్పటికే గ్యాస్‌ సంక్షోభం మొదలైంది. భారత్‌ 60% దిగుమతులు (రూ.10,000 కోట్ల విలువైన నౌకలు చిక్కుకున్నాయి) దెబ్బతింటాయి. ఐన్సా సురక్షిత మార్గాలు కోరింది. ఆసియా ఆర్థిక వ్యవస్థలు, చైనా–జపాన్‌కు నష్టం. 4 రోజులుగా రవాణా 86% పడిపోయింది. అమెరికా 5వ ఫ్లీట్‌ బహ్రీన్‌లో సిద్ధంగా ఉంది.

ఈ సంక్షోభం మధ్యప్రాచ్య యుద్ధాన్ని విస్తరింపజేసి, గ్లోబల్‌ ఎనర్జీ క్రై సిస్‌కు దారితీస్తుంది. ఇరాన్‌ ఐఆర్‌జీసీ ప్రకటనల ప్రకారం భారత్‌కు మార్గాలు తెరుస్తూ మిత్రదేశాలకు మినహాయించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper