Homeఅంతర్జాతీయంIran War Effect On UK Energy: ఇరాన్‌ వార్‌ ఎఫెక్ట్‌.. బ్రిటన్‌లో పొయ్యి వెలగే...

Iran War Effect On UK Energy: ఇరాన్‌ వార్‌ ఎఫెక్ట్‌.. బ్రిటన్‌లో పొయ్యి వెలగే పరిస్థితి లేదు!

Iran War Effect On UK Energy: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం 12వ రోజుకు చేరింది. ఇరాన్‌ గల్ప్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో గల్ఫ్‌ దేశాల్లో ఆయిల్‌ ఉత్పత్తి రవాణా భారీగా తగ్గింది. ఇక ఆర్మూజ్‌ జల సంధి మూసివేతతో రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో ఇప్పటికే పాకిస్తాన్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా బ్రిటన్‌ భయంకర ప్రభావం ఎదుర్కొంటోంది. యుద్ధమే సంక్షోభానికి కారణం.. ఇరాన్, అమెరికా–ఇజ్రాయిల్‌ మధ్య […]

Iran War Effect On UK Energy: పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా–ఇజ్రాయెల్‌ చేస్తున్న యుద్ధం 12వ రోజుకు చేరింది. ఇరాన్‌ గల్ప్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేస్తోంది. దీంతో గల్ఫ్‌ దేశాల్లో ఆయిల్‌ ఉత్పత్తి రవాణా భారీగా తగ్గింది. ఇక ఆర్మూజ్‌ జల సంధి మూసివేతతో రవాణా పూర్తిగా స్తంభించింది. దీంతో ఇప్పటికే పాకిస్తాన్, చైనా, శ్రీలంక, బంగ్లాదేశ్‌ ఇబ్బంది పడుతున్నాయి. తాజాగా బ్రిటన్‌ భయంకర ప్రభావం ఎదుర్కొంటోంది.

యుద్ధమే సంక్షోభానికి కారణం..
ఇరాన్, అమెరికా–ఇజ్రాయిల్‌ మధ్య యుద్ధం ప్రపంచ ఇంధన మార్కెట్‌ను ప్రభావితం చేస్తోంది. బ్రిటన్‌లో గ్యాస్‌ నిల్వలు 2–3 రోజులకు మాత్రమే సరిపోనున్నాయి. యుద్ధానికి ముందు రోజుకు 80 వేల గిగావాట్‌–అవర్ల పవర్‌ జనరేషన్‌ గ్యాస్‌ ఉండేది. ఇప్పుడు అది 6,700కి పడిపోయింది. ఫలితంగా, గృహాల్లో వెచ్చదనం, వాహన ఇంధన సరఫరా పూర్తిగా ఆగిపోయాయి. కనీసం పొయ్యి వెలిగించి వంట చేసుకునే పరిస్థితి లేదు.

పొయ్యి, హీటర్లు ఆగిపోయాయి..
బ్రిటన్‌ పౌరులు చలికాల గ్రీష్మంలో తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. రూం హీటర్లు, వంటల పొయ్యిలు వెలిగించలేక, రోజువారీ జీవితం మొత్తం ఆగిపోయింది. వాహనాలకు డీజిల్, పెట్రోల్‌ దొరకడం లేకపోవడంతో రవాణా వ్యవస్థ కూడా స్తంభిస్తోంది. ఆర్థిక హాని, పర్యావరణ ప్రభావాలను పెంచుతోంది.

యూరప్‌కు ఉపశమనం
భారత్‌ రష్యా నుంచి చమురు దిగుమతి చేసి రిఫైన్‌ చేసి యూరప్‌ దేశాలకు సరఫరా చేస్తోంది. ఈ వ్యూహం ప్రపంచ ఇంధన గందరగోళాన్ని తగ్గించింది. అయితే, బ్రిటన్‌ యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటపడిన తర్వాత ఈ సరఫరాల నుంచి మినహాయించబడింది. ఫలితంగా, ఇతర యూరప్‌ దేశాలు కొంత స్థిరత్వం పొందగా, బ్రిటన్‌ మాత్రం ఏకైకంగా కష్టాలు ఎదుర్కొంటోంది.

బ్రెక్సిట్‌ నిర్ణయం ఇప్పుడు బ్రిటన్‌కు రివర్స్‌ అయింది. యూరప్‌ సరఫరా గొలుసుల నుంచి దూరంగా పడటంతో సంక్షోభం తీవ్రతరం. భారత్‌ వంటి దేశాల రిఫైనింగ్‌ సామర్థ్యం ప్రపంచాన్ని కాపాడుతోంది. దీర్ఘకాలంలో బ్రిటన్‌కు పునరుత్పాదక ఇంధనాలు, కొత్త దిగుమతి ఒప్పందాలు, యూరప్‌తో మళ్లీ సహకారం అవసరం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper