Homeటాప్ స్టోరీస్Telangana Ring Roads Construction: జిల్లాకు రింగ్ రోడ్డు.. హైదరాబాద్ కి లింక్.. తెలంగాణలో రవాణా...

Telangana Ring Roads Construction: జిల్లాకు రింగ్ రోడ్డు.. హైదరాబాద్ కి లింక్.. తెలంగాణలో రవాణా గేమ్ చేజర్ కాబోతుందా?

Telangana Ring Roads Construction: కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక జాతీయ రహదారులు, రైలు మార్గాల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్క తెలంగాణలోనే 2 వేల కిలోమీటర్లకుపైగా రహదారుల నిర్మాణం చేపట్టింది. తాజాగా రేవంత్‌ సర్కార్‌ కూడా రహదారుల విస్తరణ, కొత్త మార్గాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధికి రహదారులు కీలకంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లా కేంద్రానికి రింగ్‌ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇది రాష్ట్రవ్యాప్త రవాణా వ్యవస్థను ఆధునికీకరించి, స్థానిక ఆర్థికాభివృద్ధికి […]

Telangana Ring Roads Construction: కేంద్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక జాతీయ రహదారులు, రైలు మార్గాల విస్తరణకు ప్రాధాన్యత ఇస్తోంది. ఒక్క తెలంగాణలోనే 2 వేల కిలోమీటర్లకుపైగా రహదారుల నిర్మాణం చేపట్టింది. తాజాగా రేవంత్‌ సర్కార్‌ కూడా రహదారుల విస్తరణ, కొత్త మార్గాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. అభివృద్ధికి రహదారులు కీలకంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ జిల్లా కేంద్రానికి రింగ్‌ రోడ్లు నిర్మించేందుకు ప్రణాళిక రచిస్తోంది. ఇది రాష్ట్రవ్యాప్త రవాణా వ్యవస్థను ఆధునికీకరించి, స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుంది.

Also Read: హర్మూజ్ జలసంధి కాదు.. మృత్యు మార్గంగా మార్చిన ఇరాన్

మొదట మూడు ఉమ్మడి జిల్లాల్లో..
రాష్ట్రంలోని ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రం(హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటివి) చుట్టూ రింగ్‌ రోడ్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు, ఇవి దగ్గర్లోని జాతీయ రహదారులు, హైవేలతో అనుసంధానం కలిగి ఉంటాయి. ఇది హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ (ఆర్‌ఆర్‌ఆర్, 340–347 కి.మీ. పొడవు, 4–6 లేన్లు)ను సప్లిమెంట్‌ చేస్తూ, ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌)కు వెలుపలి ప్రాంతాల్లోకి విస్తరిస్తుంది. మొత్తం 1,940 హెక్టార్ల భూమి అవసరం, భూసేకరణ ఇప్పటికే ప్రారంభమైంది.

ప్రయోజనాలు..
రింగ్‌ రోడ్ల నిర్మాణంతో 24 పట్టణాలు, 200 గ్రామాలను అనుసంధానం చేస్తుంది. దీంతో ట్రాఫిక్‌ 30 నుంచి 40 శాతం తగ్గుతుంది. లాజిస్టిక్స్‌ ఖర్చు తగ్గుతుంది. ఇండస్ట్రియల్‌ క్లస్టర్లు, లాజిస్టిక్‌ పార్కులు, రియల్‌ ఎస్టేట్, ఐటీ హబ్‌లు ఏర్పాటుకు అవకాశం కలుగుతుంది. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గ్రీన్‌ఫీల్డ్‌ రహదారులు, 72 హెక్టార్ల అటవీ భూమి రక్షణ, భవిష్యత్తులో ఆరు లేన్ల విస్తరణతో పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుంది.

ప్రణాళిక అమలులో సవాళ్లు..
భూసేకరణ ఆలస్యాలు, ఖర్చు పెరగడం ప్రధాన సమస్యలు. కానీ ఎన్‌హెచ్‌ఏఐ సహకారంతో 5 ప్యాకేజీలుగా టెండర్లు పిలిచారు. మూడేళ్లలో పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. ఈ రింగ్‌ రోడ్లు తెలంగాణను లాజిస్టిక్స్‌ హబ్‌గా మార్చి, గేమ్‌ చేంజర్‌ అవుతాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper