OTT Release Rules India: తెలుగు సినిమా ఇండస్ట్రీలో బడ్జెట్లో విపరీతంగా పెరిగిపోతున్న కారణంగా సినిమా విషయంలో ఏదైనా తేడా జరిగితే ప్రొడ్యూసర్ విపరీతంగా నష్టపోతున్నారు. కారణం ఏదైనా కూడా సినిమా బడ్జెట్లను తగ్గించాల్సిన అవసరమైతే ఉంది. ఒకవేళ బడ్జెట్ తగ్గించలేని పరిస్థితిలో సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపాల్సిన బాధ్యత దర్శకుల మీద ఉంది. ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ప్రొడ్యూసర్ సేఫ్ జోన్ లో ఉండే పరిస్థితి లేదు. ఇక దానికి తోడుగా ఓటిటి లు సైతం సినిమాని చంపేస్తున్నాయి. సినిమా రిలీజ్ అయిన వారానికే ఓటిటి లోకి వస్తుండడం వల్ల ప్రేక్షకులు ఆ సినిమాని థియేటర్లో కంటే ఓటిటి లో చూసి ఎంజాయ్ చేస్తున్నారు. కాబట్టి సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఎగ్జిబ్యూటర్స్ అందరు కలిసి నిన్న ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు.
Also Read: టాలీవుడ్ పెద్ద దిక్కు ఎవరు? సినీ ఇండస్ట్రీలో మొదలైన వివాదం…
సినిమా రిలీజ్ అయిన 8 వారాల తర్వాత మాత్రమే అది ఓటిటి లోకి రావాలని అప్పటిదాకా సినిమా రిజల్ట్ తో సంబంధం లేకుండా సినిమా థియేటర్లోనే ఆడాలని అలా అయితేనే ఎగ్జిబ్యూటర్లు సైతం సినిమాలను తీసుకుంటారని లేకపోతే తీసుకోలేమని వాళ్లు ఒక నిర్ణయానికి వచ్చారు… ఇక ఇండియా మొత్తం ఈ రూల్ పెట్టాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది…
ఇక తొందరలోనే ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసి అమలులోకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఎగ్జిబ్యూటర్స్ సంఘం అయితే ఉంది. మరి వాళ్ళు ఉన్నట్టుగా జరిగితే మాత్రం సినిమా బతుకుతుంది. లేకపోతే మాత్రం సినిమా చనిపోతుందనే చెప్పాలి. ఇక థియేటర్ కి వచ్చి ప్రేక్షకులు సినిమాని చూడాలి అనే ఒక ఆసక్తిని రేకెత్తించే విధంగా దర్శకులు సినిమాలను చేయాలి.
అలాగే ఓటిటి వాళ్లు కూడా సినిమా వాళ్లకు సపోర్ట్ చేసి తర్వాత ఓటిటి లో రిలీజ్ చేసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి వీళ్ళ నిర్ణయం అయితే బాగుంది. ఓటిటి సంస్థలు దీని మీద ఎలా స్పందిస్తాయి. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఉన్నా స్టార్ ప్రొడ్యూసర్లు హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…